Rajinikanth: ‘తలైవర్‌-171’లో సీనియర్‌ నటి శోభన?

ABN , Publish Date - Apr 14 , 2024 | 11:18 PM

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ - యువ డైరెక్టర్‌ లోకేష్‌ కనకరాజ్‌ కాంబినేషన్‌లో ఒక చిత్రం రానుంది. రజనీ నటించే 171వ సినిమా ఇది. సన్‌ పిక్చర్స్‌ బ్యానరుపై నిర్మాత కళానిధి మారన్‌ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకు ‘కళుగు’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులోని ఒక ముఖ్య పాత్రకు సీనియర్‌ నటి శోభనను నటింపజేసేందుకు ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టు కోలీవుడ్‌ వర్గాల సమాచారం.

Rajinikanth: ‘తలైవర్‌-171’లో సీనియర్‌ నటి శోభన?
Thalaivar 171 First Look

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Super Star Rajinikanth) - యువ డైరెక్టర్‌ లోకేష్‌ కనకరాజ్‌ (Lokesh Kanagaraj) కాంబినేషన్‌లో ఒక చిత్రం రానుంది. రజనీ నటించే 171 (Thalaivar 171)వ సినిమా ఇది. సన్‌ పిక్చర్స్‌ బ్యానరుపై నిర్మాత కళానిధి మారన్‌ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను నిర్మాణ సంస్థ విడుదల చేయగా, రజనీకాంత్ అభిమానులతో పాటు ప్రేక్షకుల నుంచి స్పందనను రాబట్టుకుంది. ఈ సినిమాకు ‘కళుగు’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ టైటిల్‌ను ఈనెల 22న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇందులోని ఒక ముఖ్య పాత్రకు సీనియర్‌ నటి శోభన(Shobana)ను నటింపజేసేందుకు ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టు కోలీవుడ్‌ వర్గాల సమాచారం.

*Kanguva: ‘కంగువ’ డబుల్ డోప్ పోస్టర్.. అదిరిపోలా..


Shobana.jpg

శోభన ఇందులో నటిస్తుందనే వార్తలు వినిపిస్తున్నప్పటి నుండి ఈ సినిమాకు బాగా వార్తల్లో నిలుస్తోంది. ఎందుకంటే, గతంలో రజనీకాంత్‌తో శోభన (Rajinikanth and Shobana) నటించి ఉంది. ఇప్పుడు మళ్లీ అంటే.. ఇందులో రజనీకాంత్ ఏమైనా డబుల్ రోల్ చేస్తున్నారా? అనేలా టాక్ మొదలైంది. అలాగే, ఇంతకు ముందు వచ్చిన ‘జైలర్’ తరహా పాత్రని మళ్లీ రజనీ చేయబోతున్నాడా? అనేలా కోలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వైరల్ అవుతుండటం విశేషం. కాగా.. స్టంట్స్‌ అన్బరివు అందిస్తుండగా అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందించే ఈ చిత్రంలో నటించే హీరోయిన్‌, ఇతర నటీనటుల వివరాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి:

====================

*Pushpa 2 The Rule: 138 గంట‌ల‌పాటు ట్రెండింగ్‌లో.. సరికొత్త రికార్డ్

*********************************

*Manjummel Boys: తెలుగు వెర్షన్ ప్రదర్శనలను నిలిపేసిన పీవీఆర్ మల్టిఫ్లెక్స్

**********************

Updated Date - Apr 14 , 2024 | 11:18 PM