Ramayana teaser: వేవ్స్ సమ్మిట్ లో రామనామం

ABN , Publish Date - May 02 , 2025 | 03:29 PM

బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారి తెరకెక్కిస్తున్న విజువల్ ట్రీట్ రామాయణం నుంచి టీజర్ వచ్చేస్తోంది. వేవ్స్ సమ్మిట్ లో టీజర్ ను విడుదల చేయనున్నారు.

రామాయణం(Ramayanam) ఆధారంగా ఇప్పటివరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. బ్లాక్ అండ్ వైట్ నుంచి ఇప్పటి వరకు ఎన్నో చిత్రాలు వెండితెరపై రామనామాన్ని వినిపించాయి. అయితే ఆ మధ్య ఆడియెన్స్ ముందుకు వచ్చిన ప్రభాస్ ‘ఆదిపురుష్’ (Adipurush)... మూవీ లవర్స్ ను మెప్పించలేకపోయింది. అయినప్పటికి బాలీవుడ్ నుంచి భారీ బడ్జెజ్‌తో మరో రామాయాణం రాబోతోంది. అదీ రెండు భాగాలుగా! సైలెంట్ గా షూటింగ్ ను మొదలు పెట్టడంతో పాటు శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఆ మధ్య ఈ సినిమా సెట్స్ నుంచి సీత, రాముడు పాత్రలకు సంబంధించిన కొన్ని పిక్స్ లీక్ అవగా.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో లీకుల బెడద లేకుండా స్పెషల్ కేర్ తీసుకుంటూ సినిమాను షూటింగ్ జరుపుకుంటున్నారు మేకర్స్. తాజాగా ఈ మూవీ నుంచి బయటకు వచ్చిన అప్ డేట్స్ ఫ్యాన్స్ ను ఖుషి చేస్తోంది.


రామాయణంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ (Ranbir Kapoor) రాముడిగా, లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి (Sai Pallavi) సీతగా కనిపించనుంది. రాక్షస రాజు రావణుడి పాత్రలో రాకింగ్ స్టార్ యష్ (Yash) నటిస్తున్నాడు. ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు నితీష్ తివారి (Nitish Tiwari ). విజువల్ గా తీర్చిదిద్దడంతో పాటు గ్రాఫిక్స్, బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా తెరకెక్కిస్తున్నాడు. రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ వచ్చే దీపావళికి పార్ట్ 1 రిలీజ్ అవుతుండగా.... పార్ట్ 2 - 2027 దీపావళికి రానుంది.

తాజాగా రామాయణం మూవీ టీజర్ కు టైం ఫిక్స్ చేశారు. ముంబైలో గ్రాండ్ గా జరుగుతున్న వేవ్స్ సమ్మిట్ (WAVES Summit)లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. శ్రీరామ నవమికి విడుదల చేయాలనుకున్నప్పటికి అనివార్య కారణాలతో అది వాయిదా పడింది. దీంతో వేవ్స్ సమ్మిట్ లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సీతా రాముల క్యారెక్టర్ల తో పాటు యష్ లుక్ కూడా బయటకు వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. గ్రాఫిక్స్ తో పాటు విజువల్ ట్రీట్ ను కలిగించేలా... ఈ మూవీ టీజర్ ను కట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ టీజర్ బయటకు రావడానికి మరికొంత సమయం పట్టేలా కనిపిస్తోంది. ఈ చిత్రానికి సంగీతాన్ని ఎ.ఆర్. రెహ్మాన్ (A. R. Rahman), హన్స్ జిమ్మెర్ (Hans Zimmer)అందిస్తున్నారు. యష్ ఈ చిత్రంలో నటించడమే కాక ప్రైమ్ ఫోకస్ స్టూడియోలతో పాటు తన బ్యానర్ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ కింద కో-ప్రొడ్యూసర్ గా ఉన్నాడు. మరీ నితీష్ తెరకెక్కిస్తున్న రామాయణం ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Updated Date - May 02 , 2025 | 03:29 PM