Tiger Nageswara Rao: టైగర్ ఇన్వెజన్.. దురదృష్టవశాత్తూ వాడొక క్రిమినల్ అయ్యాడు.. లేదంటేనా?

ABN , First Publish Date - 2023-08-17T22:13:33+05:30 IST

మాస్ మహారాజా రవితేజ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టైగర్ దండయాత్ర (టీజర్‌)ను మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉండటమే కాకుండా.. సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తోంది.

Tiger Nageswara Rao: టైగర్ ఇన్వెజన్.. దురదృష్టవశాత్తూ వాడొక క్రిమినల్ అయ్యాడు.. లేదంటేనా?
Ravi Teja in Tiger Tiger Nageswara Rao

మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao). వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టైగర్ దండయాత్ర (Tiger's Invasion) టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇంతకు ముందు ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ గ్లింప్స్ సినిమాపై మంచి క్రేజ్‌ని పెంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ది గ్లోరీ ఆఫ్ ఇండియాస్ బిగ్గెస్ట్ థీఫ్-టైగర్ నాగేశ్వరరావు టీజర్ విడుదలైంది. ఈ టీజర్ కూడా ఓ రేంజ్‌లో ఉంది. ఈ టీజర్ చూసిన వారంతా టాలీవుడ్ నుంచి మరో బ్రహ్మాండమైన సినిమా రాబోతుందనేలా మాట్లాడుకుంటున్నారు.


టీజర్ విషయానికి వస్తే.. హైదరాబాదు, ముంబై, ఢిల్లీ, దేశంలోని అనేక ప్రాంతాలలో దొంగతనాలు చేసిన స్టూవర్ట్‌పురం దొంగ టైగర్ నాగేశ్వరరావు మద్రాస్ సెంట్రల్ జైలు నుండి పరారీలో ఉన్నారనే వార్తా కథనంతో టీజర్ ప్రారంభమైంది. మునుపెన్నడూ ఇలాంటి ఘటన జరగకపోవడంతో పోలీసులు షాక్‌ అవుతారు. టైగర్‌ జోన్‌లో పనిచేసిన మురళీ శర్మ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా టైగర్ నాగేశ్వరరావులోని అరుదైన నైపుణ్యాలను వివరించిన తీరు.. సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తోంది. ‘‘నాగేశ్వరరావు పాలిటిక్స్‌లోకి వెళ్లుంటే వాడి తెలివితేటలతో ఎలక్షన్ గెలిచేవాడు. స్పోర్ట్స్‌లోకి వెళ్లుంటే వాడి పరుగుతో ఇండియాకి మెడల్ గెలిచేవాడు. ఆర్మీలోకి వెళ్లుంటే వాడి ధైర్యంతో ఒక యుద్ధమే గెలిచేవాడు. దురదృష్టవశాత్తు, వాడొక క్రిమినల్ అయ్యాడు’’ అని మురళీ శర్మ టైగర్ నాగేశ్వరరావు సామర్థ్యాలను తెలుపుతుంటే.. సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో అర్థమవుతోంది. టైగర్ నాగేశ్వరరావు చిన్నతనంలోనే నేరాలు చేయడం ప్రారంభించడంతో చిన్నప్పటి నుంచి వైల్డ్ స్వభావం కలిగి ఉంటాడు. అతన్ని పట్టుకోవడానికి పోలీసులు, ఆర్మీ బెటాలియన్‌ను మోహరించారు, అలాంటి భయం అతను ప్రజలు, ప్రభుత్వంలో కలిగించాడు. టీజర్ చివరి వరకు అతని ముఖాన్నిచూపించకపోయినా, టీజర్ అంతా అతని ప్రజన్స్ అనుభూతి చెందేలా టీజర్‌ని కట్ చేశారు. ఇక టైగర్ ఎంట్రీ ఇచ్చిన రైలు ఎపిసోడ్ నాగేశ్వరరావు ధైర్యాన్ని చూపిస్తుంది. (Tiger Nageswara Rao Teaser Talk)

Tiger.jpg

ఆ సీన్‌లో రవితేజ (Ravi Teja)ను చూసిన తర్వాత టైటిల్ రోల్‌లో మరే ఇతర స్టార్‌ను ఊహించుకోలేమంటే.. అతను ట్రాన్స్ ఫార్మేషన్ చెందడం నుంచి, పాత్రను పోషించడం వరకు రవితేజ ఎక్స్ టార్డినరీ అనే చెప్పుకోవాలి. తన వైల్డ్ పెర్ఫార్మెన్స్‌తో కట్టిపడేశారు. దర్శకుడు వంశీ ఓ పవర్ ‌ఫుల్ సినిమాని, తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమాని ఇస్తున్నట్లుగా అయితే అర్థమవుతోంది. అలాగే జివి ప్రకాష్ కుమార్ తన అద్భుతమైన స్కోర్‌తో ప్రతి సీక్వెన్స్‌ను ఎలివేట్ చేశాడు. మొత్తానికి ఈ టైగర్ దండయాత్రతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా చేశారు. రవితేజ సరసన నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల కానుంది. (Tiger Nageswara Rao Teaser)


ఇవి కూడా చదవండి:

***************************************

*Anil Sunkara: మెగాస్టార్‌తో వివాదంపై క్లారిటీ.. నా శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు

****************************************

*Sunny Deol: ఈ స్థాయి సక్సెస్‌ని అస్సలు ఊహించలేదు..

****************************************

*Gangs of Godavari: ‘సుట్టంలా సూసి’.. పబ్లిగ్గా రచ్చ రచ్చ చేసిన విశ్వక్, నేహా శెట్టి


***************************************

*Matka: మెగా ప్రిన్స్ కోసం నోరా ఫతేహి దిగేసింది..

***************************************

*King Nagarjuna: బర్త్‌డే రోజు ఫ్యాన్స్‌కి కింగ్ నాగార్జున ఇవ్వబోతున్న ట్రీట్ ఇదే..

***************************************

*Kushi: యెదకి ఒక గాయం.. ఫోర్త్ సింగిల్ టైమ్ ఆగయా..

***************************************

*Bedurulanka 2012 Trailer: శివ శంకర వరప్రసాద్‌కి రామ్ చరణ్ సాయం

***************************************

Updated Date - 2023-08-17T22:16:25+05:30 IST