Bro: ఫైనల్‌గా ‘PKSDT’ టైటిల్ ఇదే.. మోషన్ పోస్టర్ అదిరింది

ABN , First Publish Date - 2023-05-18T16:34:57+05:30 IST

‘PKSDT’ సినిమా టైటిల్ ఇదేనంటూ కొన్ని టైటిల్స్ బాగా వైరల్ అవుతున్న నేపథ్యంలో మేకర్స్ అధికారికంగా ఈ చిత్రానికి ‘బ్రో’ (#Bro) టైటిల్ ఫిక్స్ చేసి.. తాజాగా ఫస్ట్ లుక్‌లో పాటు మోషన్ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు. ఈ మోషన్ పోస్టర్‌లో

Bro: ఫైనల్‌గా ‘PKSDT’ టైటిల్ ఇదే.. మోషన్ పోస్టర్ అదిరింది
Bro Movie Poster

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Power Star Pawan Kalyan), సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) కాంబినేషన్‌లో ‘PKSDT’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న చిత్రానికి ‘బ్రో’ (Bro) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘PKSDT’ సినిమా టైటిల్ ఇదేనంటూ కొన్ని టైటిల్స్ బాగా వైరల్ అవుతున్న నేపథ్యంలో మేకర్స్ అధికారికంగా ఈ చిత్రానికి ‘బ్రో’ (#Bro) టైటిల్ ఫిక్స్ చేసి.. తాజాగా ఫస్ట్ లుక్‌లో పాటు మోషన్ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు. ఈ మోషన్ పోస్టర్‌లో వినిపిస్తున్న సాంగ్, పవన్ కల్యాణ్ కనిపించిన తీరు.. సినిమాపై అమాంతం అంచనాలను పెంచేస్తున్నాయి. (#BroTheAvatar)

ఈ పోస్టర్‌లో పరమశివుడిని, కాలాన్ని చూపిస్తూ.. ఓ శ్లోకాన్ని వినిపించారు. ఇంటెన్స్ అండ్ ఎలక్ట్రిఫైయింగ్ టైటిల్ అంటూ.. పవన్ కల్యాణ్‌ని పవర్ ఫుల్ ఫోజులో చూపించారు. దీంతో ఇప్పటి వరకు ‘OG’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే అనుకుంటున్న ఫ్యాన్స్‌కి ఒక్కసారిగా మేకర్స్ షాకిచ్చారు. వాటిని మించేలా ఈ సినిమా ఉండబోతుందనే ఇంపాక్ట్‌ని ఈ మోషన్ పోస్టర్‌తో కలిగించారు. ప్రస్తుతం ఈ మోషన్ పోస్టర్ సోషల్ మీడియాని, యూట్యూబ్‌ని షేక్ చేస్తోంది. కాగా.. ఇది తమిళంలో తెరకెక్కి ఘన విజయం సాధించిన ‘వినోదయ్య సిత్తం’ చిత్రానికి రీమేక్ అనే సంగతి తెలిసిందే. ఆ సినిమాని తెరకెక్కించిన టాలెంటెడ్ యాక్టర్, డైరెక్టర్ సముద్రఖని (Samuthirakani)నే ఈ చిత్రానికి (PKSDT) కూడా దర్శకుడు. తమిళ్‌లో దేవుడి పాత్రలో స్వయంగా సముద్రఖనినే నటించారు. ఈ రీమేక్‌లో మాత్రం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆ పాత్రను చేస్తున్నారు.

Bro-Movie.jpg

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి టాకీపార్ట్ మొత్తం పూర్తయినట్లుగా మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. ఓ పాట మాత్రమే బ్యాలెన్స్ ఉండగా.. దాని కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఓ భారీ సెట్‌ను రూపొందించినట్లుగా తెలుస్తోంది. ఈ పాట పబ్‌లో చిత్రీకరించాల్సి ఉండటంతో.. గ్రాండ్‌గా పబ్ సెట్‌ వేశారని.. త్వరలోనే పాటను చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory), జీ స్టూడియోస్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రం జూలై 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.


ఇవి కూడా చదవండి:

************************************************

*Mrunal Thakur: వామ్మో.. ఈమె అసలు ‘సీతా రామం’ సీతేనా? ఆ ప్రదర్శన ఏంటసలు?

*Virupaksha: ఆ గమ్యాన్ని చేరుకుంది

*PushpaTheRule: ‘షెకావత్’ అప్‌డేట్ వచ్చింది.. ఈసారి ప్రతీకారం మాములుగా ఉండదట

*Malli Pelli: పాటలోనూ పవిత్రని వదలని నరేష్

*Rakshana: మరో హీరోయిన్‌కు ‘ఆర్’ అక్షరం వచ్చేలా పేరు పెట్టిన దర్శక దిగ్గజం

*Pawan Kalyan OG: వద్దన్నా.. ‘ఓజీ’ అప్‌డేట్స్ వస్తూనే ఉన్నాయ్.. ఈసారి వచ్చిన అప్‌డేట్ ఏమిటంటే..

*NTR30: పవర్‌ఫుల్ అప్‌డేట్.. రక్తంతో ఆయన రాసిన కథలతో సముద్రం నిండిపోయింది..

Updated Date - 2023-05-18T16:42:16+05:30 IST