Ashu Reddy: టైమ్ వచ్చినప్పుడు అందరి జాతకాలు బయటపెడతా..!

ABN , First Publish Date - 2023-06-24T22:18:00+05:30 IST

పీ చౌదరి కాల్ లిస్ట్‌లో అషు రెడ్డి పేరు ఉందనే వార్త బయటికి వచ్చినప్పటి నుంచి.. ఆమెపై సోషల్ మీడియాలో భారీగా ట్రోల్స్ జరుగుతున్నాయి. ఈ ట్రోల్స్‌పై ఆమె సీరియస్ అవుతూ.. అసలు విషయం తెలుసుకోకుండా.. ఇష్టం వచ్చినట్లుగా రాయవద్దంటూ మండిపడింది.

Ashu Reddy: టైమ్ వచ్చినప్పుడు అందరి జాతకాలు బయటపెడతా..!
Ashu Reddy

తెలుగు సినీ పరిశ్రమ (Tollywood)లో మరోమారు డ్రగ్స్‌ ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. పలు బ్లాక్‌బస్టర్‌ తెలుగు చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్‌గా, తెలుగులో ‘కబాలి’ (Kabali) డబ్బింగ్‌ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన కేపీ చౌదరి (KP Chowdary) అలియాస్‌ సుంకరి కృష్ణప్రసాద్‌ చౌదరి డ్రగ్స్‌తో ఇటీవల పోలీసులకు పట్టుబడటంతో.. ఆయన నుంచి సంచలన విషయాలను పోలీసులు రాబడుతున్నారు. ఈ క్రమంలో బిగ్‌బాస్ ఫేమ్, జూనియర్ సమంతగా పేరున్న అషు రెడ్డి పేరు బాగా వైరల్ అవుతోంది. అయితే తనపై వస్తున్న వార్తలపై అషురెడ్డి మండిపడుతూ సోషల్ మీడియాలో రియాక్ట్ అయింది.

కేపీ చౌదరి కాల్ లిస్ట్‌ని డీకోడ్ చేసిన పోలీసులు.. కేపీ చౌదరి-అషురెడ్డిల మధ్య వందల ఫోన్ కాల్స్ జరిగినట్లుగా అనుమానాలు వ్యక్తం చేశారు. అషురెడ్డి (Ashu Reddy) మాత్రమే కాకుండా.. ఐటంసాంగ్స్‌కి ఫేమస్ అయిన మరో నటి, అలాగే టాలీవుడ్‌కి చెందిన కొందరు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ల పేర్లు కూడా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారనే.. విషయం బయటికి రావడంతో ఇప్పుడంతా అలెర్ట్ అవుతున్నారు. కేపీ చౌదరి‌తో మాకు ఎలాంటి డ్రగ్ సంబంధాలు లేవని తెలుపుతూ.. అతనెలా తెలుసో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా అషు రెడ్డి కూడా తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించింది.

Reddy.jpg

ముఖ్యంగా కేపీ చౌదరి కాల్ లిస్ట్‌లో అషు రెడ్డి పేరు ఉందనే వార్త బయటికి వచ్చినప్పటి నుంచి.. ఆమెపై సోషల్ మీడియాలో భారీగా ట్రోల్స్ జరుగుతున్నాయి. ఈ ట్రోల్స్‌పై ఆమె సీరియస్ అవుతూ.. అసలు విషయం తెలుసుకోకుండా.. ఇష్టం వచ్చినట్లుగా రాయవద్దంటూ మండిపడింది. ‘‘నాకు, డ్రగ్స్‌కి ఎటువంటి సంబంధం లేదు. నా ప్రమేయం లేకుండానే.. ఎవరెవరితోనో సంబంధాలు ఉన్నట్లుగా రాస్తున్నారు. నా పై వస్తున్న వార్తల్లో నిజం లేదు. కచ్చితంగా టైం వచ్చినప్పుడు ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారనేది బయటపెడతా. నా పర్మిషన్ లేకుండా నా ఫోన్ నెంబర్ ప్రచారం చేస్తే క్షమించేది లేదు. నాపై ఇలాంటి దుష్ప్రచారం ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు’’ అని అషురెడ్డి సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.

ఇవి కూడా చదవండి:

**************************************

*Sobhita Dhulipala: కాబోయేవాడు అలా ఉండాలంటూనే.. చైతూ లక్షణాలకు మ్యాచ్ చేస్తోంది


**************************************

*Bholaa Shankar Teaser Talk: మెగాస్టార్‌.. మాస్ అరాచకం!


**************************************

*Anand Sai and Vasuki: ‘తొలిప్రేమ’ రీ రిలీజ్‌పై ఈ దంపతులు ఏమన్నారంటే..


**************************************

*Megastar Chiranjeevi: మరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మెగాస్టార్


**************************************

*KP Chowdary: ‘కబాలి’ నిర్మాత కస్టడీ రిపోర్ట్‌లో సంచలన విషయాలు.. చిక్కుల్లో అషు రెడ్డి

**************************************

*BoyapatiRAPO: మరింత దగ్గరకి మాస్ బీభత్సం.. ఈ మధ్య కాలంలో ఇలాంటి అనౌన్స్‌మెంట్ అయితే రాలే..


**************************************

Updated Date - 2023-06-24T22:18:00+05:30 IST