King Nagarjuna: బర్త్‌డే రోజు ఫ్యాన్స్‌కి కింగ్ నాగార్జున ఇవ్వబోతున్న ట్రీట్ ఇదే..

ABN , First Publish Date - 2023-08-16T20:36:50+05:30 IST

కింగ్ అక్కినేని నాగార్జున తన బర్త్‌డే‌కి ఫ్యాన్స్‌కి మాంచి ట్రీట్ ఇవ్వబోతున్నారు. ఈ నెల 29న కింగ్ నాగార్జున పుట్టినరోజు. ఆ రోజున కింగ్ తన తదుపరి చిత్రాల అప్‌డేట్స్ ఇస్తారని ఫ్యాన్స్ ఎదురుచూస్తుంటే.. ఊహించని విధంగా ఇప్పుడు ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్ చేశారు. నాగార్జున ఎవర్‌గ్రీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన్మథుడు’ చిత్రాన్ని పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 29న రీ-రిలీజ్ చేయబోతున్నారు.

King Nagarjuna: బర్త్‌డే రోజు ఫ్యాన్స్‌కి కింగ్ నాగార్జున ఇవ్వబోతున్న ట్రీట్ ఇదే..
King Nagarjuna

కింగ్ అక్కినేని నాగార్జున (King Akkineni Nagarjuna) తన బర్త్‌డే‌కి ఫ్యాన్స్‌కి మాంచి ట్రీట్ ఇవ్వబోతున్నారు. ఈ నెల 29న కింగ్ నాగార్జున పుట్టినరోజు. ఆ రోజున కింగ్ తన తదుపరి చిత్రాల అప్‌డేట్స్ ఇస్తారని ఫ్యాన్స్ ఎదురుచూస్తుంటే.. ఊహించని విధంగా ఇప్పుడు ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్ చేశారు. నాగార్జున బర్త్‌డేకి కేవలం అభిమానులకే కాదు.. సినీ ప్రియులకు కూడా ఆయన సర్‌ప్రైజ్ సిద్ధం చేశారు. అదేంటంటే, నాగార్జున ఎవర్‌గ్రీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన్మథుడు’ (Manmadhudu) చిత్రాన్ని పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 29న రీ-రిలీజ్ చేయబోతున్నారు. (Manmadhudu Re Release)


‘మన్మథుడు’ సినిమా ఇప్పటికీ టీవీలలో వస్తుంటే.. ప్రేక్షకుల అలా అతుక్కుపోతారు. అలాంటి చిత్రమది. అలాంటి చిత్రాన్ని రీ రిలీజ్ అంటే.. నిజంగా ప్రేక్షకులకు మంచి ట్రీట్ అనే చెప్పుకోవాలి. ఈ సినిమాలో నాగార్జున ఒక యాడ్ ఏజెన్సీ CEO అభి పాత్రను పోషించారు. కొన్ని కారణాల వలన అమ్మాయిలను ఇష్టపడని పాత్రలో అలరించారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కథ, మాటలు అందించగా.. కె విజయ భాస్కర్ (K Vijaya Bhaskar) స్క్రీన్‌ప్లే రాసి దర్శకత్వం వహించారు.

King-Nagarjuna.jpg

‘మన్మథుడు’ ఆహ్లాదకరమైన వినోదం, అందమైన ప్రేమ కథ, హృదయాన్ని హత్తుకునే కుటుంబ భావోద్వేగాలతో బాక్సాఫీస్ వద్ద అప్పట్లోనే అద్భుతాలను క్రియేట్ చేసింది. ఇది ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా రీ-రిలీజ్‌లో కూడా భారీ వసూళ్లను రాబట్టడం ఖాయమని నిర్మాణ సంస్థ అయిన నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios) సంస్థ భావిస్తోంది. ఈ చిత్రంలో నాగ్ సరసన సోనాలి బింద్రే కథానాయికగా నటించగా, అన్షు మరో కథానాయికగా నటించింది. బ్రహ్మానందం, సునీల్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం వంటి హాస్య నటులు పండించిన కామెడీతో పాటు.. దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీత ఈ సినిమా విజయంలో కీలకపాత్ర పోషించింది.


ఇవి కూడా చదవండి:

***************************************

*Kushi: యెదకి ఒక గాయం.. ఫోర్త్ సింగిల్ టైమ్ ఆగయా..

***************************************

*Bedurulanka 2012 Trailer: శివ శంకర వరప్రసాద్‌కి రామ్ చరణ్ సాయం

***************************************

*Shiva Nirvana: నేను ఎవరికీ అభిమానిని కాదు.. కానీ ఆమెకు అభిమానిని అని చెప్పుకుంటా..

***************************************

*Klin Kaara Konidela: ఫస్ట్ ఇండిపెండెన్స్‌ డే.. జెండా ఆవిష్కరించిన క్లీంకార

***************************************

Updated Date - 2023-08-16T20:36:50+05:30 IST