Lokah: టోవినో థామస్ భుజాలపై 'లోకా -2' బాధ్యత
ABN, Publish Date - Sep 02 , 2025 | 03:38 PM
కళ్యాణీ ప్రియదర్శన్ నటించిన 'కొత్త లోక' సినిమా రెండో భాగంలో టొవినో థామస్ లీడ్ రోల్ చేయబోతున్నాడని తెలుస్తోంది. ఈ చిత్ర నిర్మాత దుల్కర్ సల్మాన్ తో పాటు మలయాళంలో వాయిస్ ఓవర్ ఇచ్చిన మమ్ముట్టి సైతం కీ-రోల్స్ చేస్తారని వార్తలు వస్తున్నాయి.
ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) తన సొంత బ్యానర్ లో నిర్మించిన సినిమా 'లోక చాప్టర్ 1: చంద్ర'. (Lokah Chapter 1: Chandra) ఈ సినిమా మలయాళంలోనే తొలి సూపర్ లేడీ హీరో మూవీ. కళ్యాణీ ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ సినిమా మలయాళ ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని కలిగించింది. దానికి తోడు ఈ సినిమా ద్వితీయార్థంలో టొవినో థామస్ (Tovino Thomas) ఎంట్రీ ఇచ్చిన తర్వాత మూవీ గ్రాఫ్ అమాంతంగా పెరిగిందనీ కొందరు అన్నారు. ఇక క్లయిమాక్స్ లో దుల్కర్ సల్మాన్ మెరపులా కనిపించడం... ఈ మూవీకి మమ్ముట్టి (Mammootty) వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా బాగా కలిసొచ్చిన అంశం. అయితే మలయాళంలో ఈ సినిమా ఫర్వాలేదనిపించుకున్నా... తెలుగులో మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. చిత్రం ఏమంటే ఇప్పుడీ సినిమాకు సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే... టొవినో థామస్ ను గెస్ట్ రోల్ కోసం దుల్కర్ తీసుకోలేదని, 'లోకా 2' మూవీలో అతనే హీరో అని వార్తలు వస్తున్నాయి. అందుకోసమే ఈ సినిమాలో ఆయనతో ద్వితీయ భాగానికి లీడ్ ఇప్పించారని అంటున్నారు. ఇవాళ మలయాళ చిత్రసీమలో టొవీనో థామస్ కు స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతనితో సినిమా నిర్మిస్తే మినిమమ్ గ్యారంటీ అని బయ్యర్లు భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో అన్నీ ఆలోచించే దుల్కర్ సల్మాన్... టొవినో ధామస్ ను ఈ సినిమాకు తీసుకున్నారని అంటున్నారు. మొదటి భాగంలో వాయిస్ ఓవర్ కు పరిమితం అయిన మమ్ముట్టి ద్వితీయ భాగంలో కీలక పాత్ర చేస్తాడని, దుల్కర్ సల్మాన్ సైతం గెస్ట్ అప్పీయరెన్స్ కాకుండా కీ-రోల్ చేస్తాడని వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజానిజాల మాట ఉన్నా... 'లోకా-2'కు దర్శకుడు డొమ్నిక్ అరుణ్ ఇప్పటి నుండే పథక రచన చేస్తున్నాడని తెలుస్తోంది.
Also Read: Ashu Reddy: ప్రైవేట్ పార్ట్ పై పవన్ టాటూ చూపిస్తూ విష్ చేసిన జూనియర్ సమంత
Also Read: OG Craze Peaks: 'ఓజీ' ఒక్క టిక్కెట్ రూ.5 లక్షలు..