మిస్కిన్ టచ్‌పై నెటిజన్ కామెంట్.. గట్టిగా కౌంటర్ ఇచ్చిన కీర్తి సురేష్
ABN , Publish Date - Nov 19 , 2026 | 06:42 PM
కీర్తి సురేష్ పేరు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. తాజాగా ఆమె ఓ నెటిజన్‌కు ఇచ్చిన కౌంటర్‌తో మరోసారి వార్తలలో హైలెట్ అవుతోంది.
కీర్తి సురేష్ (Keerthy Suresh) పేరు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ‘అక్క’ (Akka) వెబ్ సిరీస్, ‘డోరతీ’ చిత్రంతో పాటు.. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోయే సంక్రాంతికి రానున్న ‘జనవరి 12 విడుదల’ చిత్రంలో ఒక హీరోయిన్‌గా కీర్తి నటిస్తోంది. అందుకే కీర్తి సురేష్ పేరు.. ఏదో ఒక సమయంలో ట్రెండ్ అవుతూనే ఉంది. ఇవి కాకుండా ఇటీవల కోలీవుడ్‌లో జరిగిన ఓ వేడుకలో ‘డోరతీ’లో ఆమె నటనను ప్రశంసిస్తూ.. దర్శకుడు మిస్కిన్ (Mysskin) ఆమె మీద చేయి వేశారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోతో కూడా ఆమె సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఓ నెటిజన్ దీనిపై కీర్తిని నిందిస్తూ కామెంట్ చేశాడు. ఆ కామెంట్ చేసిన వ్యక్తికి కీర్తి సురేష్ ఇచ్చిపడేశారు.
అసలేం జరిగిందంటే.. ‘డోరతీ’ చిత్రంలో కీర్తి సురేష్ నటించిన పాత్ర నిజంగా అద్భుతంగా ఉంది. ఇలాంటి పాత్రలు చేయడానికి ధైర్యం కావాలి అంటూ.. కీర్తి సురేష్‌ను ప్రశంసలతో ముంచెత్తుతూ.. పక్కనే ఉన్న ఆమె కాలిని తాకారు దర్శకుడు మిస్కిన్. ఇందులో అంత ఇబ్బందికరమైన విషయమైతే ఏమీ లేదు. కానీ, ఓ నెటిజన్.. కీర్తి తీరుపై కౌంటర్ వేశాడు. సినిమాలలో హీరోలతో బాగానే ఉంటారు కదా.. ఎక్కడ తాకినా నవ్వుతూనే ఉంటారు కదా. మరి అక్కడ మిస్కిన్ అలా టచ్ చేసినందుకు ముఖం ఎందుకు అలా పెట్టారు? అంత ఫీల్ అవుతున్నదేంటి? అని ప్రశ్నించాడు.
ఈ ట్వీట్‌ను రీ ట్వీట్ చేస్తూ.. కీర్తి సురేష్ కూడా ఇచ్చిపడేశారు. ‘‘మొదటిగా.. అసలక్కడ నా ఫేస్‌లో మీకు అసౌకర్యం ఎక్కడ కనిపించింది? మా మధ్య తండ్రీకూతుళ్ల బంధం ఉందని మేము చెప్పడం మీరు వినలేదా? ఇక రెండో విషయానికి వస్తే.. నాకు అక్కడ అసౌకర్యంగా ఉన్నా సరే.. సినిమాలలో తాకుతారు కాబట్టి.. పబ్లిక్ ఫంక్షన్స్‌లో కూడా అలాగే ఉండాలా? దయచేసి ముందు మీరు మీ ఆలోచనా విధానాన్ని మార్చుకోండి సోదరా..’’ అంటూ కీర్తి సురేష్ కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె ఇచ్చిన సమాధానాన్ని అంతా సమర్థిస్తూ.. ‘బాగా అయింది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కీర్తి ఘాటు స్పందనకు వెంటనే సదరు నెటిజన్ ఆ ట్వీట్‌ను తొలగించారు.
ఇవి కూడా చదవండి:
13 ఏళ్ల నిరీక్షణకు తెర.. ‘ఆకాశంలో ఒక తార’పై పవన్ సాధినేని ఎమోషనల్ లెటర్
మనవళ్లతో సూపర్ స్టార్.. ఇలా ఎప్పుడూ చూడలేదు కదా