Lokah Chapter 1 Chandra: కల్యాణి, నస్లేన్.. 'లోకా' జంట అదిరింది
ABN , Publish Date - Aug 11 , 2025 | 09:56 AM
కల్యాణి ప్రియదర్శన్ సూపర్ హీరోగా, ప్రేమలు నస్లేన్ కీ రోల్‌లో నటిస్తోన్న మలయాళ చిత్రం లోకా ఛాప్టర్ 1 చంద్ర.
మలయాళీ ముద్దుగమ్మ కల్యాణి ప్రియదర్శన్ (Kalyani) సూపర్ హీరోగా, ప్రేమలు నస్లేన్ (Naslen) కీ రోల్‌లో నటిస్తోన్న మలయాళ చిత్రం లోకా ఛాప్టర్ 1 చంద్ర (Lokah - Chapter 1 - Chandra). పాన్ ఇండియా హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan)తన వేఫరార్ (Wayfarer Films) బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తోండగా డామ్నిక్ అరుణ్ (Dominic Arun) దర్వకత్వం వహించాడు. ఓనమ్ పండుగను పురస్కరించుకుని సెప్టెంబర్ మొదటి వారంలో పాన్ ఇండియాగా మలయాళంతో పాటు తెలుగు ఇతర భాషల్లోనూ థియేటర్లలోకి ఈ చిత్రాన్ని తీసుకు వస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదల చేసిన సినిమా టీజర్ మంచి ఆదరణను దక్కించుకుంది. విజువల్స్, యాక్షన్ సన్నివేశాలతో వావ్ అనిపించేలా ఆ టీజర్ సినిమాపై అమాంతం అంచనాలను పెంచేసింది. తాజాగా ఈ మూవీ నుంచి కల్యాణి, నస్లేన్ జంటగా ఉన్న లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ లుక్‌లో ఇరువురి ఫెయిర్ చూడడానికి బావుంది. కాగా ఈ చిత్రం ట్రైలర్ త్వరలోనే రిలీజ్ చేయనున్నారు.