గుర్తుండిపోయే ప్రాజెక్టు అవుతుంది
ABN , Publish Date - May 13 , 2025 | 02:49 AM
తెలుగు చిత్రపరిశ్రమలోని కార్మికుల కోసం చిత్రపురి కాలనీలో నిర్మించనున్న ఓ నూతన రెసిడెన్షియల్ ప్రాజెక్టు ‘సఫైర్ సూట్’ బ్రోచర్‌ను ఆవిష్కరించారు చిత్రపురి కాలనీ...

తెలుగు చిత్రపరిశ్రమలోని కార్మికుల కోసం చిత్రపురి కాలనీలో నిర్మించనున్న ఓ నూతన రెసిడెన్షియల్ ప్రాజెక్టు ‘సఫైర్ సూట్’ బ్రోచర్‌ను ఆవిష్కరించారు చిత్రపురి కాలనీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌కుమార్. ఈ సందర్భంగా ఫిల్మ్ నగర్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘‘త్వరలోనే భూమి పూజ నిర్వహిస్తాం. 40 నెలల్లో ఇది పూర్తవుతుంది. గుర్తుండిపోయే ప్రాజెక్టు అవుతుంది’’ అని అన్నారు. నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘‘ఇండస్ట్రీ పెద్దలంతా ఒకే ప్రాజెక్టుపై నిలబడి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువచ్చారు. ఇది ఎంతో అద్భుతంగా ఉండబోతోంది’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుచిత్ర నిర్మాతలమండలి అధ్యక్షుడు కె.దామోదర ప్రసాద్, ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్, సెక్రటరీ ప్రసన్నకుమార్, మా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మాదాల రవి, నిర్మాత సి.కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.