Virupaksha: ఆ గమ్యాన్ని చేరుకుంది

ABN , First Publish Date - 2023-05-18T15:26:47+05:30 IST

తెలుగులో ఈ చిత్రానికి మొదటి రోజు మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ వచ్చేసింది. ఆ తర్వాత భారీగా కలెక్షన్లు రాబట్టి.. బ్లాక్‌బస్టర్ విజయాన్ని నమోదు చేసింది. ఇక ఈ చిత్రం అనుకున్న గమ్యాన్ని చేరుకుంది. ఏమిటా గమ్యం అనుకుంటున్నారా?

Virupaksha: ఆ గమ్యాన్ని చేరుకుంది
Sai Dharam Tej in Virupaksha

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) హీరోగా నటించిన పాన్ ఇండియా మిస్టీక్ థ్రిల్లర్ చిత్రం ‘విరూపాక్ష’ (Virupaksha). సంయుక్తా మీనన్ (Samyuktha Menon) హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం కార్తీక్ దండు (Karthik Dandu) దర్శకత్వంలో.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బాపినీడు బి.సమర్పణలో నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగులో ఏప్రిల్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ఆ తర్వాత కాస్త గ్యాప్‌తో తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో విడుదలైంది. తెలుగులో ఈ చిత్రానికి మొదటి రోజు మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ వచ్చేసింది. ఆ తర్వాత భారీగా కలెక్షన్లు రాబట్టి.. బ్లాక్‌బస్టర్ విజయాన్ని నమోదు చేసింది. ఇక ఈ చిత్రం అనుకున్న గమ్యాన్ని చేరుకుంది. ఏమిటా గమ్యం అనుకుంటున్నారా?

100 కోట్ల క్లబ్ (100 cr Club).. అవును ఈ చిత్రం రూ. 100 కోట్లు క్లబ్‌లో చేరినట్లుగా మేకర్స్ అధికారికంగా తెలియజేస్తూ.. తాజాగా ఓ పోస్టర్‌ను సైతం విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో సాయిధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ సీరియస్ లుక్‌లో ఉండగా.. వారి వెనుక 100 కోట్లు అని రాసి ఉంది. అలాగే స్పైన్ చిల్లింగ్ బ్లాక్‌బస్టర్ అంటూ.. ‘విరూపాక్ష’ ఎటువంటి విజయం అందుకుందో మేకర్స్ తెలియజేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హీరో సాయిధరమ్ తేజ్ రీ ఎంట్రీ ఫిల్మ్ ఇది. రీ ఎంట్రీలో చేసిన మొదటి చిత్రమే 100 కోట్ల క్లబ్‌లో చేరడంతో.. ఆయనతో పాటు మెగా ఫ్యాన్స్ (Mega Fans) అంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Virupaksha.jpg

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. 1990లో జరిగే ఈ కథలో, ఓ ప్రాంతంలో ప్రజలు విచిత్రమైన సమస్యతో బాధపడుతుంటారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం చూపడానికి హీరో సాయిధరమ్‌ తేజ్ ఏం చేశాడనేదే ఈ సినిమా మెయిన్ కథ. ఇక థియేటర్స్‌లో అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ చిత్రం మే 21 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. మే 21 నుంచి ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్‌కి సిద్ధమవుతోంది. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ (Sukumar) ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందించారు.

ఇవి కూడా చదవండి:

************************************************

*PushpaTheRule: ‘షెకావత్’ అప్‌డేట్ వచ్చింది.. ఈసారి ప్రతీకారం మాములుగా ఉండదట

*Malli Pelli: పాటలోనూ పవిత్రని వదలని నరేష్

*Rakshana: మరో హీరోయిన్‌కు ‘ఆర్’ అక్షరం వచ్చేలా పేరు పెట్టిన దర్శక దిగ్గజం

*Pawan Kalyan OG: వద్దన్నా.. ‘ఓజీ’ అప్‌డేట్స్ వస్తూనే ఉన్నాయ్.. ఈసారి వచ్చిన అప్‌డేట్ ఏమిటంటే..

*NTR30: పవర్‌ఫుల్ అప్‌డేట్.. రక్తంతో ఆయన రాసిన కథలతో సముద్రం నిండిపోయింది..

Updated Date - 2023-05-18T17:22:13+05:30 IST