పెళ్లి పీటలు ఎక్కిన కుర్ర హీరో..
ABN , Publish Date - Nov 20 , 2026 | 06:23 PM
ఈ ఏడాది ఇండస్ట్రీ మొత్తం పెళ్లిళ్లతో కళకళలాడుతోంది. కుర్ర హీరో హీరోయిన్లు తమకు నచ్చినవారిని పెళ్లాడుతూ ఒక ఇంటివారవుతున్నారు. ఈమధ్యనే కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ పెళ్లిపీటలు ఎక్కిన విషయం తెల్సిందే. తాజాగా మరో కుర్ర హీరో పెళ్లిపీటలు ఎక్కాడు.
ఈ ఏడాది ఇండస్ట్రీ మొత్తం పెళ్లిళ్లతో కళకళలాడుతోంది. కుర్ర హీరో హీరోయిన్లు తమకు నచ్చినవారిని పెళ్లాడుతూ ఒక ఇంటివారవుతున్నారు. ఈమధ్యనే కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ పెళ్లిపీటలు ఎక్కిన విషయం తెల్సిందే. తాజాగా మరో కుర్ర హీరో పెళ్లిపీటలు ఎక్కాడు. కుక్ విత్ కోమాలి (Cooku With Comali) షోతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుని, ఆ తర్వాత హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తమిళ యంగ్ హీరో అశ్విన్ కుమార్ లక్ష్మీకాంతన్ (Ashwin Kumar) ఒక ఇంటివాడయ్యాడు. నవంబర్ 20 న భువనేశ్వరి అనే అమ్మాయితో అశ్విన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో సాంప్రదాయ సౌత్ ఇండియన్ పద్ధతిలో ఈ వేడుక ఎంతో వేడుకగా జరిగింది.
ఇక వధువు భువనేశ్వరి విషయానికి వస్తే.. ఆమెకు ఒక గొప్ప సినీ నేపథ్యం ఉంది. రజినీకాంత్ పడిక్కాదవన్, 1986 లో కమల్ హాసన్ నటించిన విక్రమ్ వంటి క్లాసిక్ చిత్రాలను తెరకెక్కించిన దివంగత ప్రముఖ దర్శకుడు రాజశేఖర్ మనవరాలే ఈ భువనేశ్వరి. సినీ కుటుంబంతో అశ్విన్ వియ్యమందడంతో కోలీవుడ్ సర్కిల్స్‌లో ఈ పెళ్లి వార్త హాట్ టాపిక్‌గా మారింది. పూల అలంకరణలు, సాంప్రదాయ వేడుకల మధ్య ఈ నూతన జంట ఎంతో ఆనందంగా కనిపిస్తున్న పెళ్లి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. పూల దండలు మార్చుకుంటూ, చిరునవ్వులతో మెరిసిపోతున్న అశ్విన్ - భువనేశ్వరి జంటను చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.
కెరీర్ పరంగా వరుస సినిమాలతో దూసుకుపోతున్న అశ్విన్ కుమార్ జీవితంలో ఈ పెళ్లి ఒక మధురమైన మైలురాయిగా నిలిచింది. ప్రస్తుతం నెట్టింట ఎక్కడ చూసినా వీరి పెళ్లి వీడియోలు, ఫొటోలే ట్రెండ్ అవుతున్నాయి. సినీ ప్రముఖులతో పాటు అభిమానులు ఈ కొత్త జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు.