‘ఆదర్శ కుటుంబం’ టీమ్ పై పూజిత పొన్నాడ సంచలన ఆరోపణలు

ABN , Publish Date - Nov 19 , 2026 | 07:39 PM

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన చిత్రం ‘ఆదర్శ కుటుంబం - హౌస్ నెంబర్ 47’. ఈ మూవీ టీమ్‌పై హీరోయిన్ పూజిత పొన్నాడ సంచలన ఆరోపణలు చేశారు.

Pujitha Ponnada on AK47 Team

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) హీరోగా నటించిన చిత్రం ‘ఆదర్శ కుటుంబం - హౌస్ నెంబర్ 47’ (Aadarsha Kutumbam House No: 47). నారా రోహిత్, శ్రీనిధి శెట్టి తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలై ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అయితే, ఈ చిత్రంలో ఒకే ఒక్క చిన్న సన్నివేశంలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచిన తెలుగు నటి పూజిత పొన్నాడ (Pujita Ponnada), తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చిత్ర బృందంపై సంచలన ఆరోపణలు చేశారు. తనను సినిమాలోకి తీసుకుని, ఎలాంటి సమాచారం లేకుండా తొలగించి, చివరకు ఒక్క సీన్ కోసం వాడుకుని తనకు అన్యాయం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.


‘ఆదర్శ కుటుంబం’ సినిమాలో తన ప్రయాణం ఎలా మొదలైందో వివరిస్తూ పూజిత పలు కీలక విషయాలను బయటపెట్టారు. ‘‘గతేడాది డిసెంబర్‌లో నేను యూకే (UK) లో ఉన్నప్పుడు ‘ఆదర్శ కుటుంబం’ కో-డైరెక్టర్ నాకు ఫోన్ చేశారు. త్రివిక్రమ్ సార్ సినిమాలో ఒక ఫుల్ లెంగ్త్, చాలా మంచి పాత్ర ఉందని చెప్పడంతో నేను జనవరి 3న ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చాను. నాపై లుక్ టెస్ట్, రకరకాల ఫోటో షూట్స్ నిర్వహించారు. త్రివిక్రమ్ సార్ స్వయంగా చూసి నన్ను ఫైనల్ చేశారు. ఆ తర్వాత రైటర్ నాకు గంటన్నర పాటు పూర్తి కథ చెప్పారు. సినిమా ప్రారంభం నుంచి క్లైమాక్స్ వరకు ఉండే పాత్ర కావడం, నారా రోహిత్‌తో మంచి సీన్లు, యాక్షన్ ఎపిసోడ్స్ ఉండటంతో నేను చాలా ఎగ్జయిట్ అయ్యాను. అగ్రిమెంట్‌పై సంతకం చేసి అడ్వాన్స్ కూడా తీసుకున్నాను. మొదటి షెడ్యూల్‌లో 5 రోజుల పాటు నా ఎంట్రీ సీన్, నారా రోహిత్‌తో సన్నివేశాలు, అలాగే మొన్న సినిమాలో కనిపించిన సీన్ షూట్ చేశారు’’ అని పూజిత తెలిపారు.

మొదటి షెడ్యూల్ ముగిశాక సుమారు మూడు నెలల పాటు రెండో షెడ్యూల్ గురించి ఎలాంటి అప్‌డేట్ రాలేదని ఆమె పేర్కొన్నారు. ఇంకా ఆమె మాట్లాడుతూ.. ‘‘మధ్యలో కథలో మార్పులు జరుగుతున్నాయని, నటీనటులను మారుస్తున్నారని రూమర్స్ వినిపించాయి. నేను అసిస్టెంట్ డైరెక్టర్‌కు ఫోన్ చేసి అడిగితే.. ‘మీ పాత్ర తగ్గడం ఉండదు, త్రివిక్రమ్ సార్ ఇంకా బాగా రాస్తున్నారు’ అని చెప్పారు. ఆ తర్వాత నేను విదేశాలకు (దుబాయ్) వెళ్లే ప్లాన్ ఉండటంతో డేట్స్ క్లారిటీ కోసం కాల్ చేస్తే నాకు కాంటాక్ట్ అయిన వ్యక్తి స్పందించలేదు. వేరే అసిస్టెంట్ డైరెక్టర్ ఫోన్ చేసి ‘మన షూటింగ్ లేదు’ అన్నారు. ఆరా తీస్తే నా స్థానంలో వేరే సీనియర్ నటిని తీసుకున్నారని తెలిసింది. ఒక పద్ధతి ప్రకారం ఆడిషన్ చేసి, అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా నన్ను తొలగించడం నాకు చాలా బాధ కలిగించింది’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.


‘‘సినిమాలో నన్ను తీసేశారని సర్దుకుపోయాను. కానీ థియేటర్‌లో చూస్తే నేను నటించిన ఒకే ఒక్క సీన్ సినిమాలో ఉంచారు. బహుశా ఆ ముఖ్యమైన సన్నివేశాన్ని మళ్లీ రీ-షూట్ చేసే సమయం లేకపోవడంతో, పాత డీఓపీ తీసిన నా సీన్‌నే వాడుకున్నట్లు అనిపించింది. కనీసం టైటిల్స్‌లో నాకు క్రెడిట్ కూడా ఇవ్వలేదు. ఇంత పెద్ద పాత్ర అని చెప్పి, చివరకు తలాతోకా లేని ఒక్క సీన్ కోసం నన్ను వాడుకోవడం నిజంగా ద్రోహం చేసినట్లే అనిపించింది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు?’’ అంటూ పూజిత పొన్నాడ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి:

మిస్కిన్ టచ్‌పై నెటిజన్ కామెంట్.. గట్టిగా కౌంటర్ ఇచ్చిన కీర్తి సురేష్

దుల్కర్ ‘మిడాస్ టచ్’

13 ఏళ్ల నిరీక్షణకు తెర.. ‘ఆకాశంలో ఒక తార’పై పవన్ సాధినేని ఎమోషనల్ లెటర్

Updated Date - Nov 19 , 2026 | 07:39 PM

Aadarsa Kutumbam: 'నారాయణమ్మ..' పాటకు స్ఫూర్తి అదేనా!?

Aadarsha Kutumbam: అసలు మాలా సాంగ్ ఎలా లేపేశారుర్రా బాబు..

Aadarsha Kutumbam: చూపు లేకపోయినా.. వేట తప్పదు! ‘రా ఏజెంట్’గా వెంకీ

Aadarsha Kutumbam: నువ్వు అందిన చోటల్లా అప్పు చేయ్.. నేను పప్పు చేస్తా

Aadarsha Kutumbam: వెంకటేశ్- త్రివిక్రమ్.. ఆదర్శ కుటుంబం చెప్పిన‌ టైంకి వ‌చ్చేనా! ఎందుకంటే