Lal Salaam: క్రికెట్ లెజెండ్‌తో యాక్టింగ్ లెజెండ్.. పిక్ బహుత్ అచ్చా హై!

ABN , First Publish Date - 2023-05-19T11:02:11+05:30 IST

రీసెంట్‌గా ముంబై డాన్‌ మొయిద్దీన్ భాయ్‌ (Moideen Bhai)గా న‌టిస్తోన్న త‌లైవ‌ర్ లుక్‌ను చిత్ర యూనిట్ రివీల్ చేయ‌గా ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమాపై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను త‌న ట్వీట్‌తో నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లిపోయారు ర‌జనీకాంత్‌. ఆయన ట్వీట్‌లో

Lal Salaam: క్రికెట్ లెజెండ్‌తో యాక్టింగ్ లెజెండ్.. పిక్ బహుత్ అచ్చా హై!
Kapil Dev and Rajinikanth

లైకా ప్రొడక్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న క్రేజీ ప్రాజెక్ట్ ‘లాల్ సలాం’ (Lal Salaam). విష్ణు విశాల్‌ (Vishnu Vishal), విక్రాంత్ (Vikranth) హీరోలుగా న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని ఐశ్వ‌ర్య ర‌జనీకాంత్ (Aishwarya Rajinikanth) డైరెక్ట్ చేస్తుండగా.. సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ (Superstar Rajinikanth) ఇందులో ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా ముంబై డాన్‌ మొయిద్దీన్ భాయ్‌ (Moideen Bhai)గా న‌టిస్తోన్న త‌లైవ‌ర్ లుక్‌ను చిత్ర యూనిట్ రివీల్ చేయ‌గా ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమాపై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను త‌న ట్వీట్‌తో నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లిపోయారు ర‌జనీకాంత్‌.

తాజాగా ఆయ‌న త‌న ట్విట్ట‌ర్‌లో లెజెండ్రీ క్రికెట‌ర్‌, 1983లో తొలిసారి ఇండియాకు క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్‌ను సాధించిన పెట్టిన నాటి కెప్టెన్ క‌పిల్ దేవ్‌ (Kapil Dev)తో క‌లిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. ‘‘లెజెండ్రీ ప‌ర్స‌న్‌, మ‌నం అంద‌రం ఎంతో గౌర‌వించాల్సిన గొప్ప మ‌నిషి క‌పిల్ దేవ్‌జీతో క‌లిసి ప‌ని చేయ‌టాన్ని గౌర‌వంగా భావిస్తున్నాను. క్రికెట్ వ‌రల్డ్‌క‌ప్‌ను సాధించి మ‌న భార‌త‌దేశం గ‌ర్వ‌ప‌డేలా చేశారాయ‌న‌’’ అంటూ కపిల్ దేవ్‌తో వ‌ర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను షేర్ చేసుకున్నారు ర‌జనీకాంత్‌. న‌ట‌న‌లో లెజెండ్రీ ప‌ర్స‌నాలిటీ క్రికెట్ లెజెండ్‌ను ప్ర‌శంసిస్తూ చేసిన స‌ద‌రు ట్వీట్ (Rajinikanth Tweet) హాట్ టాపిక్‌గా మార‌ట‌మే కాదు.. నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. మ‌రో వైపు క‌పిల్ దేవ్ సైతం ర‌జనీకాంత్‌తో ఉన్న ఫొటోను త‌న ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ ‘ర‌జనీకాంత్‌గారితో క‌లిసి ప‌ని చేయ‌టం గొప్ప గౌర‌వంగా భావిస్తున్నాను’ అని తెలిపారు.

Rajinikanth.jpg

భారీ బ‌డ్జెట్, విజువ‌ల్ వండ‌ర్స్ చిత్రాల‌తో చిత్ర నిర్మాణ రంగంలో త‌మ‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్న‌ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌ (Lyca Productions). రీసెంట్‌గా విడుద‌లైన పాన్ ఇండియా మూవీ ‘పొన్నియిన్ సెల్వన్ 2’ (Ponniyin Selvan 2)తో సూపర్ సక్సెస్‌ను సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ నిర్మాణ సంస్థ నుంచి రానున్న మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ ‘లాల్ సలాం’. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మరో వైపు కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో రూపొందుతోన్న ‘ఇండియన్ 2’ (Indian 2)... అరుణ్ విజయ్, ఎమీ జాక్సన్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ‘మిషన్ చాప్టర్ 1’ (Mission Chapter 1), కోలీవుడ్ అగ్ర కథానాయకుడు అజిత్‌తో చేస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘విడా ముయర్చి’ (Vidaamuyarchi) వంటి క్రేజీ ప్రాజెక్ట్స్‌ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది.

Rajini.jpg


ఇవి కూడా చదవండి:

************************************************

*Liger: ‘లైగర్’ ఎగ్జిబిటర్స్ దీక్ష విరమించారు.. ఎందుకో తెలుసా?

*Bro: ఫైనల్‌గా ‘PKSDT’ టైటిల్ ఇదే.. మోషన్ పోస్టర్ అదిరింది

*Mrunal Thakur: వామ్మో.. ఈమె అసలు ‘సీతా రామం’ సీతేనా? ఆ ప్రదర్శన ఏంటసలు?

*Virupaksha: ఆ గమ్యాన్ని చేరుకుంది

*PushpaTheRule: ‘షెకావత్’ అప్‌డేట్ వచ్చింది.. ఈసారి ప్రతీకారం మాములుగా ఉండదట

*Malli Pelli: పాటలోనూ పవిత్రని వదలని నరేష్

*Rakshana: మరో హీరోయిన్‌కు ‘ఆర్’ అక్షరం వచ్చేలా పేరు పెట్టిన దర్శక దిగ్గజం

*Pawan Kalyan OG: వద్దన్నా.. ‘ఓజీ’ అప్‌డేట్స్ వస్తూనే ఉన్నాయ్.. ఈసారి వచ్చిన అప్‌డేట్ ఏమిటంటే..

Updated Date - 2023-05-19T11:43:38+05:30 IST