Pavitra Lokesh: పెద్ద బాంబ్ పేల్చిన పవిత్రా లోకేష్ మొదటి భర్త.. పాపం నరేష్..?

ABN , First Publish Date - 2023-03-16T22:03:53+05:30 IST

పవిత్ర (Pavitra), నరేష్‌ (Naresh)ల బంధంపై రోజురోజుకు వార్తలు వైరల్ అవుతున్నాయి. రీసెంట్‌గా పవిత్రను పెళ్లి చేసుకుంటున్న వీడియోని (Pavitra and Naresh Marriage Video) షేర్ చేసి ఒక్కసారిగా నరేష్ అందరికీ..

Pavitra Lokesh: పెద్ద బాంబ్ పేల్చిన పవిత్రా లోకేష్ మొదటి భర్త.. పాపం నరేష్..?
Suchendra Prasad about Pavitra and Naresh

పవిత్ర (Pavitra), నరేష్‌ (Naresh)ల బంధంపై రోజురోజుకు వార్తలు వైరల్ అవుతున్నాయి. రీసెంట్‌గా పవిత్రను పెళ్లి చేసుకుంటున్న వీడియోని (Pavitra and Naresh Marriage Video) షేర్ చేసి ఒక్కసారిగా నరేష్ అందరికీ షాకిచ్చారు. అంతకు ముందు.. త్వరలో మా పెళ్లి అంటూ ఓ లిప్ లాక్ వీడియోను కూడా నరేష్ అధికారికంగా షేర్ చేశారు. కొన్నాళ్లుగా వీరిద్దరూ కలిసే కనిపించడం, సూపర్ స్టార్ కృష్ణగారు (Super Star Krishna) చనిపోయినప్పుడు వీరిద్దరూ కలిసి చేసిన హంగామా, ఆ తర్వాత విడుదల చేసిన ఈ వీడియోలు.. మొత్తంగా ఇదొక సినిమా లాగా జనాలని ఎంటర్‌టైన్ చేస్తోంది. మరో వైపు వీరి పెళ్లిని ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వనంటూ నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి (Ramya Raghupathi) కంకణం కట్టుకుని కూర్చుంది. ప్రస్తుతం నరేష్, రమ్యల విడాకుల వ్యవహారం కోర్టులో ఉంది.. రమ్యతో విడాకుల కోసం నరేష్ కూడా చేయాల్సినవన్నీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా పవిత్ర నరేష్ మొదటి భర్త ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు. పవిత్ర మొదటి భర్త సుచేంద్ర ప్రసాద్ (Suchendra Prasad) చేసిన వ్యాఖ్యలతో.. ఇప్పుడంతా ‘పాపం నరేష్’ అంటున్నారంటే.. ఆయన ఎటువంటి బాంబ్ పేల్చారో అర్థం చేసుకోవచ్చు.

ఇంతకీ సుచేంద్ర ప్రసాద్ ఏమన్నారంటే.. (Suchendra Prasad Shocking Comments on Pavitra Lokesh) నరేష్‌కి ఉన్న రూ. 1500 కోట్ల ఆస్తిని కొట్టేయడానికే పవిత్ర.. అతనితో ఈ ప్రేమ డ్రామా ఆడుతుందనేలా షాకింగ్ ఆరోపణలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘పవిత్రను మించిన అవకాశవాది ఈ వరల్డ్‌లోనే ఎవరూ ఉండరు. ఆమెకు విలాసవంతమైన జీవితం గడపటం అంటే ఇష్టం. దాని కోసం ఆమె ఏదైనా చేయడానికి సిద్ధపడుతుంది. నాకు తెలిసి ఆమె మంచి ప్లాన్‌తోనే ఈ డ్రామా అంతా ఆడుతుందని అనుకుంటున్నాను. నరేష్‌తో నిజంగా ఆమెది ప్రేమ బంధం కాదు. నరేష్ మదర్ విజయ నిర్మల (Vijaya Nirmala) సంపాదించిన రూ. 1500 కోట్ల ఆస్తిని కొట్టేయడానికే ఆమె ఈ ప్రేమ వ్యవహారం నడుపుతుంది. ఈ విషయం నరేష్‌కి తెలిసే సరికి.. ఆయన దగ్గర ఏమీ ఉండదు. ఇలా విలాసవంతమైన జీవితానికి అలవాటు పడే.. ఆమె ఇప్పటి వరకు ఇద్దరికి విడాకులు ఇచ్చింది. ఈ విషయం నరేష్ ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది..’’ అంటూ పవిత్రపై సుచేంద్ర ప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు. మరి ఈ ఆరోపణలపై నరేష్, పవిత్రలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

నరేష్ విషయానికి వస్తే.. రీసెంట్‌గా తన నాలుగో పెళ్లి (4th Marriage) గురించి నరేష్ ఓ సినిమా ఫంక్షన్‌లో ప్రస్తావిస్తూ.. ‘‘నా పెళ్లి విషయం డైవర్ట్ చేయదల్చుకోలేదు. నాకు సంబంధించిన ప్రతి విషయాన్ని మీడియాకు తెలియజేస్తూనే ఉన్నాను.. ఈ విషయం అందరికీ తెలిసిందే. త్వరలో పెళ్లికి సంబంధించిన విషయం కూడా ప్రెస్ మీట్ పెట్టి అందరికీ చెబుతాను. అప్పటి వరకు అందరూ కాస్త ఓపిక పట్టండి..’’ అని చెప్పుకొచ్చారు. మొత్తంగా చూస్తే.. నరేష్, పవిత్రల ప్రస్తుత సహజీవనం పెళ్లి వరకు దారి తీస్తుందా? అంటే అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే, నరేష్‌‌కి విడాకులు ఇవ్వడానికి రమ్య సిద్ధంగా లేకపోవడం ఒక కారణం అయితే.. ఇప్పుడు పవిత్రపై సుచేంద్ర ప్రసాద్ చేస్తున్న ఆరోపణలు మరో కారణంగా చెప్పుకోవచ్చు. చూద్దాం.. ఏం జరుగుతుందో?

ఇవి కూడా చదవండి:

*********************************

*Kantara: ఆస్కార్‌తో ‘ఆర్ఆర్ఆర్’‌ చరిత్ర సృష్టించింది.. ఇక ‘కాంతార’ వంతు!

*Ram Gopal Varma: డిగ్రీ పట్టాని అలా వదిలేశాడేంటి? 37 ఏళ్ళ తర్వాత..

*Roshan Kanakala: హీరోగా యాంకర్ సుమక్క కొడుకు.. లుక్ అదిరింది

*VBVK: ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

*RGV: స్వర్గంలో వాళ్లుంటారనే అపోహ వద్దు.. ఆ పని ఇప్పుడే చేయండి

*Chiranjeevi: సినీ నటుడు చిరంజీవికి హైకోర్టులో ఎదురుదెబ్బ..

*Richa Panai: అవకాశాలు లేక ఈ భామ ఇప్పుడేం చేస్తుందో తెలుసా?

*The Elephant Whisperers: ఆస్కార్ అందుకున్న ఆనందం ఆవిరైంది

*Ram Charan: ఉపాసనని, ఆమె మెడలోని నగని కాపాడుకోవాలి

*SS Rajamouli: జక్కన్న మంట పుట్టించాడు.. ఈ పిక్‌కి అర్థం అదేనా?

Updated Date - 2023-03-16T23:46:15+05:30 IST