Anil Sunkara: మెగాస్టార్‌తో వివాదంపై క్లారిటీ.. నా శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు

ABN , First Publish Date - 2023-08-17T19:34:48+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ కాంబినేషన్‌లో రూపొందిన ‘భోళా శంకర్’ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. దీంతో కొందరు సోషల్ మీడియా వేదికగా.. చిరంజీవికి, నిర్మాతకి రెమ్యూనరేషన్ విషయంలో వివాదం నడుస్తున్నట్లుగా వార్తలు రాసుకొచ్చారు. తాజాగా ఈ వార్తలపై అనిల్ సుంకర క్లారిటీ ఇస్తూ.. అదంతా అవాస్తవం అని తేల్చేశారు.

Anil Sunkara: మెగాస్టార్‌తో వివాదంపై క్లారిటీ.. నా శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు
Anil Sunkara and Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi), మెహర్ రమేష్ (Meher Ramesh) కాంబినేషన్‌లో రూపొందిన ‘భోళా శంకర్’ (Bholaa Shankar) చిత్రాన్ని అనిల్ సుంకర (Anil Sunkar) నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. ఈ సినిమా విడుదలైన మొదటి ఆట నుంచే నెగిటివ్ టాక్‌ని రాబట్టుకుని.. బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయం దిశగా పయనిస్తోంది. ఈ నేపథ్యంలో.. కొందరు సినిమా పోయినా.. చిరంజీవి తన రెమ్యూనరేషన్ మొత్తం ఇవ్వాల్సిందేనని నిర్మాతతో గొడవకి దిగినట్లుగా వార్తలు పుట్టించారు. కొన్ని రోజులుగా ఈ వార్తలు నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి. దీన్ని చూపిస్తూ.. కొందరు మెగాస్టార్‌‌పై ఇష్టం వచ్చినట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తలను తాజాగా నిర్మాత అనిల్ సుంకర ట్విట్టర్ వేదికగా ఖండించారు. మెగాస్టార్‌తో వివాదం అంటూ కొందరు పుట్టిస్తున్న వార్తలన్నీ అవాస్తవం అని, మొదటి నుంచి ఆయన ఎంతో సపోర్టివ్‌గా ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు.


‘‘కొంతమంది వ్యక్తులు రూమర్స్‌తో రాక్షసానందం పొందవచ్చు. కానీ ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి నిర్మించుకున్న ప్రతిష్టను దెబ్బతీయడం అనేది మాత్రం క్షమించరాని నేరం. ఇలాంటి రూమర్స్‌ ఆ ఫ్యామిలీలోని మెంబర్స్‌ని ఎంతో ఆందోళనకు గురిచేస్తాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో నాకు, చిరంజీవిగారికి మధ్య వివాదం అంటూ ప్రచారం అవుతున్న వార్త పూర్తిగా అవాస్తవం. చిరంజీవిగారు మొదటి నుంచి నాకు మద్దతుగా ఉన్నారు. ఇప్పటికీ మా మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. దయచేసి వాస్తవాలను తెలుసుకోకుండా కావాలని విషం చిమ్మకండి. ఫేక్ న్యూస్‌తో ఆనందం పొందడం కొంతమందికి సరదాగా ఉందేమో కానీ.. ఆ మ్యాటర్‌లో ఉన్న వారికి చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకుని.. నా క్షేమాన్ని కోరిన పరిశ్రమలోని నా శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ఆశీస్సులతో మళ్లీ బలంగా తిరిగి వస్తాను...’’ అని అనిల్ సుంకర తన ట్వీట్‌లో పేర్కొన్నారు. (Producer Anil Sunkara on malicious rumours about Chiranjeevi)


Megastar.jpg

అనిల్ సుంకర చేసిన ఈ ట్వీట్‌తో.. అందరికీ క్లారిటీ ఇచ్చినట్లయింది. మెగాస్టార్ చిరంజీవి విషయంలో కావాలని, పనిగట్టుకుని మరీ వాలిపోయే వారి చెంప చెల్లుమనిపించినట్లయింది. ఇదే నిర్మాత ఇంతకు ముందు హిట్స్ ఇచ్చారు, ఫ్లాప్స్‌ కూడా ఇచ్చారు. కానీ ఎప్పుడూ స్ట్రాంగ్‌గానే నిలబడి సినిమాలు తీస్తున్నారు. మరి సడెన్‌గా అలా వార్తలు పుట్టించాలని ఎలా అనిపించిందో మరి. నిజంగా అనిల్ సుంకర చెబుతున్నట్లుగా.. ఫేక్ వార్తలు పుట్టించి రాక్షసానందం పొందడమే వారి పనేమో.. అనేలా నెటిజన్లు కొందరు అనిల్ సుంకర ట్వీట్‌కు కామెంట్స్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

***************************************

*Sunny Deol: ఈ స్థాయి సక్సెస్‌ని అస్సలు ఊహించలేదు..

****************************************

*Gangs of Godavari: ‘సుట్టంలా సూసి’.. పబ్లిగ్గా రచ్చ రచ్చ చేసిన విశ్వక్, నేహా శెట్టి


***************************************

*Matka: మెగా ప్రిన్స్ కోసం నోరా ఫతేహి దిగేసింది..

***************************************

*King Nagarjuna: బర్త్‌డే రోజు ఫ్యాన్స్‌కి కింగ్ నాగార్జున ఇవ్వబోతున్న ట్రీట్ ఇదే..

***************************************

*Kushi: యెదకి ఒక గాయం.. ఫోర్త్ సింగిల్ టైమ్ ఆగయా..

***************************************

*Bedurulanka 2012 Trailer: శివ శంకర వరప్రసాద్‌కి రామ్ చరణ్ సాయం

***************************************

Updated Date - 2023-08-17T19:36:35+05:30 IST