Rajinikanth: ర‌జ‌నీకాంత్, నెల్స‌న్ కాంబినేష‌న్‌లో.. జైల‌ర్ 2 సీక్వెల్ ‘హుకూం’

ABN , Publish Date - Apr 13 , 2024 | 07:42 AM

చాలా గ్యాప్ త‌ర్వాత ర‌జ‌నీకాంత్ స్టామినా ఏంటో మ‌రోమారు చూయించిన చిత్రం జైల‌ర్. త్వ‌ర‌లో ఈ సినిమా సీక్వెల్ ప‌ట్టాలెక్క‌నున్న‌ట్లు నెట్టింట వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

Rajinikanth: ర‌జ‌నీకాంత్, నెల్స‌న్ కాంబినేష‌న్‌లో.. జైల‌ర్ 2 సీక్వెల్ ‘హుకూం’
jailer

చాలా గ్యాప్ త‌ర్వాత ర‌జ‌నీకాంత్ (Rajinikanth) స్టామినా ఏంటో మ‌రోమారు చూయించిన చిత్రం జైల‌ర్ (Jailer). 2023 అగ‌స్టులో విడుద‌లైన ఈ సినిమా స‌రికొత్త రికార్డులు తిర‌గ‌రాసిన ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు రూ. 650 కోట్ల‌ను కొల్ల‌గొట్టింది. దీంతో కొంత‌కాలం ఈ సినిమానే టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిల‌వ‌గా దీనికి సీక్వ‌ల్ కూడా ఉంటుంద‌నేలా వార్త‌లు బాగానే వినిపించాయి. సోష‌ల్ మీడియాలో బాగా చ‌ర్చ‌లు కూడా జ‌రగాయి.అయితే.. ఇప్పుడా వార్త‌ల‌ను నిజం చేస్తూ త్వ‌ర‌లో సినిమా ప‌ట్టాలెక్క‌నుంద‌ని తెలుస్తోంది.

Jailer.jpg

అంతేకాక చిత్రానికి జైల‌ర్ సినిమాలో ర‌జ‌నీ వాడిన హుకూం అనే ప‌దాన్ని రాబోయే సినిమా టైటిల్‌గా పిక్స్ చేసిన‌ట్లు తెలుస్తోంది. మొద‌టి చిత్రాన్ని తెర‌కెక్కించిన నెల్స‌న్ దిలీప్ కుమారే ఈ రెండో చిత్రాన్ని తెర‌కెక్కించ నుండ‌గా ఇప్ప‌టికే స్క్రిప్ట్ వ‌ర్క్‌ కూడా కంప్లీట్ చేసిన‌ట్లు గుగుస‌లు వినిపిస్తున్నాయి. సినిమా షూటింగ్‌ను ఈ ఏడాది దీపావ‌ళి పండుగ త‌ర్వాత ప్రారంభించి 2025 వేస‌విలో విడుద‌ల చేసేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్నారు. కానీ ఇప్ప‌టివ‌ర‌కు అధికారికంగా ఎలాంటి అప్డేట్ అయితే లేదు.


ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్ Rajinikanth జై భీమ్ చిత్ర‌ ద‌ర్శ‌కుడు జ్ఞాన్ వేల్‌ రాజా ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్న (Thalaivar170) వెట్ట‌యాన్ (Vettaiyan) తెలుగులో వేట‌గాడు సినిమా షూటింగ్ ముగింపు ద‌శ‌లో ఉండ‌గా ఈ ద‌స‌రాకు విడుద‌ల కానుంది. అదేవిధంగా లోకేశ్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న‌ Thalaivar171 సినిమా షూటింగ్ ఈవారం మొద‌లువుతుండ‌గా 2024లో విడుద‌ల కానుంది. . ఇదిలాఉండ‌గా జైల‌ర్ 2 గా వ‌స్తుంద‌నుకుంటున్న హుకూం చిత్రం జైల‌ర్‌కు సీక్వెల్‌గా ఉంటుందా లేక కొత్త కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిస్తారా అనేది తెలియాల్సి ఉంది.

Updated Date - Apr 13 , 2024 | 07:42 AM