Matka: మెగా ప్రిన్స్ కోసం నోరా ఫతేహి దిగేసింది..

ABN , First Publish Date - 2023-08-16T21:38:01+05:30 IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తొలి పాన్ ఇండియా మూవీ ‘మట్కా’. ‘పలాస 1978’ (Palasa 1978) దర్శకుడు కరుణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్, డ్యాన్సర్ నోరా ఫతేహి ఒక హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇంకా ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానప్పటికీ.. నోరా ఫతేహి హైదరాబాద్ చేరుకుని.. వర్క్ షాప్‌లో పాల్గొంటోంది.

Matka: మెగా ప్రిన్స్ కోసం నోరా ఫతేహి దిగేసింది..
Nora Fatehi with Director Karuna Kumar

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej) తొలి పాన్ ఇండియా మూవీ ‘మట్కా’ (Matka). ‘పలాస 1978’ (Palasa 1978) దర్శకుడు కరుణ కుమార్‌ (Karuna Kumar) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్, డ్యాన్సర్ నోరా ఫతేహి (Nora Fatehi) ఒక హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ స్థాయిలో నిర్మించనున్న ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుక ఇటీవలే పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి వర్క్ షాప్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.


మొదట్లో నోరాకి లుక్ టెస్ట్ చేశారు. తర్వాత పాత్ర ప్రిపరేషన్ కోసం వర్క్‌షాప్‌లో ఆమె పాల్గొంది. సబ్జెక్ట్‌ని ఇష్టపడి, తన పాత్రను పోషించడానికి సిద్ధంగా ఉన్న నోరా, మేకింగ్ దశలో తప్పులు జరగకూడదని అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆమె అంకితభావనికి యూనిట్ సైతం సర్‌ప్రైజ్ అవుతోంది. నోరా ఫతేహికి డ్యాన్స్ నంబర్ ఉంటుంది, ఆమె పాత్ర ఈ సినిమాకు చాలా కీలకమైనదని మేకర్స్ అంటున్నారు. అందుకే షూటింగ్ ఇంకా ప్రారంభం కానప్పటికీ, సినిమాలో ఛాలెంజింగ్ క్యారెక్టర్‌లో నటించడానికి ఆమె ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. 1958-1982 మధ్య కాలంలో జరిగే సినిమా కథలో వైజాగ్ అమ్మాయిగా నటించడం పెద్ద ఛాలెంజ్. నోరా ఫతేహి ప్రస్తుతం హైదరాబాద్‌లో వున్నారు. మూడు రోజుల పాటు ఆమె టీమ్‌తో వుంటారని తాజాగా మేకర్స్ ప్రకటించారు. (Matka Movie Update)

Nora.jpg

ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) మరో హీరోయిన్‌గా నటిస్తుండగా.. నవీన్ చంద్ర, కన్నడ కిషోర్ ఇతర పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం 60వ దశకంలో వైజాగ్‌ను తలపించే భారీ వింటేజ్ సెట్‌ను నిర్మించనున్నారు. 60వ దశకంలోని వాతావరణాన్ని, అనుభూతిని అందించడానికి చిత్ర బృందం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ చిత్రానికి ఆశిష్ తేజ ప్రొడక్షన్ డిజైనర్, సురేష్ ఆర్ట్ డైరెక్టర్. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

***************************************

*King Nagarjuna: బర్త్‌డే రోజు ఫ్యాన్స్‌కి కింగ్ నాగార్జున ఇవ్వబోతున్న ట్రీట్ ఇదే..

***************************************

*Kushi: యెదకి ఒక గాయం.. ఫోర్త్ సింగిల్ టైమ్ ఆగయా..

***************************************

*Bedurulanka 2012 Trailer: శివ శంకర వరప్రసాద్‌కి రామ్ చరణ్ సాయం

***************************************

*Shiva Nirvana: నేను ఎవరికీ అభిమానిని కాదు.. కానీ ఆమెకు అభిమానిని అని చెప్పుకుంటా..

***************************************

Updated Date - 2023-08-16T21:38:01+05:30 IST