Lokah: సూపర్ హీరోగా.. మలయాళ బ్యూటీ! లోకా టీజర్
ABN , Publish Date - Jul 28 , 2025 | 12:15 PM
మలయాళీ ముద్దుగమ్మ కల్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్‌లో సూపర్ హీరో జానర్‌లో తెరకెక్కుతున్న చిత్రం లోకా ఛాప్టర్ 1 చంద్ర.
మలయాళీ ముద్దుగమ్మ కల్యాణి ప్రియదర్శన్ (Kalyani) లీడ్ రోల్‌లో సూపర్ హీరో జానర్‌లో తెరకెక్కుతున్న చిత్రం లోకా ఛాప్టర్ 1 చంద్ర (Lokah - Chapter 1 - Chandra). ప్రేమలు హీరో నస్లేన్ (Naslen) కీలక పాత్రలో కనిపించనున్నాడు. దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) వేఫరార్ (Wayfarer Films) సంస్థ నిర్మిస్తోండగా డామ్నిక్ అరుణ్ (Dominic Arun) దర్వకత్వం వహిస్తున్నాడు. ఓనమ్ పండుగను పురస్కరించుకుని సెప్టెంబర్ మొదటి వారంలో పాన్ ఇండియాగా మలయాళంతో పాటు తెలుగు ఇతర భాషల్లోనూ థియేటర్లలోకి ఈ చిత్రాన్ని తీసుకు రానున్నారు.
ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ చిత్రం నుంచి టీజర్ రిలీజ్ చేశారు. కేవలం నిమిషం 29 సెకండ్లు మాత్రమే ఉన్న టీజర్‌లో హీరో ఓ టవర్ ఎదుట భయంగా నిలబడడం, ఆ తర్వాత సూపర్ హీరో పవర్స్ ఉన్న కల్యాణి ఎంట్రీ సీన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఆపై ఒకటి రెండు యాక్షన్ సన్నివేశాలు, హీరోయిన్ ఇటు నుంచి అటు రెప్ప పాటు వేగంలో దూసుకు పోవడం సన్నివేశాలు హాలీవుడ్ స్టైల్‌లో ఉన్నాయి. త్వరలోనే ట్రైలర్ విడుదల చేయనున్నారు.
Also Read.. ఇవి కూడా చదవండి