Indian 2: పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో  బిజీ... విడుదల అప్పుడే. 

ABN , Publish Date - Apr 14 , 2024 | 03:40 PM

కమల్  హాసన్, శంకర్ కలయికలో రూపొందుతున్న చిత్రం ‘భార‌తీయుడు 2’. భార‌తీయుడు బ్లాక్ బస్ట‌ర్ త‌ర్వాత వీరిద్ద‌రూ కాంబోలో రాబోతున్న ఈ సినిమా కోసం అంద‌రూ ఎంతో ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు.

Indian 2: పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో  బిజీ... విడుదల అప్పుడే. 
Indian 2

కమల్  హాసన్(Kamala haasan), శంకర్ (Shakar shanmugam)కలయికలో రూపొందుతున్న చిత్రం ‘భార‌తీయుడు 2’(Indian2). భార‌తీయుడు బ్లాక్ బస్ట‌ర్ త‌ర్వాత వీరిద్ద‌రూ కాంబోలో రాబోతున్న ఈ సినిమా కోసం అంద‌రూ ఎంతో ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు. అవినీతికి వ్య‌తిరేకంగా పోరాటం చేసిన సేనాప‌తిగా ‘భార‌తీయుడు’ చిత్రంలో క‌మ‌ల్ హాస‌న్ తిరుగులేని విజ‌యాన్ని సాధించారు. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘భార‌తీయుడు 2’ రానుండ‌టంతో మూవీపై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ నెల‌కొన్నాయి. గ్రిప్పింగ్ క‌థ‌నంతో ఈ మూవీ మ‌రింత‌గా ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌నుంది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. సేనాపతిగా మరోసారి కమల్ హాసన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయబోతున్నారంటూ అభిమానులు, సినీ ప్రేమికులు, ట్రేడ్ వర్గాలు స‌హా అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.  భార‌తీయుడు 2’ సినిమాపై ముందు నుంచి భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ నెల‌కొన్నాయి. దానికి అనుగుణంగానే ప్ర‌మోష‌న‌ల్ ప్లానింగ్‌తో  సినిమాపై అంచ‌నాల‌ను పెంచుతూ వ‌స్తున్నారు. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసిన శంక‌ర్ ఇప్పుడు నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేయ‌టంపై దృష్టి సారించారు. మే నెలాఖ‌రున ప‌వ‌ర్‌ప్యాక్డ్ ట్రైల‌ర్‌ను చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. జూన్‌లో భారీ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

 
తాజాగా విడుద‌ల చేసిన పోస్ట‌ర్‌లో ‘జీరో టాల‌రెన్స్‌’ లైన్ ఈ అంచ‌నాల‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లాయి. క‌మ‌ల్ హాస‌న్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ చిత్రంలో సిద్ధార్థ్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, ఎస్‌.జె.సూర్య‌, బాబీ సింహ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ర‌వివ‌ర్మ‌న్  సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి అనిరుద్ ర‌విచంద్ర‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎ.శ్రీక‌ర ప్ర‌సాద్ ఎడిట‌ర్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా టి.ముత్తురాజ్ గా వ‌ర్క్ చేస్తున్నారు. బి.జ‌య‌మోహ‌న్‌, క‌బిల‌న్ వైర‌ముత్తు, ల‌క్ష్మీ శ‌ర‌వ‌ణ‌కుమార్‌ల‌తో క‌లిసి డైరెక్ట‌ర్ శంక‌ర్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, రెడ్ జైంట్ మూవీస్  రూపొందిస్తోన్న భారీ బ‌డ్జెట్‌తో ‘భార‌తీయుడు 2’లో క్రియేటివ్ బ్రిలియ‌న్స్  క్రియేట్ చేస్తున్నారు.   లైకా ప్రొడ‌క్ష‌న్స్ అధినేత సుభాస్క‌ర‌న్ జూన్‌లో ఇండియన్ 2 పేరుతో త‌మిళంలో, భార‌తీయుడు 2 పేరుతో తెలుగు, హిందుస్థానీ పేరుతో హిందీలో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు. 

Updated Date - Apr 14 , 2024 | 03:40 PM