Radhika Apte: ఓటీటీలో బాల‌య్య బ్యూటీ న్యూడ్‌గా న‌టించిన సినిమా! తెలుగులోనూ ట్రెండింగ్‌

ABN , Publish Date - Apr 14 , 2024 | 05:41 PM

ఓ బోల్డ్‌ చిత్రం ఎట్ట‌కేట‌ల‌కు మ‌న దేశంలో స్ట్రీమింగ్‌కు వ‌చ్చింది. పైగా ఇంగ్లీష్‌, హిందీ, తెలుగు వంటి మూడు బాష‌ల్లో మాత్ర‌మే ఉండ‌డం విశేషం.

Radhika Apte: ఓటీటీలో బాల‌య్య బ్యూటీ న్యూడ్‌గా న‌టించిన సినిమా! తెలుగులోనూ ట్రెండింగ్‌
radhika

ఓ బోల్డ్‌ చిత్రం ఎట్ట‌కేట‌ల‌కు మ‌న దేశంలో స్ట్రీమింగ్‌కు వ‌చ్చింది. పైగా ఇంగ్లీష్‌, హిందీ, తెలుగు వంటి మూడు బాష‌ల్లో మాత్ర‌మే ఉండ‌డం విశేషం. త‌న క్యారెక్ట‌ర్లు, వ్యాఖ్య‌ల‌తో త‌ర‌చూ వివాదాల్లో ఉండే రాధికా అప్టే (Radhika Apte) ఈ సినిమాలో క‌థానాయిక‌గా న‌టించ‌గా ఇందులో అమ్మ‌డు చేసిన పాత్రే అప్ప‌ట్లో దేశ‌వ్యాప్తంగా పెద్ద చ‌ర్చ‌నీయాంశం అయింది. అంతేగాక‌ చాలామంది ప్రేక్ష‌కుల‌ను ఈ సినిమా కోసం ఎదురు చూసేలా చేసింది. అందుకు ముఖ్య కార‌ణం రాధిక ఇందులో న్యూడ్‌గా న‌టించ‌డమే.

dev.jpg

స్ల‌మ్ డాగ్ మిలియ‌నీర్ చిత్రంతో ప్ర‌పంచ‌వ్యాప్త‌గా పేరు తెచ్చుకున్న‌ దేవ్ ప‌టేల్ (Dev Patel) హీరోగా రాధికా ఆఫ్టే (Radhika Apte) క‌థానాయిక‌గా హాలీవుడ్‌లో రూపొందిన చిత్రం ది వెడ్డింగ్ గెస్ట్ (The Wedding Guest). 2019లో వ‌చ్చిన ఈ చిత్రం పూర్తిగా ఇండియా నేప‌థ్యంలోనే తెర‌కెక్క‌గా షూటింగ్ అంతా ఇక్క‌డే చేశారు.

twg.jpg


క‌థ విష‌య‌యానికి వ‌స్తే.. జై అనే బ్రిటీష్ యువ‌కుడు పాకిస్తాన్‌లో ఉండే అమ్మాయి స‌మీరాను ఇండియాలో ఉండే అబ్బాయి దీపేశ్‌ను క‌లిపేందుకు కాంట్రాక్ట్ తీసుకుంటాడు. ఈ నేప‌థ్యంలో జై పాకిస్తాన్‌కు వెళ్లి స‌మీరాను తీసుకువ‌చ్చి ఇండియాలో దీపేశ్ వ‌ద్ద‌కు తీసుకువ‌స్తాడు. ఈక్ర‌మంలో జ‌రిగిన మ‌ర్డ‌ర్, కిడ్నాప్ న్యూస్‌ మీడియాలో బాగా వైర‌ల్ అవ‌డంతో దీపేశ్ త‌న నిర్ణ‌యం మార్చుకుని స‌మీరాను తిరిగి అక్క‌డే వ‌దిలేసి రావాల‌ని డ‌బ్బులు ఎక్కువ‌గా ఇస్తాన‌ని చెబ‌తాడు. అయితే ఈ క్ర‌మంలో స‌మీరా, దీపేశ్‌ల మ‌ధ్య అంత‌కుముందే జ‌రిగిన వ‌జ్రాల‌కు సంబంధించిన ఓ విష‌యం జైకు తెలుస్తుంది.

radhik.jpg

ఇక ఆ త‌ర్వాత అ వ‌జ్రాల‌ను ద‌క్కించుకోవ‌డానికి, దేశం నుంచి త‌ప్పించుకోవ‌డం కోసం ఈ ముగ్గురు వేసే ఫ్లాన్ల చుట్టూ క‌థ తిరుగ‌తూ ఉంటుంది. చివ‌ర‌కు అ వ‌జ్రాలు ఎవ‌రికి సొంత‌మైన‌య్, దేశం దాటారా అనే ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో సినిమా సాగుతుంది. ఈ క్ర‌మంలోనే హీరో హీరోయిన్ల మ‌ధ్య వ‌చ్చే రోమాన్స్, ఇంటిమేట్ స‌న్నివేశాలు ఒపెన్‌గానే ఉంటాయి. ఇటీవ‌లే నెట్‌ఫ్లిక్స్‌లోస్ట్రీమింగ్‌కు వ‌చ్చిన ఈ సినిమా ఇప్పుడు హిందీ, ఇంగ్లీష్‌తో పాటు తెలుగు భాష‌లోనూ అందుబాటులో ఉంది. నేష‌న‌ల్ వైడ్‌గా టాప్‌2లో ట్రెండింగ్ అవుతోంది. ఇంకెందుకు ఆల‌స్యం ఆస‌క్తి ఉన్న‌వారు ఇప్పుడే సినిమాను చూసేయండి.

apte.jpg

Updated Date - Apr 14 , 2024 | 05:41 PM