ఓటు ఎవరికి వేశాడో.. పబ్లిగ్గా చెప్పేసిన వీటీవీ గణేష్.. వీడియో వైరల్!
ABN , Publish Date - Apr 23 , 2026 | 02:41 PM
ఎంత అభిమానం ఉన్నా, ఓటు ఎవరికి వేశామనేది.. రిజల్ట్ వచ్చే వరకు ఎవరు చెప్పరు. రిజల్ట్ వచ్చిన తర్వాత చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే కొందరిని చూస్తే, వారు ఎవరికి ఓటు వేయబోతున్నారో, వేస్తారో.. క్లియర్‌గా తెలిసిపోతుంది.
ఎంత అభిమానం ఉన్నా, ఓటు ఎవరికి వేశామనేది.. రిజల్ట్ వచ్చే వరకు ఎవరు చెప్పరు. రిజల్ట్ వచ్చిన తర్వాత చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే కొందరిని చూస్తే, వారు ఎవరికి ఓటు వేయబోతున్నారో, వేస్తారో.. క్లియర్‌గా తెలిసిపోతుంది. ఇక్కడ క్యాస్ట్, మనీ బాగా పనిచేస్తాయి. వీటితో పాటు అభిమానం కూడా పని చేస్తుందని నిరూపించారు స్టార్ కమెడియన్ వీటీవీ గణేష్ (VTV Ganesh). ప్రస్తుతం జరుగుతున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో (Tamil Nadu State Elections) తను ఎవరికి ఓటు వేశారో, పబ్లిగ్గా చెప్పి అందరికీ షాకిచ్చారు. అలా చెప్పడమే కాదు, మే 4వ తేదీ వచ్చే రిజల్ట్స్‌లో నేను ఓటు వేసిన ప్రభుత్వమే విన్ అవుతుంది, ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో..
‘‘ప్రజాస్వామ్య పండుగను చూడటానికి నేను ఇక్కడికి వచ్చాను. కాబట్టి నేను నా ఓటు వేశాను. నేను టీవీకే (TVK)కి ఓటు వేశాను. సమాజాన్ని, ప్రజలను, వ్యవస్థను అప్‌గ్రేడ్ చేయడానికి విజయ్ సరైన వ్యక్తి. మీకు అర్థమైందా? నేను వేరే ఏ పార్టీ గురించి మాట్లాడాలనుకోవడం లేదు, ఎందుకంటే నేను టీవీకేకు చెందినవాడిని. టీవీకే గెలవాలని, విజయ్ దళపతి (Thalapathy Vijay) సీఎం కావాలని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా, ఇందులో ఎలాంటి సందేహం లేదు, ఓకేనా?
ఆ పార్టీ గెలుస్తుంది, ఈ పార్టీ గెలుస్తుందనేవన్నీ ఇప్పటి వరకు ఉన్న గందరగోళం మాత్రమే. ఈరోజు మాకు సమాధానం దొరికింది, అంటే ఫలితం. మే నాలుగో తేదీ వరకు వేచి ఉండండి. ఇకపై ఎలాంటి ప్రశ్నలు అవసరం లేదు. ఎందుకంటే, మేము గెలుస్తున్నాము. టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. సందేహం లేదు, ధన్యవాదాలు. యువ ఓటర్లారా, ఇది మీ భవిష్యత్తు, సరేనా? ఇంట్లో కూర్చోకండి. దయచేసి వచ్చి ఓటు వేయండి. మీ జీవితానికి ఓటు చాలా చాలా ముఖ్యం.. రాబోయే తరం కోసం.. అంతా వచ్చి ఓటేయండి, అర్థమైందా?’’ అంటూ వీటీవీ గణేష్ యువ ఓటర్లకు పిలుపునిచ్చారు. అయితే వీటీవీ గణేష్ ఇలా రివీల్ చేయడంపై రకరకాల కామెంట్స్ పడుతున్నాయి. ‘ఎవడ్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్’ అంటూ ఆయన డైలాగ్‌నే నెటిజన్లు రిపీట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, మొదటి నుంచి విజయ్ పార్టీకి వీటీవీ గణేష్ సపోర్ట్ ఇస్తూనే ఉన్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
ధనుష్ - మృణాల్.. మళ్లీ మొదలు! అసలు విషయం ఏమిటంటే?
చిరంజీవి ఇంటికి సమీపంలోనే అల్లు అర్జున్ లగ్జరీ హౌస్.. ఎన్ని కోట్లంటే?
అలా విమర్శించే వారిని వదలకండి: చంద్రబాబుకు బండ్ల సూచన