TGEAPCET టాపర్ రుషి కలను నిజం చేసిన చిరంజీవి!

ABN , Publish Date - May 20 , 2026 | 04:11 PM

టీజీ ఈఏపీసెట్ (TG EAPCET) ఫలితాల్లో స్టేట్ టాప్ ర్యాంక్ సాధించిన విద్యార్థిని ఎమ్. రుషి సరికొత్త రికార్డు సృష్టించడమే కాకుండా, తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక అద్భుతమైన క్షణాన్ని సొంతం చేసుకుంది.

TG EAPCET Topper Rushi Meets Chiranjeevi

టీజీ ఈఏపీసెట్ (TG EAPCET) ఫలితాల్లో స్టేట్ టాప్ ర్యాంక్ సాధించిన విద్యార్థిని ఎమ్. రుషి (M. Rushi) సరికొత్త రికార్డు సృష్టించడమే కాకుండా, తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక అద్భుతమైన క్షణాన్ని సొంతం చేసుకుంది. ఈ పరీక్షలో గనుక తను స్టేట్ టాప్ ర్యాంక్ సాధిస్తే.. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)ని స్వయంగా కలిపిస్తానని ఆమె తండ్రి గతంలో ఒక ప్రామిస్ చేశారు. తండ్రి ఇచ్చిన ఆ మాటను మనసులో ఉంచుకుని కష్టపడి చదివిన రుషి, అనుకున్నట్లే అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని మెగాస్టార్‌ను కలిసే సువర్ణావకాశాన్ని దక్కించుకుంది.


ఈ రోజు (బుధవారం) ఈ యువ సాధకురాలి కల నిజమైంది. స్టేట్ టాపర్ రుషి (Rushi) ప్రతిభ గురించి తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి, ఆమెను స్వయంగా తన నివాసానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రుషిని, ఆమె కుటుంబ సభ్యులను చిరంజీవి ఎంతో ఆత్మీయంగా పలకరించారు. అంతటి ప్రతిభ కనబరిచినందుకు ఆమెను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, శాలువాతో సత్కరించి గౌరవించారు. రుషి కలను నిజం చేస్తూ.. ఆమె ప్రతిభకు గుర్తింపుగా చిరంజీవి ఒక ల్యాప్‌టాప్‌ (Laptop Gift)ను బహుమతిగా అందించారు. అభిమాన నాయకుడిని ఇంత దగ్గరగా కలవడం, ఆయన చేతుల మీదుగానే ప్రశంసలు అందుకోవడంపై రుషి, ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి, ఆనందానికి గురయ్యారు.


రుషి భవిష్యత్తులో ఇంజనీరింగ్ చదవాలని, ఆ తర్వాత ఐఏఎస్ (IAS) ఆఫీసర్ కావాలని ఆకాంక్షిస్తోందని తెలుసుకుని చిరంజీవి ఎంతో సంతోషించారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తాము ఎల్లప్పుడూ తోడుగా ఉంటామని రుషికి, ఆమె తల్లిదండ్రులకు ఆయన హామీ ఇచ్చారు. ‘‘దేనికైనా సరే నన్ను సంప్రదించడానికి అస్సలు వెనుకాడకండి. నన్ను మీ కుటుంబంలో ఒక అన్నలాగా, పెద్ద దిక్కులాగా భావించండి. అమ్మాయి తన కలను నిజం చేసుకునేలా మరింత ప్రోత్సహించండి’’ అని రుషి తల్లిదండ్రులకు చెప్పి.. మరోసారి చిరంజీవి తన గొప్ప మనసు చాటుకున్నారు.

ఇవి కూడా చదవండి:

చిరుకి కాదు.. బాలయ్యకు విలన్‌గా మనోజ్!

Peddi Movie: 24 గంటల్లో ‘పెద్ది’ ట్రైలర్ బీభత్సం.. హిస్టారికల్ రికార్డ్!

యంగ్ టైగర్‌కు పవర్ స్టార్ బర్త్‌డే విషెస్.. ట్వీట్ వైరల్!

నాకు కాబోయే భర్త ఇండస్ట్రీ వ్యక్తి కాకూడదు: అనన్య నాగళ్ల

Updated Date - May 20 , 2026 | 04:35 PM

Chiranjeevi - Bobby: బాస్‌.. బాబీ.. సెట్స్‌ మీదకు వెళ్లడమే తరువాయి..

Chiranjeevi - Indra: అలా అంటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది.. చిరు వీడియో వైరల్‌!

Mega158: చిరుతో రాజాసాబ్ బ్యూటీ రొమాన్స్.. మహా దారుణం ఇది

Mega158: మాస్ వర్కవుట్స్‌తో మెగా158 అప్డేట్.. చిరు వీడియో వైరల్!

Mega158: ‘చిరు158’ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్, మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్!