OG Craze Peaks: 'ఓజీ' ఒక్క టిక్కెట్ రూ.5 లక్షలు..
ABN , Publish Date - Sep 02 , 2025 | 02:16 PM
పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ రిజల్ట్‌తో సంబంధం లేకుండా బిగ్గెస్ట్ ఓపెనింగ్‌ను దక్కించుకున్న సంగతి విధితమే! ఇప్పుడు అంతకుమించి బజ్‌తో ప్రేక్షకులు, అభిమానులు ఎదరుచూస్తున్న చిత్రం ‘ఓజీ’.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన ‘హరిహర వీరమల్లు’ రిజల్ట్‌తో సంబంధం లేకుండా బిగ్గెస్ట్ ఓపెనింగ్‌ను దక్కించుకున్న సంగతి విధితమే! ఇప్పుడు అంతకుమించి బజ్‌తో ప్రేక్షకులు, అభిమానులు ఎదరుచూస్తున్న చిత్రం ‘ఓజీ’ (Og Movie) ఈ సినిమా క్రేజ్ ఆకాశమే హద్దు అన్నట్లు ఉంది. సుజీత్ వదిలిన గ్లింప్స్, పాటలు ఒక్కసారిగా సినిమాపై హైప్ పెంచేశాయి. ఫ్యాన్స్ పవన్ నుంచి ఏం కోరుకుంటున్నారో ఆ అంశాలన్నింటినీ కలిపి ఓజీతో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు సుజీత్. ఈ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది . బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హస్మీ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇందులో పవన్‌కు జోడీగా ప్రియాంక మోహన్ నటించింది. సినిమా విడుదల తేదీ దగ్గరపడడంతో ప్రీ సేల్ మొదలైంది.
తాజాగా ఈ సినిమా మొదటి టికెట్‌ను అభిమానులు వేలం వేశారు. ఒక అభిమాని ఏకంగా రూ.5 లక్షలకు కొనుగోలు చేశారు. దీంతో ఓజీకి ఉన్న క్రేజ్ ఏంటో తెలుస్తుంది. ఈ సినిమా మొదటి టికెట్ అమ్మగా వచ్చిన ఆ రూ.5 లక్షలను జనసేన పార్టీకి విరాళంగా ఇస్తున్నట్లు అభిమానులు ప్రకటించారు. ఇలా పవన్ కళ్యాణ్ సినిమాలకే జరుగుతుందని, గతంలో ఎప్పుడూ, ఎక్కడ లేని విధంగా ఒక సినిమా టికెట్ రూ.5 లక్షలు పలకడం మామూలు విషయం కాదని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
పవన్‌కల్యాన్ ఏపీ ఉప ముఖ్యమంత్రిగా విధులు కొనసాగిస్తూ బిజీగా ఉన్నప్పటికీ కుదిరిన సమయంలో కాల్షీట్ ఇచ్చి ఓజీ చిత్రాన్ని పూర్తి చేశారు. ఇప్పుడు ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు. గ్లింప్స్, తమన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాపై అంచనాలు రెట్టింపు చేసింది. ఈ చిత్రం పవన్ కెరీర్‌లోనే భారీ విజయం సాధించనుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.