Kanguva: ‘కంగువ’ డబుల్ డోప్ పోస్టర్.. అదిరిపోలా..

ABN , Publish Date - Apr 14 , 2024 | 10:22 PM

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. ఇప్పటికే ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో తెలియంది కాదు. తాజాగా తమిళ న్యూ ఇయర్ ‘పూతండు’ ఫెస్టివల్ సందర్భంగా ‘కంగువ’ సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. కత్తి పట్టిన యుద్ధ వీరుడు కంగువ, మోడరన్ వారియర్‌గా సూర్య ఎదురెదురుగా నిల్చున్న స్టిల్‌‌ను పోస్టర్‌గా డిజైన్ చేసి మేకర్స్ వదిలిన ఈ పోస్టర్ మంచి స్పందనను రాబట్టుకుంటోంది.

Kanguva: ‘కంగువ’ డబుల్ డోప్ పోస్టర్.. అదిరిపోలా..
Kanguva New Still

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’ (Kanguva). ఇప్పటికే ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో తెలియంది కాదు. తాజాగా తమిళ న్యూ ఇయర్ ‘పూతండు’ ఫెస్టివల్ సందర్భంగా ‘కంగువ’ సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. కత్తి పట్టిన యుద్ధ వీరుడు కంగువ, మోడరన్ వారియర్‌గా సూర్య ఎదురెదురుగా నిల్చున్న స్టిల్‌‌ను పోస్టర్‌గా డిజైన్ చేసి మేకర్స్ వదిలిన ఈ పోస్టర్ మంచి స్పందనను రాబట్టుకుంటోంది. గతం, వర్తమానం ఢీకొంటే కొత్త భవిష్యత్ మొదలవుతుంది అని ఈ పోస్టర్‌లో క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తి కలిగిస్తోంది. (Kanguva New Poster)

*Solo Boy: ‘సోలో బాయ్’ సెట్లో గ్రాండ్‌గా బిగ్ బాస్ గౌతమ్ కృష్ణ బర్త్ డే సెలబ్రేషన్స్


Kanguva.jpg

‘కంగువ’ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌గా దర్శకుడు శివ (Director Siva) రూపొందిస్తున్నారు. దిశా పటానీ (Disha Patani), బాబీ డియోల్ (Bobby Deol) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను హ్యూజ్ బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. పది భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (DSP) ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Pushpa 2 The Rule: 138 గంట‌ల‌పాటు ట్రెండింగ్‌లో.. సరికొత్త రికార్డ్

*********************************

*Manjummel Boys: తెలుగు వెర్షన్ ప్రదర్శనలను నిలిపేసిన పీవీఆర్ మల్టిఫ్లెక్స్

**********************

Updated Date - Apr 14 , 2024 | 10:23 PM