ఒకే వేదికపై రణ్‌బీర్ - రాకింగ్ స్టార్ యశ్.. ఫ్యాన్స్‌కు పూనకాలే!
ABN , Publish Date - Oct 14 , 2026 | 07:43 PM
భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న విజువల్ వండర్ ‘రామాయణ’. నితీష్ తివారీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ దృశ్యకావ్యంపై ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న విజువల్ వండర్ ‘రామాయణ’. నితీష్ తివారీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ దృశ్యకావ్యంపై ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రచార చిత్రాలు నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేయగా.. తాజాగా ఈ చిత్ర బృందం మరో భారీ ధమాకాకు రంగం సిద్ధం చేసింది. కర్ణాటక రాజధాని బెంగళూరు వేదికగా ‘రామాయణ’ ట్రైలర్-2 ను గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లు టీమ్ ప్రకటించింది.
ఈ ఈవెంట్‌కు సంబంధించిన అతిపెద్ద హైలైట్ ఏమిటంటే.. వెండితెరపై రాముడు, రావణులుగా ఎదురుపడబోయే ఇద్దరు పాన్-ఇండియా సూపర్ స్టార్లు ఒకే వేదికను పంచుకోనుండటమే! బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ (శ్రీరాముడు), కన్నడ గడ్డ ముద్దుబిడ్డ ‘రాకింగ్ స్టార్’ యశ్ (రావణుడు) ఇద్దరూ కలిసి ఈ గ్రాండ్ లాంచ్ వేడుకలో పాల్గొననున్నారు. సొంతగడ్డపై యశ్ అడుగుపెడుతుండటంతో కన్నడ నాట అభిమానుల సందడి తారాస్థాయికి చేరింది. యశ్ ఎంట్రీ అంటేనే ఒక వైబ్రేషన్.. దానికి తోడు రణ్‌బీర్ కపూర్ క్రేజ్ కూడా తోడవడంతో బెంగళూరు నగరం ఈ చారిత్రాత్మక సినిమాటిక్ సెలబ్రేషన్‌ను అంగరంగవైభవంగా సిద్ధమైంది.
బెంగళూరు వేదికగా జరగనున్న ఈ మహా వేడుక కోసం మేకర్స్ అత్యంత భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రైలర్-1 తోనే అంచనాలను పెంచేసిన చిత్ర బృందం.. ఈ రెండో ట్రైలర్లో రాముడు-రావణుల మధ్య సాగే పౌరాణిక ఘట్టాలు, విజువల్ ఎఫెక్ట్స్, భారీ యుద్ధ సన్నివేశాలను మరింత క్లారిటీగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. నమిత్ మల్హోత్రా ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, ఆస్కార్ విన్నింగ్ సంస్థ DNEG, యష్‌కు చెందిన మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకానుంది. గురువారం (అక్టోబర్ 15) విడుదల కానున్న ఈ రెండో ట్రైలర్ ఇంకెన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి!
ఇవి కూడా చదవండి:
చార్ట్‌బస్టర్‌గా.. ‘రాయవలస’లోని ‘రింగుడు రింగుడు పిల్ల’
Jailer 2: సంతానం సీన్లన్నీ ఔట్.. విజయ్ సేతుపతి పాత్ర ‘జైలర్ 3’కి లీడ్..
సెట్లో ప్రమాదం.. ఇమ్రాన్ హష్మీకి తప్పిన ప్రాణాపాయం