Ram Gopal Varma: డిగ్రీ పట్టాని అలా వదిలేశాడేంటి? 37 ఏళ్ళ తర్వాత..

ABN , First Publish Date - 2023-03-15T23:18:29+05:30 IST

రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏది చేసినా.. ముందు వైరల్ అవుతుంది.. ఆ తర్వాత వార్త అవుతుంది. దానిని చూసే వారిని బట్టి.. ఆపైన కాంట్రీవర్సీ (Controversy) కూడా అవుతుందనుకోండి. అది వేరే విషయం. తాజాగా రామ్ గోపాల్ వర్మ (RGV) షేర్ చేసిన

Ram Gopal Varma: డిగ్రీ పట్టాని అలా వదిలేశాడేంటి? 37 ఏళ్ళ తర్వాత..
Director Ram Gopal Varma

రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏది చేసినా.. ముందు వైరల్ అవుతుంది.. ఆ తర్వాత వార్త అవుతుంది. దానిని చూసే వారిని బట్టి.. ఆపైన కాంట్రీవర్సీ (Controversy) కూడా అవుతుందనుకోండి. అది వేరే విషయం. తాజాగా రామ్ గోపాల్ వర్మ (RGV) షేర్ చేసిన ట్వీట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరలే కాదు.. పెద్ద వార్త కూడా అవుతుంది. ఎందుకంటే.. చదువుకున్న వారెవరైనా.. ఆ చదువుకు సంబంధించిన పట్టా తీసుకోకుండా ఉంటారా? వర్మ ఉంటాడు. ఎందుకంటే ఆయన అంత స్పెషల్ మరి. ఈ సంచలన దర్శకుడు తన డిగ్రీ పట్టాని (B tech degree), డిగ్రీ పూర్తి చేసిన 37 సంవత్సరాల తర్వాత అందుకున్నాడు. నిజంగా ఇది ఆశ్చర్యపరిచే విషయమే. 37 సంవత్సరాల (37 Years) తర్వాత ఆ పట్టా అందుకున్న వర్మ థ్రిల్ అయ్యానంటూ ట్వీట్ చేయడం.. ముందుగా అందరినీ అబ్బురపరుస్తోంది. ఎందుకంటే.. వర్మ ఇలాంటి వాటికి కూడా థ్రిల్ అవుతాడా? మందు, అమ్మాయిలు తప్పితే.. మిగతావి ఏవీ తనకు పట్టవని పలు మార్లు ఆయనే చెప్పి ఉన్నాడు. ఇప్పుడు డిగ్రీ పట్టాని ఫొటో తీసి మరీ వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇదంతా చూస్తుంటే.. ‘టెంపర్’ (Temper) సినిమాలోని పోసాని (Posani) డైలాగ్ గుర్తొస్తుంది కదా!

విజయవాడలోని (Vijayawada) విఆర్ సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీలో (Velagapudi Ramakrishna Siddhartha Engineering College) 1985లో రామ్ గోపాల్ వర్మ బిటెక్ పూర్తి చేశారు. అందులో సెకండ్ క్లాస్‌లో పాసయిన వర్మ.. అప్పటి నుంచి ఆ డిగ్రీ పట్టాని అందుకోలేదు. తాజాగా విజయవాడ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (Acharya Nagarjuna University) అకాడమిక్ ఎగ్జిబిషన్‌కి అతిథిగా వెళ్లిన వర్మని.. యూనివర్సిటీ వారు సత్కరించడమే కాకుండా.. బిటెక్ డిగ్రీ పట్టాని చేతిలో పెట్టి ఆయనని థ్రిల్ చేశారు. డిగ్రీ పట్టాని అందుకున్న వర్మ సోషల్ మీడియా వేదికగా.. (RGV B tech degree Certificate)

‘‘డిగ్రీలో బిటెక్ పాస్ అయిన 37 ఏళ్ళ తరువాత నా డిగ్రీ పట్టాని అందుకోవడం సూపర్ థ్రిల్‌గా ఉంది. నాకు సివిల్ ఇంజినీరింగ్ ప్రాక్టీస్ చేయాలనే ఆసక్తి లేదు. అందుకే 1985 నుంచి ఈ డిగ్రీ పట్టాని తీసుకోలేదు. థ్యాంక్యూ..’’ అంటూ ఆచార్య నాగార్జున యూనివర్సిటీని (#AcharyaNagarjunaUniversity) ట్యాగ్ చేస్తూ.. ఓ ముద్దిచ్చేశాడు వర్మ. ఇక వర్మ చేసిన ఈ ట్వీట్‌కు నెటిజన్ల కామెంట్స్ చూస్తే.. మరోసారి వర్మ థ్రిల్ అవుతాడు. అలా ఉన్నాయ్ కామెంట్స్. తన డిగ్రీ పట్టానే కాకుండా.. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్స్ మధ్య కూర్చున్న పిక్‌ను, అలాగే వేడుకలో స్టూడెంట్స్‌తో మాట్లాడుతోన్న మరో పిక్‌ని కూడా వర్మ పోస్ట్ చేశారు. స్టూడెంట్స్‌తో ఇంటరాక్ట్ అవుతున్న ఫోటోకి.. ‘నేను వాళ్ళని చెడ గొట్టడానికి ట్రై చేశా. కానీ వాళ్ళే నన్ను చెడ గొట్టారు’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం వర్మ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. (Ram Gopal Varma B tech degree Certificate)


ఇవి కూడా చదవండి:

*********************************

*Roshan Kanakala: హీరోగా యాంకర్ సుమక్క కొడుకు.. లుక్ అదిరింది

*VBVK: ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

*RGV: స్వర్గంలో వాళ్లుంటారనే అపోహ వద్దు.. ఆ పని ఇప్పుడే చేయండి

*Chiranjeevi: సినీ నటుడు చిరంజీవికి హైకోర్టులో ఎదురుదెబ్బ..

*PVT04: మెగా హీరోని ఢీ కొట్టబోతోంది ఎవరో తెలుసా?

*Richa Panai: అవకాశాలు లేక ఈ భామ ఇప్పుడేం చేస్తుందో తెలుసా?

*The Elephant Whisperers: ఆస్కార్ అందుకున్న ఆనందం ఆవిరైంది

*Ram Charan: ఉపాసనని, ఆమె మెడలోని నగని కాపాడుకోవాలి

*SS Rajamouli: జక్కన్న మంట పుట్టించాడు.. ఈ పిక్‌కి అర్థం అదేనా?

Updated Date - 2023-03-15T23:30:25+05:30 IST