Ramayana Telugu Trailer: రామాయ‌ణ.. ట్రైల‌ర్ అదిరింది

ABN , Publish Date - Jul 30 , 2026 | 06:38 AM

రెండేండ్లుగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకున్న రామాయ‌ణ సినిమా ఈ దీపావ‌ళికి ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌కు ముస్తాబ‌వుతున్న విష‌యం తెలిసిందే.

గ‌డిచిన రెండేండ్లుగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకున్న రామాయ‌ణ (Ramayana) సినిమా ఈ దీపావ‌ళికి ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌కు ముస్తాబ‌వుతున్న విష‌యం తెలిసిందే. సుమారు రెండు, మూడు వేల కోట్ల బ‌డ్జెట్‌, అంత‌ర్జాతీయ టెక్నీషియ‌న్స్‌తో హాలీవుడ్ స్తాయిలో ఈ సినిమా రూపొందింది. రాముడిగా ర‌ణ‌బీర్ క‌పూర్ (Ranbir Kapoor), సీత‌గా సాయి ప‌ల్ల‌వి (Sai Pallavi), రావ‌ణుడిగా య‌శ్ (Yash), హ‌నుమంతుడిగా స‌నన్నీ డియోల్ న‌టించారు. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా తొలి భాగం చిత్రీక‌ర‌ణ ఇప్ప‌టికే పూర్త‌వ‌గా ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌డంలో జాప్యం జ‌రుగుతూ వ‌చ్చింది. కాగా ఎట్ట‌కేల‌కు ఈ రోజు జూలై 30 తెల్ల‌వారు జాము 5 గంట‌ల‌కు బ్ర‌హ్మ ముహుర్తానా ఈ చిత్రం ట్రైల‌ర్‌ను అన్ని ప్రాంతీయ భాష‌ల‌లో విడుద‌ల చేశారు.

ట్రైల‌ర్ ప్రారంభ‌మే రావ‌ణుడు, ఇంద్రుడు మ‌ధ్య భీక‌ర‌ పోరాటంతో మొద‌లు పెట్టి జ‌న‌కుడి యాగం రాముడి జ‌న‌నం, ప‌రాక్ర‌మం, వ‌న‌వాసం వంటి ఘ‌ట్టాలు అద్బుత‌మైన విజువ‌ల్స్‌తో అద‌ర‌గొట్టారు. నాలుగు నిమిషాల 10 సెకండ్ల నిడివితో సాగిన ఈ ట్రైల‌ర్‌లో యాక్ట‌ర్స్‌తో పాటు విజువ‌ల్స్, మ్యూజిక్ అన్నీ ఒక దాన్ని మించి మ‌రోటి పోటీ ప‌డి చేశారా అనే రేంజ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా రావ‌ణుడి పాత్ర అన్నింటిని మించి హైలెట్ అనేలా ఉంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. అయితే హ‌నుమంతుడి స‌న్నివేశాలు మాత్రం ఎక్క‌డా రివీల్ చేయ‌లేదు. ఫైన‌ల్‌గా ట్రైల‌ర్ మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు ఉన్న అంచ‌నాల‌ను అందుకునేలా ఉంది. హ్యాన్స్ జిమ్మ‌ర్‌, రెహ‌మాన్ సంగీతం కూడా బాగా కుదిరాయి.

Updated Date - Jul 30 , 2026 | 06:38 AM