చిరంజీవి ఇంటికి సమీపంలోనే అల్లు అర్జున్ లగ్జరీ హౌస్.. ఎన్ని కోట్లంటే?

ABN , Publish Date - Apr 22 , 2026 | 03:45 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు ఈ మధ్యకాలంలో ఏ విధంగా వైరల్ అవుతుందో తెలియంది కాదు. ఏ ముహూర్తాన ‘పుష్ప’కు ఆయన సైన్ చేశారో కానీ, అప్పటి నుంచి అల్లు అర్జున్ రేంజే మారిపోయింది.

Allu Arjun Luxury Home

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) పేరు ఈ మధ్యకాలంలో ఏ విధంగా వైరల్ అవుతుందో తెలియంది కాదు. ఏ ముహూర్తాన ‘పుష్ప’ (Pushpa)కు ఆయన సైన్ చేశారో కానీ, అప్పటి నుంచి అల్లు అర్జున్ రేంజే మారిపోయింది. ‘పుష్ప’ సిరీస్ చిత్రాలతో ఇంటర్నేషనల్ స్థాయిలో క్రేజ్ రావడంతో పాటు, నేషనల్ అవార్డుతో తిరుగులేని చరిత్రను అల్లు అర్జున్ లిఖించారు. ఆ సినిమా తర్వాత ఆయన వేసే ప్రతి అడుగు సంచలనంగా కొనియాడబడుతోంది. అట్లీ‌తో చేస్తున్న ప్రాజెక్ట్, అల్లు సినిమాస్ (Allu Cinemas) బ్రాండ్.. ఇలా అల్లు అర్జున్ తన స్థాయిని రోజురోజుకూ పెంచుకుంటూ, నిత్యం వార్తలలో నిలుస్తున్నారు. ఇప్పుడు మరోసారి ఆయన పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. మామ చిరంజీవి ఇంటికి సమీపంలోనే ఆయన ఓ లగ్జరీ హౌస్‌ని నిర్మించుకుంటున్నారట.


హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఉండే విలాసవంతమైన హౌస్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడా ఇంటికి సమీపంలోనే అల్లు అర్జున్ కూడా ఓ లగ్జరీ హౌస్‌ (Allu Arjun Luxury Home)ని నిర్మిస్తున్నట్లుగా వార్తలే కాదు, ఇంటికి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ ఇంటికి ఉన్న విశిష్టత ఏమిటంటే.. సుమారు 4,000 చదరపు గజాల స్థలంలో ఈ హౌస్‌ని నిర్మిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఇంటి కోసం సుమారు రూ. 80 కోట్ల నుంచి రూ. 100 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లుగా టాక్ వినబడుతోంది. ఈ ఏడాది చివరి నాటికి గృహప్రవేశం చేయనున్నారని సమాచారం.


ఈ ఇంటికి ఉన్న ఫీచర్ల విషయానికి వస్తే.. ఇంట్లోనే ఓ ప్రైవేట్ థియేటర్, స్విమ్మింగ్ పూల్, జిమ్, గార్డెన్ ఏరియా వంటి ఆధునిక సదుపాయాలు ఉన్నాయనేలా టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అన్నింటికంటే ప్రత్యేకమైన విషయం మెగాస్టార్ చిరంజీవి నివాసానికి అతి సమీపంలోనే ఈ ఇల్లు ఉండటం. ఇక ఇంద్రభవనాన్ని తలపించేలా అల్లు అర్జున్ ఈ ఇంటిని నిర్మిస్తున్నట్లుగా, సోషల్ మీడియాలో సంచరిస్తున్న ఫొటోలను చూస్తుంటే తెలుస్తోంది. అందుకే అంటోంది.. ఈ మధ్య బన్నీ ఏది చేసినా, చాలా బిగ్గరగా ఉంటుందని. చూద్దాం.. ఈ ఇంటి వివరాలను అల్లు ఫ్యామిలీ అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తుందో?

ఇవి కూడా చదవండి:

అలా విమర్శించే వారిని వదలకండి: చంద్రబాబుకు బండ్ల సూచన

సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలి సినిమాల్లోకి వచ్చిన సెలబ్రిటీలు వీరే!

సబ్‌స్క్రిప్షన్ వార్తలపై అనన్య నాగళ్ల క్లారిటీ ఇదే!

Updated Date - Apr 22 , 2026 | 03:45 PM

Allu Arjun - Atlee: అల్లు అర్జున్‌ కసి అదే.. పెద్ద ప్లానే ఇది...

Allu Arjun - Atlee: అల్లు అర్జున్‌.. అట్లీ.. ఓ అతిథి..  

Allu Arjun - Atlee: కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నాం.. ఒక రేంజ్‌లో ఉంటుంది..

Allu Arjun - Atlee: దీపికానే ఫైనల్!

Allu Arjun - National Awards : నేషనల్‌ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ ఏమన్నారంటే..!