Gangs of Godavari: ‘సుట్టంలా సూసి’.. పబ్లిగ్గా రచ్చ రచ్చ చేసిన విశ్వక్, నేహా శెట్టి

ABN , First Publish Date - 2023-08-16T22:11:28+05:30 IST

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై గోదావరి డెల్టా నేపథ్యంలో పీరియడ్-గ్యాంగ్‌స్టర్-డ్రామా‌గా రూపొందుతోన్న చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. మాస్ కా దాస్ విశ్వక్ సేన్, నేహా శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలోని ఫస్ట్ లిరికల్ ‘సుట్టంలా సూసి’ సాంగ్‌ను మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు.

Gangs of Godavari: ‘సుట్టంలా సూసి’.. పబ్లిగ్గా రచ్చ రచ్చ చేసిన విశ్వక్, నేహా శెట్టి
Gangs of Godavari Still

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై గోదావరి డెల్టా నేపథ్యంలో పీరియడ్-గ్యాంగ్‌స్టర్-డ్రామా‌గా రూపొందుతోన్న చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs of Godavari). మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) మునుపెన్నడూ చూడని గ్రే పాత్రలో కనిపించనున్నారు. ఆయన పాత్ర క్రూరమైన, నేరపూరితమైన చీకటి సామ్రాజ్యంలో సామాన్యుడి నుంచి సంపన్నుడిగా ఎదగాలని కోరుకునే వ్యక్తి కథగా ఈ చిత్రం రూపొందుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మించిన ‘డీజే టిల్లు’ చిత్రంతో ‘రాధిక’గా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న నేహాశెట్టి (Neha Shetty) ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. తెలుగు నటి అంజలి కీలక పాత్ర పోషిస్తున్నారు. రచయిత-దర్శకుడు కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం నుంచి తాజాగా ‘సుట్టంలా సూసి’ అనే లిరికల్ సాంగ్‌ని (Suttamla Soosi Lyrical Video) హైదరాబాద్ మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు.


Vishwak-and-Neha.jpg

ఈ కార్యక్రమంలో విశ్వక్ సేన్, నేహా శెట్టి కలిసి స్టేజ్‌పై చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలు ఇద్దరూ రచ్చ రచ్చ చేశారంటూ నెటిజన్లు మాట్లాడుతుండటం విశేషం. ఇద్దరి మధ్య రొమాంటిక్ సాంగ్‌గా ఈ పాట చిత్రీకరణ జరుపుకుంది. డ్యాన్స్, క్యాస్ట్యూమ్స్ అన్నీ ఈ పాటకు హైలెట్ అనేలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైవిధ్య భరిత చిత్రాలతో తమ అభిరుచిని చాటుకుంటున్న నిర్మాతలు సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కోలీవుడ్ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja) ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. విద్యార్థుల కోలాహలం నడుమ జరిగిన ఈ మ్యాజికల్ మెలోడీ ఆవిష్కరణలో యువన్ శంకర్ రాజా, విశ్వక్ సేన్, గాయకుడు అనురాగ్ కులకర్ణి, నేహా శెట్టి విద్యార్థులతో ముచ్చటించి వారిలో మరింత ఉత్సాహం నింపారు. (Suttamla Soosi Song Launch)

Neha-Sshetty.jpg

ఈ సందర్భంగా హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. మల్లారెడ్డి కాలేజ్ నాకు సెంటిమెంట్. ఫలక్‌నుమా దాస్‌ మూవీ ఈవెంట్ కూడా అప్పుడు ఇక్కడే జరిగింది. నేను యువన్ గారి సంగీతానికి పెద్ద అభిమానిని. ఆయన స్వరపరిచిన ఎన్నో పాటలు ఏళ్ల తరబడి వింటూనే ఉంటాం. యువన్ గారితో కలిసి పని చేయాలని కోరుకునే వాడిని. ఇప్పుడు ఆ కల నిజం కావడం సంతోషంగా ఉంది. నాగ వంశీ అన్న నిర్మాణంలో సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాం. మధ్యలో ఒకట్రెండు కథలు కూడా అనుకున్నాం. అయితే ఒకసారి నేను వంశీ అన్నకి కాల్ చేసి.. నేను ఇంతవరకు లుంగీ కట్టలేదు.. ఒకసారి ఊరమాస్ సినిమా చేయాలనుంది.. నేను ఫస్ట్ లుంగీ కడితే నీ ప్రొడక్షన్‌లోనే కడతా అని చెప్పా. ఈ పాట సాప్ట్‌గా ఉంటుంది. కానీ సినిమా మాత్రం మాస్‌గా ఉంటుంది. థియేటర్లలో ఒక్కొక్కరికి శివాలెత్తి పోతుందని చెప్పుకొచ్చారు.


ఇవి కూడా చదవండి:

***************************************

*Matka: మెగా ప్రిన్స్ కోసం నోరా ఫతేహి దిగేసింది..

***************************************

*King Nagarjuna: బర్త్‌డే రోజు ఫ్యాన్స్‌కి కింగ్ నాగార్జున ఇవ్వబోతున్న ట్రీట్ ఇదే..

***************************************

*Kushi: యెదకి ఒక గాయం.. ఫోర్త్ సింగిల్ టైమ్ ఆగయా..

***************************************

*Bedurulanka 2012 Trailer: శివ శంకర వరప్రసాద్‌కి రామ్ చరణ్ సాయం

***************************************

*Shiva Nirvana: నేను ఎవరికీ అభిమానిని కాదు.. కానీ ఆమెకు అభిమానిని అని చెప్పుకుంటా..

***************************************

Updated Date - 2023-08-16T22:11:28+05:30 IST