Manjummel Boys: తెలుగు వెర్షన్ ప్రదర్శనలను నిలిపేసిన పీవీఆర్ మల్టిఫ్లెక్స్

ABN , Publish Date - Apr 11 , 2024 | 03:24 PM

మలయాళంలో ఘన విజయాన్ని సాధించి రికార్డు స్థాయిలో వసూళ్లు కొల్లగొట్టిన ‘మంజుమల్ బాయ్స్’... తెలుగులోనూ అదే స్థాయిలో ప్రేక్షకుల నుంచి ఆదరణ పొందుతోంది. తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ మంచి వసూళ్లు సాధిస్తోన్న ఈ చిత్ర తెలుగు వెర్షన్ ప్రదర్శనలను అనూహ్యంగా పీవీఆర్ మల్టిఫ్లెక్స్ ఆపేసింది. మలయాళ నిర్మాతతో ఉన్న వివాదం కారణంగానే ఆ చిత్ర ప్రదర్శనలను ఆపేసినట్లు పీవీఆర్ వెల్లడించింది.

Manjummel Boys: తెలుగు వెర్షన్ ప్రదర్శనలను నిలిపేసిన పీవీఆర్ మల్టిఫ్లెక్స్
Manjummel Boys Movie Poster

మలయాళంలో ఘన విజయాన్ని సాధించి రికార్డు స్థాయిలో వసూళ్లు కొల్లగొట్టిన ‘మంజుమల్ బాయ్స్’ (Manjummel Boys)... తెలుగులోనూ అదే స్థాయిలో ప్రేక్షకుల నుంచి ఆదరణ పొందుతోంది. తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ క్రమంలో అనూహ్యంగా పీవీఆర్ మల్టిఫ్లెక్స్ (PVR Multiplex) ‘మంజుమల్ బాయ్స్’ తెలుగు వెర్షన్ ప్రదర్శనలను ఆపేసింది. మలయాళ నిర్మాతతో ఉన్న వివాదం కారణంగానే ఆ చిత్ర ప్రదర్శనలను ఆపేసినట్లు పీవీఆర్ వెల్లడించింది. పీవీఆర్ మల్టిఫ్లెక్స్ తీరుపై మైత్రీ మూవీస్ (Mythri Movies) డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి (Sashidhar Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు.

*Pushpa 2: సుకుమార్‌ కష్టం మామూలుగా లేదుగా..!


మలయాళ నిర్మాతతో వివాదం ఉంటే తెలుగు వెర్షన్‌ను ఎలా ఆపేస్తారని మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి ప్రశ్నించారు. మంచి వసూళ్లు సాధిస్తున్న క్రమంలో అర్ధాంతరంగా ఆపేయడం అన్యాయమన్న శశిధర్ రెడ్డి... ప్రదర్శనలు ఆపడం వల్ల ఆర్థికంగా నష్టపోతున్నట్లు తెలిపారు. పీవీఆర్ మల్టిప్లెక్స్ వ్యవహారశైలిని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ (Telugu Film Chamber) దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పీవీఆర్ మల్టిఫ్లెక్స్ తీరుపై గురువారం సాయంత్రం అత్యవసర సమావేశం కానుంది.


manjummel-boys.jpg

‘మంజుమల్ బాయ్స్’ కథ (Manjummel Boys Story) విషయానికి వస్తే.. కేరళలోని కొచ్చి పట్టణానికి చెందిన కొంతమంది స్నేహితులు కుట్టన్ (సౌబిన్ షాహిర్) నేతృత్వంలో తమిళ నాడులోని కొడైకెనాల్ చూడటానికి విహారయాత్రకు వెళతారు. అక్కడ వీరందరూ కొడైకెనాల్‌లోని అందాలను చూస్తూ, అన్నీ తిరుగుతూ ఉంటే, ఒక స్నేహితుడు ‘గుణ’ గుహలు కూడా చూద్దాం అని చెప్పి అక్కడికి వెళదాం అంటాడు. కమల్ హాసన్ నటించిన ‘గుణ’ సినిమా అక్కడ షూటింగ్ చేసిన సందర్భంగా వాటికి ‘గుణ’ గుహలు అని పేరు. సెక్యూరిటీ గార్డు, గైడ్, అక్కడ వున్న మిగతా వాళ్ళు ఈ స్నేహితులని మరీ లోపలికి వెళ్లొద్దు, అవన్నీ చాలా ప్రమాదకరమైనవి అని వారిస్తున్నా వినకుండా ఈ స్నేహితులు అందరూ ఆ కొండల్లోకి వెళతారు. అక్కడ ఒక చిన్న కొండపైన చాలామంది తాము వచ్చినట్టుగా ఏవో రాతలు రాసి ఉంటే, ‘మంజుమ్మల్ బాయ్స్’ (Manjummel Boys Movie) అని మనం కూడా రాద్దాం అని అంటాడు ఈ గ్రూపులో వున్న ఒక స్నేహితుడు. సరే అందరూ ఆ కొండల్లోకి దిగుతారు, అక్కడ కొండమీద పేరు రాసి ఎలా ఉందిరా అని అడుగుతారు. ఇదే గ్రూపులో వచ్చిన సుభాష్ అనే స్నేహితుడు ఆ పేరు ఎలా వుందో చూస్తూ ఒక్కసారిగా ఒక గుహలోపలికి పడిపోతాడు. అది చాలా లోతుగా ఉంటుంది, డెవిల్స్ కిచెన్ అని కూడా దానికి పేరు. ఎందుకంటే అందులో ఇలా పడిపోయిన వారు ఎవరూ అంతవరకు బతికి బట్టకట్టలేదు. ఆ లోయ ఎంత లోతు ఉంటుందో ఎవరికీ తెలియదు, మరి పడిపోయిన సుభాష్ అందులో బతికే వున్నాడా? అతన్ని వదిలేసి స్నేహితులు వెళ్లిపోయారా? పోలీసులకి చెబితే వాళ్ళు స్నేహితులని ఎందుకు కొట్టారు? ఈ గ్రూపుకి నాయకత్వం వహించిన కుట్టన్ చివరికి ఏమి చేశాడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే ‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీ.


ఇవి కూడా చదవండి:

====================

*Aa Okkati Adakku: ‘ఆ ఒక్కటి అడక్కు’ తెలుగు రాష్ట్రాల హక్కులు ఎవరికంటే..

****************************

*Devara: ‘లైగర్’ నిర్మాత చేతికి ‘దేవర’.. ఆ చిక్కులు తప్పవా!

*********************

Updated Date - Apr 11 , 2024 | 04:04 PM