Lokah Chapter 1 Chandra: కల్యాణి, నస్లేన్.. 'లోకా' ట్రైలర్ చూశారా! పెద్దగానే ఫ్లాన్ చేశారుగా
ABN , Publish Date - Aug 25 , 2025 | 09:06 AM
మలయాళీ ముద్దుగమ్మ కల్యాణి ప్రియదర్శన్ (Kalyani) లీడ్ రోల్‌లో తెరకెక్కుతున్న చిత్రం లోకా ఛాప్టర్ 1 చంద్ర.
మలయాళీ ముద్దుగమ్మ కల్యాణి ప్రియదర్శన్ (Kalyani) లీడ్ రోల్‌లో తెరకెక్కుతున్న చిత్రం లోకా ఛాప్టర్ 1 చంద్ర (Lokah Chapter 1 Chandra). తెలుగులో కొత్త లోకగా విడుదల కానుంది. సూపర్ హీరో జానర్‌లో రూపొందిన ఈ చిత్రంలో ప్రేమలు హీరో నస్లేన్ (Naslen) కీలక పాత్రలో నటించగా అగ్ర హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) వేఫరార్ (Wayfarer Films) సంస్థ నిర్మిచింది. డామ్నిక్ అరుణ్ (Dominic Arun) దర్వకత్వం వహించాడు.
కాగా.. ఈ చిత్రం ఓనమ్ పండుగను పురస్కరించుకుని సెప్టెంబర్ మొదటి వారంలో పాన్ ఇండియాగా మలయాళంతో పాటు తెలుగు ఇతర భాషల్లోనూ థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రచార కార్యక్రమాలు షురూ చేస్తూ ఆదివారం సాయంత్రం టీజర్ విడుదల చేశారు. రెండు నిమిషాల 13 సెకండ్లు ఉన్న ఈ ట్రైలర్ చూస్తుంటే మలయాళీలు ఏదో గట్టిగానే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుత కాలానికి, భూత కాలానికి లింక్ రచేస్తూ సూపర్ పవర్స్ ఉన్న చంద్ర నేపథ్యంలోనే సినిమా ఉండనున్నట్లు అర్థమవుతోంది.
ఈ క్రమంలో స్థానిక పోలీసాఫీసర్‌తో వివాదం ఎలాంటి పరిస్థితికి దారి తీసింది అనే మరో పాయింట్ కూడీ అంతర్లీనంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ సీన్లు కూడా అదిరిపోయేలా తీర్చిదిద్దారు. ఇదిలాఉంటే.. ఇందులోని మెయిన్ లీడ్స్ చేస్తున్న నటులు కల్యాణి ప్రియదర్శన్ (Kalyani), నస్లేన్ (Naslen) తెలుగు వారికి కూడా పరిచయం ఉండడంతో ఇక్కడ హైదరాబాద్‌లో ప్రత్యేక ఈవెంట్ నిర్వహించి కొత్త లోకా ఛాప్టర్ 1 చంద్ర (Lokah Chapter 1 Chandra) చిత్రం తెలుగు ట్రైలర్ విడుదల చేసేందుకు యత్నిస్తున్నారు.