Pushpa 2 The Rule: 138 గంట‌ల‌పాటు ట్రెండింగ్‌లో.. సరికొత్త రికార్డ్

ABN , Publish Date - Apr 14 , 2024 | 08:33 PM

ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినిమా ప్రేక్ష‌కులు ఎదురుచూస్తున్న చిత్రం ‘పుష్ప‌2: ది రూల్’. ‘పుష్ప ది రైజ్‌’తో ప్ర‌పంచ సినీ ప్రేమికుల‌ను అమితంగా ఆక‌ట్టుకోవ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఈ చిత్రంలో ఐకాన్‌స్టార్ న‌ట‌న‌కు, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు అంద‌రూ ఫిదా అయిపోయిన సంగ‌తి తెలిసిందే. రీసెంట్‌గా విడుదలైన ‘పుష్ప‌2: ది రూల్’ టీజర్ యూట్యూబ్‌లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది.

Pushpa 2 The Rule: 138 గంట‌ల‌పాటు ట్రెండింగ్‌లో.. సరికొత్త రికార్డ్
Allu Arjun in Pushpa 2 The Rule

ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినిమా ప్రేక్ష‌కులు ఎదురుచూస్తున్న చిత్రం ‘పుష్ప‌2: ది రూల్’ (Pushpa 2: The Rule). ‘పుష్ప ది రైజ్‌’తో ప్ర‌పంచ సినీ ప్రేమికుల‌ను అమితంగా ఆక‌ట్టుకోవ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఈ చిత్రంలో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) న‌ట‌న‌కు, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ (Sukumar) ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు అంద‌రూ ఫిదా అయిపోయిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇక ప్ర‌స్తుతం నిర్మాణంలో వున్న సీక్వెల్ ‘పుష్ప‌-2 ది రూల్’‌కు సంబంధించి ఎటువంటి అప్‌డేట్ వచ్చినా సంచలనంగా మారుతోంది. రీసెంట్‌గా ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ పుట్టిన‌రోజు సంద‌ర్బంగా ఈ చిత్ర టీజ‌ర్‌ను మేకర్స్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ టీజ‌ర్ విడుద‌లైనప్ప‌టి నుండి అనూహ్య స్పంద‌న‌తో వ‌ర‌ల్డ్‌వైడ్‌గా సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది. ఈ టీజర్ ఇప్పుడు సరికొత్త రికార్డులకు కేంద్రబిందువుగా మారింది. (Pushpa 2 The Rule Teaser)

*Raj Tarun: రాజ్ తరుణ్, రాశి సింగ్‌ల సినిమాకు క్లాప్ పడింది..


Pushpa-2.jpg

‘పుష్ప‌-2 ది రూల్’‌ టీజ‌ర్ విడుద‌లైన‌ప్ప‌టి నుండి యూట్యూబ్‌లో కంటిన్యూగా 138 గంట‌ల‌పాటు ట్రెండింగ్‌లో నెంబ‌ర్‌వ‌న్‌గా వుంటూ స‌రికొత్త రికార్డును నెల‌కొల్పింది. అంతేకాదు ఇప్ప‌టి వ‌ర‌కు 110 మిలియ‌న్ల వ్యూస్‌తో పాటు, 1.55మిలియ‌న్ల లైక్స్‌తో అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటూ విజ‌య‌ప‌థంలో కొన‌సాగుతుంది. ఇక రాను రాను మ‌రిన్ని రికార్డులు కూడా పుష్ప‌-2 సొంతం కానున్నాయి. 2024 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. (Pushpa 2 The Rule Teaser Records)


ఇవి కూడా చదవండి:

====================

*Manjummel Boys: తెలుగు వెర్షన్ ప్రదర్శనలను నిలిపేసిన పీవీఆర్ మల్టిఫ్లెక్స్

**********************

*Aa Okkati Adakku: ‘ఆ ఒక్కటి అడక్కు’ తెలుగు రాష్ట్రాల హక్కులు ఎవరికంటే..

****************************

Updated Date - Apr 14 , 2024 | 08:33 PM