Sunny Deol: ఈ స్థాయి సక్సెస్‌ని అస్సలు ఊహించలేదు..

ABN , First Publish Date - 2023-08-17T18:06:20+05:30 IST

ఇరవై రెండేళ్ల క్రితం వచ్చిన గదర్ చిత్రంతో సెన్సేషనల్ హిట్ అందుకున్నారు సన్నీడియోల్. ఇప్పుడా చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ‘గదర్2’తోనూ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. అనిల్ శర్మ దర్శకత్వంలో ఆగస్ట్ 11న విడుదలైన ‘గదర్2’ చిత్రం.. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సందర్భంగా ఇందులో తారా సింగ్‌గా నటించిన సన్నీ డియోల్.. టాలీవుడ్ మీడియాతో ముచ్చటిస్తూ.. ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పారు.

Sunny Deol: ఈ స్థాయి సక్సెస్‌ని అస్సలు ఊహించలేదు..
Sunny Deol

ఇరవై రెండేళ్ల క్రితం వచ్చిన గదర్ (Gadar) చిత్రంతో సెన్సేషనల్ హిట్ అందుకున్నారు సన్నీడియోల్ (Sunny Deol). ఇప్పుడా చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ‘గదర్2’ (Gadar 2) తోనూ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. అనిల్ శర్మ దర్శకత్వంలో ఆగస్ట్ 11న విడుదలైన ‘గదర్2’ చిత్రం.. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా విడుదలైన ఐదు రోజుల్లోనే రూ. 229 కోట్ల కలెక్షన్స్‌‌ను రాబట్టి బాలీవుడ్‌కి ఊపిరిపోసింది. ఈ స్థాయి రికార్డ్ కలెక్షన్స్ ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌లో రాలేదనే చెప్పుకోవాలి. షారుఖ్ ‘పఠాన్’ (Pathaan) చిత్రాన్ని మించేలా ఈ సినిమా కలెక్షన్స్‌ను రాబడుతుండటం విశేషం.


Gadar-.3.jpg

ఇంకా చెప్పాలంటే గత పదేళ్ల కాలంలో బాలీవుడ్‌కి లేని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా ఈ చిత్రం నిలుస్తుందని అక్కడి విమర్శకులు చెప్పుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో మరోసారి తారా సింగ్‌ పాత్రలో కనిపించి ప్రేక్షకులను మరింతగా ఆకర్షించారు సీనియర్ నటుడు సన్నీడియోల్. సన్నీడియోల్ ఈ మూవీ ప్రమోషన్స్ నిమిత్తం బుధవారం హైదరాబాద్‌లో సందడి చేశారు. ఏఎంబి సినిమాస్‌లో జరిగిన ఈవెంట్లో టాలీవుడ్ మీడియా (Tollywood Media)తో ఆయన ఇంట్రాక్ట్ అయ్యారు. (Sunny Deol Happy with Gadar 2 Success)


Gadar-1.jpg

ఈ కార్యక్రమంలో సన్నీడియోల్ (Sunny Deol) మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులు తనపై చూపిస్తున్న అభిమానానికి.. ఈ చిత్రాన్ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఇంకా ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఆయన థ్యాంక్స్ చెప్పారు. ఈ స్థాయి విజయాన్ని ఊహించలేదని, ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా సరిపోవని, ఈ విజయంతో మా టీమ్‌ అంతా చాలా హ్యాపీగా ఉన్నామని సన్నీడియోల్ చెప్పుకొచ్చారు. ఈ చిత్రంలో అమీషా పటేల్ (Ameesha Patel) హీరోయిన్‌గా నటించగా.. ఉత్కర్ష్ శర్మ, సిమ్రత్ కౌర్, మనీష్ వాధ్వా, అర్జున్ ద్వివేది కీలక పాత్రలు పోషించారు. జీ స్టూడియోస్ సమర్పణలో అనిల్ శర్మ (Anil Sharma), కమల్ ముకుత్ (Kamal Mukuth) ఈ చిత్రాన్ని నిర్మించారు.

Gadar-2.jpg


ఇవి కూడా చదవండి:

***************************************

*Gangs of Godavari: ‘సుట్టంలా సూసి’.. పబ్లిగ్గా రచ్చ రచ్చ చేసిన విశ్వక్, నేహా శెట్టి


***************************************

*Matka: మెగా ప్రిన్స్ కోసం నోరా ఫతేహి దిగేసింది..

***************************************

*King Nagarjuna: బర్త్‌డే రోజు ఫ్యాన్స్‌కి కింగ్ నాగార్జున ఇవ్వబోతున్న ట్రీట్ ఇదే..

***************************************

*Kushi: యెదకి ఒక గాయం.. ఫోర్త్ సింగిల్ టైమ్ ఆగయా..

***************************************

*Bedurulanka 2012 Trailer: శివ శంకర వరప్రసాద్‌కి రామ్ చరణ్ సాయం

***************************************

*Shiva Nirvana: నేను ఎవరికీ అభిమానిని కాదు.. కానీ ఆమెకు అభిమానిని అని చెప్పుకుంటా..

***************************************

Updated Date - 2023-08-17T18:06:20+05:30 IST