బాలీవుడ్‌కు ‘గరుడవేగ’ అంజి.. ‘అన్ఎక్స్పెక్టెడ్’
ABN, Publish Date - Nov 20 , 2026 | 08:44 PM
టాలీవుడ్లో ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘గరుడవేగ’ అంజి, ఇప్పుడు ‘అన్ఎక్స్పెక్టెడ్ – సఫేద్ సచ్’ చిత్రంతో బాలీవుడ్ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు.
టాలీవుడ్లో ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘గరుడవేగ’ అంజి (Garudavega Anji), ఇప్పుడు ‘అన్ఎక్స్పెక్టెడ్ – సఫేద్ సచ్’ (UNEXPECTED – SAFED SACH) చిత్రంతో బాలీవుడ్ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. డెహ్రాడూన్ ఇంటర్-స్టేట్ బస్ టెర్మినల్ (ISBT) వద్ద జరిగిన ఓ సంచలన వాస్తవ ఘటన స్ఫూర్తితో, మహిళల భద్రత, సమర్థవంతమైన పోలీసు దర్యాప్తు నేపథ్యంలో ఈ బహుభాషా క్రైమ్ థ్రిల్లర్ రూపొందుతోంది. యశ్ వీరా ఫిల్మ్స్ సమర్పణలో ప్యారేలాల్ గుండెచా (సోజాత్ రోడ్ వాలా) నిర్మిస్తున్న ఈ చిత్రానికి అంజి దర్శకత్వంతో పాటు సినిమాటోగ్రఫీ బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్-లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేయగా, అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఫస్ట్-లుక్ పోస్టర్లో బాలీవుడ్ నటుడు సంజయ్ కపూర్ (Sanjay Kapoor) తలపాగా, దట్టమైన గడ్డంతో పవర్ఫుల్ సిక్కు పోలీస్ ఆఫీసర్ (ఎస్ఎస్పి భరత్ సింగ్) అవతారంలో కనిపిస్తుండగా.. విలక్షణ నటుడు ప్రశాంత్ నారాయణన్ (‘మర్డర్ 2’ ఫేమ్) సీరియస్‌గా ఇంటెన్స్ లుక్‌లో ఆకట్టుకుంటున్నారు. అలాగే నటి ఎస్తేర్ అనిల్ చున్నీని తలపై ధరించి పోస్టర్‌కు ఒక బలమైన భావోద్వేగ కోణాన్ని జోడించారు. ఇంట్లో పెట్టిన ఒక ప్రేమలేఖ కారణంగా తలెత్తిన అపార్థంతో ఓ టీనేజ్ అమ్మాయి డెహ్రాడూన్ ISBT నుంచి రాత్రి బస్సు ఎక్కి అదృశ్యం కావడం, ఆ తర్వాత పాడుబడిన బస్సు లభించడం, ఆమె అపస్మారక స్థితిలో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరడం చుట్టూ ఈ కథ ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఈ సున్నితమైన కేసు వెనుక ఉన్న అసలు నిజాన్ని ఎస్ఎస్పి భరత్ సింగ్ ఎలా ఛేదించాడనేదే సినిమా ప్రధానాంశం.
ఈ సందర్భంగా సంజయ్ కపూర్ మాట్లాడుతూ.. ఇందులో దర్యాప్తు అధికారి పాత్ర పోషించడం గొప్ప అనుభవమని, మహిళల భద్రత అనేది కేవలం వార్తా శీర్షిక మాత్రమే కాదని, సమాజంలోని మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కే సినిమాలకు ఒక సామాజిక బాధ్యత ఉంటుందని ప్రశాంత్ నారాయణన్ తెలిపారు. వినోదంతో పాటు మహిళల భద్రత, న్యాయం, బాధ్యతాయుతమైన పోలీసింగ్ ప్రాముఖ్యతను చాటిచెప్పాలనే ఉద్దేశంతో ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు నిర్మాత ప్యారేలాల్ గుండెచా వెల్లడించారు. కేవలం క్రైమ్ థ్రిల్లర్‌గానే కాకుండా, సమాజంలో ఒక అర్థవంతమైన చర్చకు దారితీసేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నట్లు దర్శకుడు ‘గరుడవేగ’ అంజి చెప్పారు. పృథ్వీరాజ్, తంబి రామయ్య, సంజయ్ సింగ్, గంజా కరుప్పు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెవిన్ రాయ్ సంగీతం అందిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు గర్వాలీ, గుజరాతీ, పంజాబీ, భోజ్‌పురి సహా మొత్తం 9 భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం 2027లో థియేటర్లలో విడుదల కానుంది.
ఇవి కూడా చదవండి:
‘మాతృభూమి’ కోసం సల్మాన్, చిత్రాంగద హైదరాబాద్‌లో సందడి
రజనీకాంత్‌తో ధనుష్ కొడుకు.. ఆ స్టైల్ ఎక్కడికి పోతుంది?
అండర్‌వరల్డ్ డాన్ సల్మాన్.. అండర్‌కవర్ కాప్ నయన్.. ‘మాన్స్టర్’ కథ ఇదేనా?