PushpaTheRule: ‘షెకావత్’ అప్‌డేట్ వచ్చింది.. ఈసారి ప్రతీకారం మాములుగా ఉండదట

ABN , First Publish Date - 2023-05-18T13:48:13+05:30 IST

‘హంట్ ఫర్ పుష్ప’తో అమాంతం అంచనాలను పెంచేసిన టీమ్.. ఇప్పుడు ‘పుష్ప 2’ షూటింగ్ అప్‌డేట్స్ వదులుతూ.. ఈ సినిమా నిత్యం వార్తలలో ఉండేలా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో ‘భన్వర్ సింగ్ షెకావత్’ (Bhanwar Singh Shekhawat) అనే పోలీస్ అధికారిగా చేసిన

PushpaTheRule: ‘షెకావత్’ అప్‌డేట్ వచ్చింది.. ఈసారి ప్రతీకారం మాములుగా ఉండదట
Pushpa 2 Shooting Spot

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) తెరకెక్కించిన చిత్రం ‘పుష్ప’ (Pushpa). ఈ సినిమా నెలకొల్పిన రికార్డుల గురించి.. కలెక్షన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘పుష్ప’ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులపై చూపించిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. పుష్ప రాజ్ అనే క్యారెక్టర్‌ను అద్భుతంగా డిజైన్ చేసి ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు దర్శకుడు సుకుమార్. ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్ (Sukumar Writings) సహకారంతో మైత్రీ మూవీస్ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి సీక్వెల్ ‘పుష్ప: ది రూల్’ (Pushpa: The Rule) శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. రీసెంట్‌గానే ‘హంట్ ఫర్ పుష్ప’ (Hunt For Pushpa) అంటూ.. 3 నిమిషాల 17 సెకన్ల నిడివి ఉన్న వీడియోని వదలగా.. అది వ్యూస్, లైక్స్ పరంగా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది.

‘హంట్ ఫర్ పుష్ప’తో అమాంతం అంచనాలను పెంచేసిన టీమ్.. ఇప్పుడు ‘పుష్ప 2’ షూటింగ్ అప్‌డేట్స్ వదులుతూ.. ఈ సినిమా నిత్యం వార్తలలో ఉండేలా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో ‘భన్వర్ సింగ్ షెకావత్’ (Bhanwar Singh Shekhawat) అనే పోలీస్ అధికారిగా చేసిన ఫహద్ ఫాసిల్‌ (Fahadh Faasil)కు సంబంధించిన అప్‌డేట్‌ను మేకర్స్ తెలియజేశారు. ‘‘పుష్ప2లో భన్వర్ సింగ్ షెకావత్‌గా చేస్తున్న ఫహద్ ఫాసిల్ సన్నివేశాలకు సంబంధించి ఓ కీలక షెడ్యూల్ ముగిసింది. ఈసారి అతని ప్రతీకారం మాములుగా ఉండదు’’ అని తెలుపుతూ లోకేషన్‌లో ఉన్న పిక్‌ని చిత్రయూనిట్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పిక్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

allu-Arjun.jpg

ప్రస్తుతం వచ్చిన ఈ అప్‌డేట్‌తో మరోసారి ‘పుష్ప’ (Pushpa) ట్యాగ్ సోషల్ మీడియాలో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా కోసం ఎంతగానో వేచి చూస్తున్నట్లుగా నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. మరీ ముఖ్యంగా ఇందులో ఎటువంటి మ్యానరిజమ్స్‌ని ఐకాన్ స్టార్ ప్రదర్శించబోతున్నాడో.. అనేలా టాక్ నడుస్తోంది. అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ధనుంజయ, రావు రమేష్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు ఇతర పాత్రలలో నటిస్తున్నారు. ఈ పార్ట్‌లో విలక్షణ నటుడు జగపతిబాబు (Jagapathi Babu) కూడా కీలక పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ విషయం జగ్గూభాయ్ కూడా ఇటీవల స్పష్టం చేశారు. (Pushpa 2 Update)

ఇవి కూడా చదవండి:

************************************************

*Malli Pelli: పాటలోనూ పవిత్రని వదలని నరేష్

*Rakshana: మరో హీరోయిన్‌కు ‘ఆర్’ అక్షరం వచ్చేలా పేరు పెట్టిన దర్శక దిగ్గజం

*Pawan Kalyan OG: వద్దన్నా.. ‘ఓజీ’ అప్‌డేట్స్ వస్తూనే ఉన్నాయ్.. ఈసారి వచ్చిన అప్‌డేట్ ఏమిటంటే..

*NTR30: పవర్‌ఫుల్ అప్‌డేట్.. రక్తంతో ఆయన రాసిన కథలతో సముద్రం నిండిపోయింది..

*Annapurna Studios: ఎ ఎన్నార్‌ వర్చువల్‌ ప్రొడక్షన్‌ స్టేజ్‌.. సినిమా మేకింగ్ ఇక మరింత సులభతరం

Updated Date - 2023-05-18T13:48:13+05:30 IST