Ashu Reddy: ప్రైవేట్ పార్ట్ పై పవన్ టాటూ చూపిస్తూ విష్ చేసిన జూనియర్ సమంత
ABN , Publish Date - Sep 02 , 2025 | 03:27 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కి ఫ్యాన్స్ ఉండరు భక్తులు మాత్రమే ఉంటారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
Ashu Reddy: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కి ఫ్యాన్స్ ఉండరు భక్తులు మాత్రమే ఉంటారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. భక్తులు అంటే కేవలం మగవారు మాత్రమే అనుకుంటే పొరపాటే. పవన్ కు లేడి ఫ్యాన్స్ కూడా చాలా ఎక్కువ మందే ఉన్నారు. అలాంటి లేడి భక్తురాల లిస్ట్ తీస్తే మొదటి స్థానంలో ఉంటుంది అషూ రెడ్డి(Ashu Reddy).
టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయిన స్టార్స్ లో అషూ ఒకరు. సమంతలా ఉంటుందని.. ఆమెను జూనియర్ సమంతగా మార్చేశారు. అప్పటినుంచి అషూ జూనియర్ సామ్ గానే ఫేమస్ అయ్యింది. ఆ గుర్తింపుతో బిగ్ బాస్ కి వెళ్ళి మరింత అభిమానులను సంపాదించుకుంది. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చకా.. షోస్, సినిమాలు అంటూ తిరగుతుంది. మధ్యలో బరువు పెరిగి కనిపించిన ఈ చిన్నది ఆ తరువాత సర్జరీ ద్వారా బరువు తగ్గిందని టాక్.
ఇక ఇదంతా పక్కన పెడితే.. సోషల్ మీడియాలో అమ్మడి అందాల ఆరబోతకు సపారేట్ ఫ్యాన్ బేస్ నే ఉంది. ఇన్స్టాలో అభిమానులను తనవైపుకు తిప్పుకోవడం ఎలా అనేది అషూకి తెలిసినంత ఇంకెవరికీ తెలియదు. ఇక అషూకి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టాన్ని ఏ విధంగా చూపించిందో తెలుసా.. తన శరీరంపై పవన్ కళ్యాణ్ పేరును టాటూగా వేయించుకుంది. అది కూడా ఏ చేతిమీదనో.. వీపు మీదనో కాదు.. ప్రైవేట్ పార్ట్ కు పక్కన..కుడిచేతి రొమ్ము పక్కన పవన్ కళ్యాణ్ అని టాటూ వేయించుకుంది. అప్పట్లో ఈ టాటూ పెద్ద దూమరాన్నే రేపింది. అంతేనా ఈ టాటూను పవన్ కళ్యాణ్ కు కూడా చూపించింది.
ఇక నేడు పవన్ పుట్టినరోజు కావడంతో అమ్మడు మరోసారి ఆ టాటూను బయటపెట్టి హల్చల్ చేసింది. ఆ టాటూ కనిపించేలా వైట్ కలర్ బాడీకాన్ డ్రెస్ లో ఫోటోకు ఫోజ్ ఇచ్చి.. ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. 'మీరు పుట్టిన ఈ నేలపై నేను పుట్టడం చలా గర్వంగా ఉంది. ప్రజల దేవుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు' అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
Mirai: మనోజ్ ను అభినందించిన రజనీకాంత్
OG Craze Peaks: 'ఓజీ' ఒక్క టిక్కెట్ రూ.5 లక్షలు..