Varalakshmi Sarathkumar: అడుగు పెట్టడమే సులభం.. ఆ తర్వాత అంతా కష్టమే!

ABN , Publish Date - Apr 14 , 2024 | 05:19 PM

"స్టార్‌కిడ్స్‌కి  సినిమా  ఇండస్ట్రీలో ఎంట్రీ మాత్రమే సులభం. ఆ తర్వాత నిలబడటానికి ఎంతో కష్టపడాలి. అది ఎవరికి వారే నిరూపించుకోవాలి. చాలా మంది స్టార్‌కిడ్స్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంటుందనుకుంటారు

Varalakshmi Sarathkumar: అడుగు పెట్టడమే సులభం.. ఆ తర్వాత అంతా కష్టమే!
Varalakshmi Sarathkumar

"స్టార్‌కిడ్స్‌కి  సినిమా  ఇండస్ట్రీలో ఎంట్రీ మాత్రమే సులభం. ఆ తర్వాత నిలబడటానికి ఎంతో కష్టపడాలి. అది ఎవరికి వారే నిరూపించుకోవాలి. చాలా మంది స్టార్‌కిడ్స్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంటుందనుకుంటారు. కానీ అలా ఉండదు. ప్రేక్షకులకు నచ్చకపోతే కెరీర్‌ పోతుంది’’ అని వరలక్ష్మీ శరతకుమార్‌ (varalakshmi Sarathkumar) అన్నారు. తాజాగా 'నవ్య'కు ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టార్‌కిడ్‌గా ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడింది.

"స్టార్‌కిడ్‌ (Starkids)అనే ప్రశ్న నన్ను ఎంతోకాలంగా వెంటాడుతోంది. స్ట్టార్‌ కిడ్సా లేదా సాధారణ నేపథ్యం నుంచి వచ్చినవారా అనే విషయాన్ని ప్రేక్షకులు చూడరు. వారికి సినిమా బావుండాలంతే! నా ఉద్దేశంలో టాలెంట్‌, అదృష్టం ఉండాలి. కొన్నిస్టార్లు ఎంత కష్టపడినా విజయం రాదు. నన్నే తీసుకోండి... నేను ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలమైంది. కానీ ‘క్రాక్‌’ సినిమా తర్వాతే నాకు సక్సెస్‌ వచ్చింది. అంత కాలం నేను సరైన పాత్ర కోసం వేచి చూశానంతే!  కష్టపడి పనిచేయాలి. మంచి ఫలితం కోసం వేచి చూడాలి. అంతకన్నా వేరే మార్గం లేదు. నటులకు చాలా ఒత్తిడి ఉంటుంది. దానిని బయటకు చెప్పలేం. ఎవరైనా నా దగ్గరకు వచ్చి సినిమాల్లోకి వస్తానంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొమ్మని చెబుతా! ఎందుకంటే ఇండస్ట్రీలో మనుగడ సాగించడం అంత సులభం కాదు. మనపై ఎవరో ఒకరు కామెంట్స్‌ చేస్తూ ఉంటారు. పాత్ర కోసం వేచి చూస్తూ ఉండాలి. సినిమాల పట్ల అమితమైన ప్రేమ, ఆత్మ నిబ్బరం ఎక్కువగా ఉన్న వ్యక్తులు మాత్రమే సినిమా రంగానికి రావాలి. ఒక్క ఛాన్స్ దొరకాలి. సినిమా విడుదల కావాలి. అది హిట్‌ కావాలి. అదే హీరోయిన్ లకు  ఇంకా కష్టం. సినిమా హిట్‌ కాకపోతే... హీరోయిన్‌ది ఐరెన్‌ లెగ్‌ అంటారు. ఛాన్స ఇవ్వద్దంటారు. కథ బావుండక సినిమా ఫ్లాప్‌ అయితే.. దానికి హీరోయిన్‌కు సంబంధం ఏంటి. హీరోయిన్లే అపజయం నిందను హీరోయిన్లు ఎందుకు మోయాలి? అన్నారు.



"వృత్తి, వ్యక్తిగత జీవితాల్లో నేను చాలా బ్యాలెన్స్డ్‌గా ఉంటా! ఎప్పుడూ ఆనందంగా ఉండటానికి ప్రయత్నిస్తాను.  అనవసరపు విషయాలను ఎక్కువగా పట్టించుకోను. చిన్నప్పటి నుంచి నేను ఇంతే! నాకు జీవితంలో అనేక కష్ట నష్టాలు వచ్చాయి. నాకు ఎన్ని కష్టనష్టాలొచ్చినా పాజిటివ్‌గానే ఉండేదాన్ని’’ అని చెప్పారు.



Updated Date - Apr 14 , 2024 | 05:19 PM