Barabar Premistha : గ్రామీణ ప్రేమకథ
ABN , Publish Date - Dec 21 , 2024 | 03:55 AM
చంద్రహాస్ కథానాయకుడిగా సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’. గెడాచందు, గాయత్రి చిన్ని, ఏవీఆర్ నిర్మిస్తున్నారు. మేఘనా ముఖర్జీ కథానాయిక. అర్జున్ మహీ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. త్వరలోనే
చంద్రహాస్ కథానాయకుడిగా సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’. గెడాచందు, గాయత్రి చిన్ని, ఏవీఆర్ నిర్మిస్తున్నారు. మేఘనా ముఖర్జీ కథానాయిక. అర్జున్ మహీ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు వి.వి వినాయక్ చేతుల మీదుగా మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా చంద్రహాస్ మాట్లాడుతూ ‘తెలంగాణలోని రుద్రారం అనే ఊరి నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథను ఈ సినిమాలో చూపించబోతున్నాం. ధ్రువన్ సంగీతం అద్భుతంగా అలరిస్తుంది’ అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ ‘అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా మా చిత్రం ఉంటుంది. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’ అని చెప్పారు.
టీజర్ విషయానికి వస్తే.. ‘బరాబర్ ప్రేమిస్తా’ టీజర్ చూస్తుంటే.. ఈ సినిమా లవ్, యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కినట్టుగా తెలుస్తోంది. తెలంగాణలోని రుద్రారం అనే ఊరి నేపథ్యంగా ఆసక్తికరంగా కథా కథనాలు ఉన్నాయి. పరస్పరం గొడవలు పడే ఊరిలో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని చూపించబోతున్నట్లు టీజర్‌తో తెలుస్తోంది. ‘నువ్వు నన్ను కొడతాంటె నొప్పి నీ కళ్లలో తెలుస్తుందేంట్రా..’ డైలాగ్ హైలెట్‌గా నిలుస్తోంది.