Pawan Kalyan OG: వద్దన్నా.. ‘ఓజీ’ అప్‌డేట్స్ వస్తూనే ఉన్నాయ్.. ఈసారి వచ్చిన అప్‌డేట్ ఏమిటంటే..

ABN , First Publish Date - 2023-05-18T10:37:03+05:30 IST

‘ఓజీ’ (OG) సెట్స్‌లోకి పవన్ కల్యాణ్ అడుగుపెట్టినప్పటి నుంచి.. నిర్మాణ సంస్థ ఏదో ఒక అప్‌డేట్‌తో అభిమానుల్లో హుషారు నింపుతూనే ఉంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో అప్‌డేట్‌‌తో.. మేకర్స్ మళ్లీ ఈ సినిమా గురించి వార్తలు వైరల్ అయ్యేలా

Pawan Kalyan OG: వద్దన్నా.. ‘ఓజీ’ అప్‌డేట్స్ వస్తూనే ఉన్నాయ్.. ఈసారి వచ్చిన అప్‌డేట్ ఏమిటంటే..
Pawan Kalyan In OG

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Power Star Pawan Kalyan) హీరోగా.. యువ దర్శకుడు సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ డ్రామాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత (RRR Producer) డీవీవీ దానయ్య (DVV Danayya) నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాను ‘ఓజీ’ (OG) (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) అని పిలుస్తున్నారు. జనవరి 30న పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ‘ఓజీ’ (OG) సెట్స్‌లోకి పవన్ కల్యాణ్ అడుగుపెట్టినప్పటి నుంచి.. నిర్మాణ సంస్థ ఏదో ఒక అప్‌డేట్‌తో అభిమానుల్లో హుషారు నింపుతూనే ఉంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో అప్‌డేట్‌‌తో.. మేకర్స్ మళ్లీ ఈ సినిమా గురించి వార్తలు వైరల్ అయ్యేలా చేశారు. ఇప్పుడొచ్చిన అప్‌డేట్ ఏమిటంటే..

ఇప్పటి వరకు ముంబై (Mumbai)లో నిరవధికంగా జరిగిన షూట్‌లో యాక్షన్ సన్నివేశాలతో పాటు కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించిన యూనిట్.. ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ నిమిత్తం హైదరాబాద్ (Hyderabad) వచ్చేసింది. ఈ రోజు (గురువారం) నుంచి హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్‌కి సంబంధించిన షూటింగ్ ప్రారంభమైనట్లుగా మేకర్స్.. అధికారిక ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఈ అప్‌డేట్‌తో ‘ఓజీ’ మరోసారి ట్రెండ్ అవుతోంది. ఈ షెడ్యూల్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో పాటు ఇతర ముఖ్య నటీనటులు పాల్గొననున్నారని తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh)కు సంబంధించిన షూట్‌లో కూడా పవన్ కల్యాణ్ పాల్గొనున్నారనేలా టాక్ నడుస్తుంది. ఆ సినిమా షూటింగ్‌కు సంబంధించి కూడా త్వరలోనే అప్‌డేట్ రానుంది.

Power-Star.jpg

‘ఓజీ’ విషయానికి వస్తే.. భారీస్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్ (Ravi K Chandran) కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇంతకు ముందు పవన్ కల్యాణ్ నటించిన బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak)కి సంగీతం అందించిన ఎస్ థమన్ (S Thaman) ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. పవన్ కల్యాణ్ బలానికి, స్టార్‌డమ్‌కి సరిగ్గా సరిపోయే కథతో యాక్షన్ డ్రామాగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం.. అటు యాక్షన్ ప్రియులను, ఇటు పవన్ కల్యాణ్ అభిమానులను అలరిస్తుందని నిర్మాత డీవీవీ దానయ్య (Producer Danaiah) ఎంతో నమ్మకంగా ఉన్నారు.


ఇవి కూడా చదవండి:

************************************************

*NTR30: పవర్‌ఫుల్ అప్‌డేట్.. రక్తంతో ఆయన రాసిన కథలతో సముద్రం నిండిపోయింది..

*Annapurna Studios: ఎ ఎన్నార్‌ వర్చువల్‌ ప్రొడక్షన్‌ స్టేజ్‌.. సినిమా మేకింగ్ ఇక మరింత సులభతరం

*Karate Kalyani: ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌రణకు అభ్యంతరం.. కరాటే కళ్యాణికి షోకాజ్ నోటీసులు

*Vijay Antony: ‘పిచ్చైక్కారన్‌’.. నాకు ఆయన వేసిన భిక్ష

*Niharika Konidela: నన్ను నమ్మినందుకు థ్యాంక్స్

*PKSDT: టైటిల్, ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?

Updated Date - 2023-05-18T10:39:47+05:30 IST