సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ట్రెండ్‌లోకి మరో బ్యూటీ! ఇక పరువాల విందే!

ABN, Publish Date - Apr 23 , 2026 | 08:48 PM

ఈ మధ్యకాలంలో బాగా వార్తలలో నిలుస్తోన్న అంశం.. సెలబ్రిటీల ‘పెయిడ్ సబ్‌స్క్రిప్షన్స్’. సోషల్ మీడియా అకౌంట్స్‌లో ఫాలోయర్స్‌ని పెంచుకుంటూ, వారికి అందాల ఎర వేస్తూ, సబ్‌స్క్రిప్షన్ వైపు ఆకర్షిస్తున్నారు.

Ashu Reddy

ఈ మధ్యకాలంలో బాగా వార్తలలో నిలుస్తోన్న అంశం.. సెలబ్రిటీల ‘పెయిడ్ సబ్‌స్క్రిప్షన్స్’. సోషల్ మీడియా అకౌంట్స్‌లో ఫాలోయర్స్‌ని పెంచుకుంటూ, వారికి అందాల ఎర వేస్తూ, సబ్‌స్క్రిప్షన్ వైపు నడిపించుకుంటున్నారు. కాస్త పేరున్న భామలందరూ ఇప్పుడీ బాటలోనే నడిచేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విష్ణు ప్రియ (Vishnu Priya), అనన్య నాగళ్ల (Ananya Nagalla) వంటి నటీమణులు ఈ పద్ధతి ద్వారా తమ సోషల్ మీడియా క్రేజ్‌ని, ఆదాయ మార్గంగా మార్చుకోగా.. ఇప్పుడు మరో సోషల్ మీడియా స్టార్ అషు రెడ్డి (Ashu Reddy) కూడా అదే బాటలో పయనిస్తున్నారు. తాజాగా ఆమె కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ‘పెయిడ్ సబ్‌స్క్రిప్షన్స్’ ట్రెండ్‌లోకి అడుగుపెట్టినట్లుగా చెబుతూ ఓ వీడియోను షేర్ చేశారు. ఇప్పుడా వీడియో వైరల్ అవుతోంది.


నటిగా, బిగ్ బాస్ ఫేమ్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న ఈ బ్యూటీ, తన ఫాలోయర్స్ కోసం నెలకు రూ. 399 రుసుముతో ఎక్స్‌క్లూజివ్ కంటెంట్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లుగా ఈ వీడియోలో నవ్వుతూ తెలుపుతున్నారు. ప్రస్తుతం ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు మిలియన్లకు పైగా ఫాలోయర్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ, తాజా ఫొటో షూట్స్‌తో సందడి చేసే అషు రెడ్డి, తన పాపులారిటీని క్యాష్ చేసుకునే ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు. సబ్‌స్క్రిప్షన్ ఫీచర్‌ను లాంచ్ చేసిన ఒక్క రోజులోనే ఆమెకు దాదాపు 700 మందికి పైగా సబ్‌స్క్రైబర్లు చేరడం విశేషం. ఈ లెక్కన చూస్తే, కేవలం ఒక్క రోజులోనే దాదాపు రూ. 3 లక్షల ఆదాయాన్ని సునాయాసంగా అందుకున్నారని తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఈ సబ్‌స్క్రైబర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే అమ్మడి పరువాల పవర్ అలాంటిది మరి.


రామ్ గోపాల్ వర్మకే మతిపోగొట్టిన అందం అషు రెడ్డి సొంతం. అలాంటి భామ అందరికీ పరువాల విందు ఇస్తానంటే, పైకం చెల్లించకుండా ఉండగలరా? అందుకే, సబ్‌స్క్రైబర్ అయ్యేందుకు క్యూ కడుతున్నారు. తెలుగు సినిమాల్లో కొన్ని పాత్రలతో మెరిసినప్పటికీ, అషు రెడ్డికి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ అసాధారణమని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆమె షేర్ చేసే గ్లామరస్ ఫోటోషూట్స్, వీడియోలకు యూత్ నుండి భారీ స్థాయిలో ఆదరణ లభిస్తుంటుంది. తనకంటూ ఉన్న ఈ బలమైన ఫాలోయింగ్‌ను, అభిమానులకు ఇలా సబ్‌స్క్రిప్షన్ పేరిట కొత్త ఆదాయ వనరుగా మార్చుకుంటోంది. ప్రస్తుతం ఈ అంశంపైనే భారీ స్థాయిలో చర్చలు నడుస్తున్నాయి. ఈ సబ్‌స్క్రిప్షన్ విషయమై పోలీసులకు కూడా ఫిర్యాదులు అందుతున్నట్లుగా తెలుస్తోంది. ఆల్రెడీ విష్ణు ప్రియపై కేసు కూడా నమోదైంది. మరి, ఈ విధానానికి అంతం, అదుపు.. ఏ రూపంలో ఉంటుందనేది తెలియాలంటే మాత్రం వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి:

ఓటు ఎవరికి వేశాడో.. పబ్లిగ్గా చెప్పేసిన వీటీవీ గణేష్.. వీడియో వైరల్!

ధనుష్ - మృణాల్.. మళ్లీ మొదలు! అసలు విషయం ఏమిటంటే?

చిరంజీవి ఇంటికి సమీపంలోనే అల్లు అర్జున్ లగ్జరీ హౌస్.. ఎన్ని కోట్లంటే?

Updated Date - Apr 23 , 2026 | 08:48 PM