Barabar Premistha: మ‌రోసారి ముద్దులతో.. రెచ్చిపోయిన అటిట్యూడ్ స్టార్‌! ఎరోటిక్.. సాంగ్ రిలీజ్‌

ABN , Publish Date - Jan 27 , 2026 | 08:28 PM

గ‌తేడాది రామ్‌న‌గ‌ర్ బ‌న్నీ అనే సినిమాతో ప్రేక్ష‌కుల ఎదుట‌కు వ‌చ్చి ఫ‌ర్వాలేద‌ని అనిపించుకున్న‌ అటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ ఇప్పుడు బ‌రాబ‌ర్ ప్రేమిస్తా అనే సినిమాతో అల‌రించేందుకు సిద్ధ‌మ‌య్యాడు.

Barabar Premistha

గ‌తేడాది రామ్‌న‌గ‌ర్ బ‌న్నీ అనే సినిమాతో ప్రేక్ష‌కుల ఎదుట‌కు వ‌చ్చి ఫ‌ర్వాలేద‌ని అనిపించుకున్న‌ అటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ (Chandrahass) ఇప్పుడు బ‌రాబ‌ర్ ప్రేమిస్తా (Barabar Premistha) అనే సినిమాతో అల‌రించేందుకు సిద్ధ‌మ‌య్యాడు. మేఘ‌న ముఖ‌ర్జీ (Megna Mukherjee) క‌థానాయిక‌గా న‌టించ‌గా సంప‌త్ రుద్ర (Sampath Rudra) ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అయితే చాలా రోజుల క్రిత‌మే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎట్ట‌కేల‌కు ఫిబ్ర‌వ‌రి 6న థియేట‌ర్లకు రానుంది.

ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచారు. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన పాట‌లు, టీజ‌ర్, ట్రైల‌ర్ మంచి ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకోగా తాజాగా మ‌ళ్లీ మ‌ళ్లీ (Malli Malli Lyrical Video) అంటూ సాగే లవ్ ఎరోటిక్ సాంగ్‌ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు జ‌యంత్ సీ ప‌రాన్జీ చేతుల మీదుగా విడుద‌ల చేశారు.

సంగీత ద‌ర్శ‌కుడు ద్రువ‌న్ స్వ‌యంగా పాట‌కు సాహిత్యం అందించ‌గా ప్ర‌ముఖ బాలీవుడ్ సింగ‌ర్ మ‌హ్మ‌ద్ ఇర్ఫాన్ (Mohammed Irfan) ఆల‌పించ‌డం విశేషం. పాట ఆసాంతం హీరో హీరోయిన్ల‌ మ‌ధ్య‌నే సాగుతూ.. ప్రేమ‌లో ఉన్న ఇద్ద‌రు ల‌వ‌ర్స్ వారి విర‌హా వేద‌న‌ను ఆల‌పిస్తూ వారి మ‌ధ్య ల‌స్ట్‌ను తెలియ‌జేస్తూ వినే వారికి, చూసే వారిని క‌వ్వించేలా ఉంది. చంద్ర‌హాస్ గ‌త సినిమాలోలానే ఇందులోనూ రొమాంటిక్ ముద్దు సీన్ల‌తో చెల‌రేగి పోయాడు. ప్ర‌స్తుతం ఈ పాట యూట్యూబ్‌లో వైర‌ల్ అవుతోంది.

Updated Date - Jan 27 , 2026 | 08:52 PM