Rakshana: మరో హీరోయిన్‌కు ‘ఆర్’ అక్షరం వచ్చేలా పేరు పెట్టిన దర్శక దిగ్గజం

ABN , First Publish Date - 2023-05-18T11:29:06+05:30 IST

‘ఆర్’ (R) అనే అక్షరంతో ఆయన పేరు పెట్టిన హీరోయిన్లు.. టాప్ హీరోయిన్లుగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు మరో యంగ్ హీరోయిన్‌కు ‘ఆర్’ లెటర్‌తో పేరు పెట్టి.. మరోసారి ‘ఆర్’పై తన మమకారాన్ని ప్రదర్శించారా దర్శకుడు. ఇంతకీ ఎవరా దర్శకుడు అనుకుంటున్నారా?

Rakshana: మరో హీరోయిన్‌కు ‘ఆర్’ అక్షరం వచ్చేలా పేరు పెట్టిన దర్శక దిగ్గజం
Heroine Rakshana

‘ఆర్’ (R) అనే అక్షరంతో ఆయన పేరు పెట్టిన హీరోయిన్లు.. టాప్ హీరోయిన్లుగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు మరో యంగ్ హీరోయిన్‌కు ‘ఆర్’ లెటర్‌తో పేరు పెట్టి.. మరోసారి ‘ఆర్’పై తన మమకారాన్ని ప్రదర్శించారా దర్శకుడు. ఇంతకీ ఎవరా దర్శకుడు అనుకుంటున్నారా? తమిళ అగ్ర దర్శకుడు భారతీరాజా (Bharathiraja). దర్శక దిగ్గజం భారతీరాజా చిత్ర పరిశ్రమకు పలువురు హీరోయిన్లను పరిచయం చేశారు. వీరిలో ‘ఆర్‌’ అనే ఆంగ్ల ఆక్షరంతో పేరు పెట్టి పరిచయం చేసిన రాధిక (Radhika), రాధ (Radha), రేవతి (Revathi), రేఖ (Rekha) వంటి వారు కాలక్రమంలో అగ్రహీరోయిన్లుగా రాణించారు. ఇపుడు మరో హీరోయిన్‌కు ‘ఆర్‌’ అక్షరం వచ్చేలా ఆయన పేరు పెట్టారు. వివరాల్లోకి వెళితే..

కోలీవుడ్‌కి పరిచయం అవుతున్న ఓ నటికి భారతీరాజా ‘రక్షణ’ (Rakshana) అనే నామకరణం చేశారు. ‘మార్గళి తింగళ్‌’ (Margazhi Thingal) అనే చిత్రం ద్వారా ఆమె వెండితెరకు పరిచయమవుతున్నారు. భారతీరాజా ప్రధాన పాత్రలో ఆయన కుమారుడు మనోజ్‌ భారతీరాజా (Manoj Bharathiraja) తొలిసారి దర్శకుడిగా పరిచయమవుతూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సుశీంద్రన్‌ (Suseenthiran) తన సొంత నిర్మాణ సంస్థ వెన్నిలా ప్రొడక్షన్‌ బ్యానరుపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో రక్షణ పేరుతో హీరోయిన్‌ను పరిచయం చేశారు. ఈ విషయాన్ని తాజాగా భారతీరాజా ఓ ప్రకటనలో వెల్లడించారు.

Rakshana.jpg

అయితే ఈ సినిమాకు హీరోయిన్‌ ఎంపిక నిమిత్తం మొత్తం 5 హీరోయిన్లను ముందు సెలక్ట్ చేశారు. అందులో ఫైనల్‌గా ‘రక్షణ’ సెలక్ట్ అయ్యారు. ఈ ఐదుగురు హీరోయిన్లతో కొన్ని వీడియోలను చేసి.. ఆ వీడియోలలో వారి నటనను పరీక్షించిన అనంతరం హీరోయిన్‌ను ఫైనలైజ్ చేశారు. ఆ ఐదుగురు అమ్మాయిల యాక్టింగ్‌కు సంబంధించిన వీడియోలను చిత్ర నిర్మాణ సంస్థ అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇక భారతీరాజా విషయానికి వస్తే.. ఆయన ఎటువంటి వారి నుంచైనా సహజమైన నటనను బయటకు రాబట్టగలరు. అందుకే ఆయన పరిచయం చేసిన వారంతా టాప్ యాక్టర్స్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడాయన నామకరణం చేసిన ‘రక్షణ’ (Rakshana) ఎటువంటి పేరుతో సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

************************************************

*Pawan Kalyan OG: వద్దన్నా.. ‘ఓజీ’ అప్‌డేట్స్ వస్తూనే ఉన్నాయ్.. ఈసారి వచ్చిన అప్‌డేట్ ఏమిటంటే..

*NTR30: పవర్‌ఫుల్ అప్‌డేట్.. రక్తంతో ఆయన రాసిన కథలతో సముద్రం నిండిపోయింది..

*Annapurna Studios: ఎ ఎన్నార్‌ వర్చువల్‌ ప్రొడక్షన్‌ స్టేజ్‌.. సినిమా మేకింగ్ ఇక మరింత సులభతరం

*Karate Kalyani: ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌రణకు అభ్యంతరం.. కరాటే కళ్యాణికి షోకాజ్ నోటీసులు

*Vijay Antony: ‘పిచ్చైక్కారన్‌’.. నాకు ఆయన వేసిన భిక్ష

*Niharika Konidela: నన్ను నమ్మినందుకు థ్యాంక్స్

Updated Date - 2023-05-18T11:29:06+05:30 IST