Mrunal Thakur: వామ్మో.. ఈమె అసలు ‘సీతా రామం’ సీతేనా? ఆ ప్రదర్శన ఏంటసలు?
ABN , First Publish Date - 2023-05-18T16:11:06+05:30 IST
సినిమా అవకాశాలు ఏమో గానీ.. సోషల్ మీడియాలో మాత్రం మృణాల్ ఉన్నంత యాక్టివ్‌గా మరే హీరోయిన్ ఉండరంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్‌కు ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివల్ (#Cannes2023)లో పాల్గొనే అవకాశం వరించింది. దీంతో ఆమె..
                                    
‘సీతారామం’ (Sita Ramam) చిత్రం ద్వారా దక్షిణాది సినీ ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur). ఈ చిత్రం తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు అయితే రాలేదు కానీ.. ఎప్పుడూ ట్రెండ్‌ని మాత్రం షేకాడిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఆమె ‘నాని30’ (Nani30) సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాలకు సంబంధించి మొదట ఆమె పేరే వినిపిస్తుంది కానీ.. ఫైనల్‌గా మాత్రం వేరొకరు ఆ ఛాన్స్ కొట్టేస్తున్నారు. రీసెంట్‌గా ‘NTR30’ చిత్రం విషయంలో హీరోయిన్‌గా ఈ భామ పేరు వైరల్ అయింది. కానీ, చివరికి జాన్వీ కపూర్ వచ్చి చేరింది. సినిమా అవకాశాలు ఏమో గానీ.. సోషల్ మీడియాలో మాత్రం మృణాల్ ఉన్నంత యాక్టివ్‌గా మరే హీరోయిన్ ఉండరంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్‌కు ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివల్ (#Cannes2023)లో పాల్గొనే అవకాశం వరించింది. దీంతో ఆమె ఆనందానికి అవధులే లేవంటే నమ్మాలి.

‘ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది. నా సినీ కెరీర్‌కు దక్కిన గౌరవం. అనేక మంది అంతర్జాతీయ కళాకారులను కలుసుకునే అరుదైన అవకాశం దక్కింది’ అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేసిన ఆమె.. ఇక ఈ ఫెస్టివల్‌లో ధరించే డ్రస్సులతో కుర్రకారుకి నిద్రలేకుండా చేస్తోంది. ఎందుకు ఇలా అనాల్సి వచ్చిందో తెలియాలంటే.. ప్రస్తుతం సోషల్ మీడియా ట్విట్టర్‌లో ట్రెండింగ్ ఉన్న ఆమె పేరుపై ఒక్కసారి క్లిక్ చేసి చూడాల్సిందే. రకరకాల డ్రస్సులలో గ్లామర్ ప్రదర్శన ఇస్తూ.. అసలు నిజంగా మృణాలేనా అనేంతగా ఆమె ఎంజాయ్ చేస్తోంది. (Mrunal Thakur in Cannes2023)

ప్రస్తుతం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (Cannes Film Festival 2023)లో ఆమె సందడి చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఆమె పేరు మరోసారి టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ దెబ్బతో ఒక్క తెలుగు, హిందీ అనే కాదు.. అన్ని భాషలలో ఆమెకు అవకాశాలు రావడం ఖాయం అనేలా ఆమె గ్లామర్ ప్రదర్శన ఉంది. అందరి కంట పడేలా.. ఓ రేంజ్‌లో మృణాల్ (Mrunal) అందాల ప్రదర్శన చేస్తోంది. ఈ ప్రదర్శన ఆమెకు ఎంత వరకు యూజ్ అవుతుందో తెలియదు కానీ.. ఆమె షేర్ చేస్తోన్న ఫొటోలు మాత్రం ఇప్పుడు హాట్‌హాట్‌గా చర్చలకు తావిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:
************************************************
*Virupaksha: ఆ గమ్యాన్ని చేరుకుంది
*PushpaTheRule: ‘షెకావత్’ అప్‌డేట్ వచ్చింది.. ఈసారి ప్రతీకారం మాములుగా ఉండదట
*Malli Pelli: పాటలోనూ పవిత్రని వదలని నరేష్
*Rakshana: మరో హీరోయిన్‌కు ‘ఆర్’ అక్షరం వచ్చేలా పేరు పెట్టిన దర్శక దిగ్గజం
*Pawan Kalyan OG: వద్దన్నా.. ‘ఓజీ’ అప్‌డేట్స్ వస్తూనే ఉన్నాయ్.. ఈసారి వచ్చిన అప్‌డేట్ ఏమిటంటే..
*NTR30: పవర్‌ఫుల్ అప్‌డేట్.. రక్తంతో ఆయన రాసిన కథలతో సముద్రం నిండిపోయింది..