Ananya Nagalla : ఇక్కడ ఉండాలంటే తప్పదు మరి..

ABN , First Publish Date - 2023-11-06T16:35:43+05:30 IST

సాఫ్ట్‌వేర్‌ నుంచి సినిమాల్లోకి వచ్చిన తెలుగమ్మాయి అనన్యా నాగళ్ల. ‘మల్లేశం’తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తర్వాత 'వకీల్‌సాబ్‌’ చిత్రంలో కీలక పాత్రలో మెరిసింది. హీరోయిన్‌గానే కాకుండా సహాయ నటిగానూ అవకాశాలు అందుకొంటూ ప్రేక్షకుల్ని అలరిస్తోంది.

Ananya Nagalla : ఇక్కడ ఉండాలంటే తప్పదు మరి..

సాఫ్ట్‌వేర్‌ నుంచి సినిమాల్లోకి వచ్చిన తెలుగమ్మాయి అనన్యా నాగళ్ల (Ananya nagalla) ‘మల్లేశం’తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తర్వాత 'వకీల్‌సాబ్‌’ (vakeel saab) చిత్రంలో కీలక పాత్రలో మెరిసింది. హీరోయిన్‌గానే కాకుండా సహాయ నటిగానూ అవకాశాలు అందుకొంటూ ప్రేక్షకుల్ని అలరిస్తోంది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె తాజాగా ‘అన్వేషి’ చిత్రంలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సోషల్‌ మీడియాలో గ్లామర్‌ ఫొటోలు పోస్ట్‌ చేయడం గురించి మాట్లాడింది. అందుకు గల కారణాన్ని తెలిపింది.

‘‘వకీల్‌సాబ్‌’కు ముందు ఎక్కువగా ట్రెడిషనల్‌ ఫొటోలు షేర్‌ చేసేదాన్ని. ‘శాకుంతలం’ చేస్తోన్న రోజుల్లో గ్లామరస్‌ ఫొటోలు కొన్నింటిని ఇన్ స్టాలో షేర్‌ చేశా. అప్పట్లో హాట్‌ ఫొటోలు షేర్‌ చేయడానికి ప్రత్యేక కారణం ఏమీ లేదు. అయితే ఆ ఫొటోలకు స్పందన బాగా వచ్చింది. అదీ కాకుండా సినిమా అనే రేస్‌లో నేను ఉండాలనుకుంటున్నా. ఇక్కడ నువ్వు ఉండాలంటే అన్ని రకాలుగా కనిపించాలి. ఆ విధంగా నేను గ్లామరస్‌ ఫొటోలు పోస్ట్‌ చేస్తున్నానంతే. అంతకుమించి కారణం ఏం లేదు. ప్రస్తుతం అయితే కెరీర్‌ సంతృప్తిగానే ఉంది. కమర్షియల్‌ సినిమా అవకాశాలు బాగానే వచ్చాయి. కానీ పెద్దగా వర్కవుట్‌ కాలేదు’’ అని అన్నారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ‘అన్వేషి’ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది. వి.జె.ఖన్నా ఈ చిత్రానికి దర్శకుడు.

Updated Date - 2023-11-06T16:37:20+05:30 IST