Malli Pelli: పాటలోనూ పవిత్రని వదలని నరేష్

ABN , First Publish Date - 2023-05-18T12:55:22+05:30 IST

ఇప్పటికే ‘మళ్ళీ పెళ్లి’ సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరుగా సాగుతుండగా.. తాజాగా ఈ చిత్రంలోని ‘కావేరి గాలిలా’ (Kaveri Gaalila Lyrical Song) పాటని మేకర్స్ విడుదల చేశారు. అయితే ఈ పాటలో కూడా నరేష్..

Malli Pelli: పాటలోనూ పవిత్రని వదలని నరేష్
Naresh and Pavitra

సీనియర్ యాక్టర్ డా. నరేష్ వి.కె (Dr Naresh VK) గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ ‘మళ్ళీ పెళ్లి’ (Malli Pelli) చిత్ర ప్రకటన వచ్చినప్పటి నుంచి.. ఈ సినిమా వార్తలలో నిలుస్తూనే ఉంది. యూనిక్ కథతో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌‌లో నరేష్‌కు జోడీగా పవిత్ర లోకేష్ (Pavitra Lokesh) నటిస్తోంది. మెగా మేకర్ ఎంఎస్ రాజు (MS Raju) రచన దర్శకత్వం వహిస్తున్నారు. విజయ కృష్ణ మూవీస్ (Vijaya Krishna Movies) బ్యానర్‌పై నరేషే స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరుగా సాగుతుండగా.. తాజాగా ఈ చిత్రంలోని ‘కావేరి గాలిలా’ (Kaveri Gaalila Lyrical Song) పాటని మేకర్స్ విడుదల చేశారు.

Naresh-VK.jpg

ఇప్పటికే ఫస్ట్ లుక్, గ్లింప్స్, టీజర్, ట్రైలర్‌తో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారిన ఈ సినిమా.. ఇలా ప్రమోషనల్ కంటెంట్‌తోనే బీభత్సమైన క్రేజ్‌ని సొంతం చేసుకుంది. ఒకవైపు నరేష్, పవిత్రల (Naresh and Pavitra) బంధంపై విమర్శలు చేస్తూనే.. మరో వైపు ఈ సినిమాకు సంబంధించి వచ్చే అప్‌డేట్స్‌పై అంతా ఆసక్తిని కనబరుస్తున్నారు. దీంతో.. సాధారణంగానే ఈ సినిమా ట్రెండ్ అవుతోంది. తాజాగా విడుదల చేసిన ‘కావేరి గాలిలా’ పాటలో కూడా ఈ జంట అస్సలు తగ్గలేదు. పవిత్రని నరేష్ అసలు వదలలేదు. సాంగ్ మెలోడియస్‌గా అలా సాగిపోతుంటే.. నరేష్, పవిత్ర లోకేష్‌ల కెమిస్ట్రీపైనే అందరి కళ్లు పడుతుండటం విశేషం.

Malli-Pelli.jpg

సురేష్ బొబ్బిలి (Suresh Bobbili) ఈ పాటని మనసుని హత్తుకునే మెలోడియస్ ట్యూన్‌‌తో కంపోజ్ చేయగా.. నరేష్ అయ్యర్ (Naresh Iyer) అంతే చక్కగా ఆలపించారు. ఈ పాటకు అనంత శ్రీరామ్ (Anantha Sriram) అందించిన సాహిత్యం కూడా ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. సురేష్ బొబ్బిలి, అరుల్‌దేవ్ (Aruldev) కలిసి ఈ చిత్రానికి సంగీతం అందించారు. మే 26న తెలుగు, కన్నడ భాషలలో గ్రాండ్‌గా విడుదల కాబోతోన్న ఈ చిత్రంలో జయసుధ (Jayasudha), శరత్‌బాబు (Sarath Babu), వనిత విజయకుమార్ (Vanitha Vijay Kumar), అనన్య నాగళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ వంటి వారంతా ఇతర పాత్రలలో నటించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌లో నరేష్, పవిత్ర యమా యాక్టివ్‌గా పాల్గొంటున్నారు.


ఇవి కూడా చదవండి:

************************************************

*Rakshana: మరో హీరోయిన్‌కు ‘ఆర్’ అక్షరం వచ్చేలా పేరు పెట్టిన దర్శక దిగ్గజం

*Pawan Kalyan OG: వద్దన్నా.. ‘ఓజీ’ అప్‌డేట్స్ వస్తూనే ఉన్నాయ్.. ఈసారి వచ్చిన అప్‌డేట్ ఏమిటంటే..

*NTR30: పవర్‌ఫుల్ అప్‌డేట్.. రక్తంతో ఆయన రాసిన కథలతో సముద్రం నిండిపోయింది..

*Annapurna Studios: ఎ ఎన్నార్‌ వర్చువల్‌ ప్రొడక్షన్‌ స్టేజ్‌.. సినిమా మేకింగ్ ఇక మరింత సులభతరం

Updated Date - 2023-05-18T12:55:22+05:30 IST