Bigg Boss Himaja: ఘోరంగా ఏడ్చాను.. కానీ?

ABN , First Publish Date - 2023-03-17T20:43:25+05:30 IST

బిగ్ బాస్ హిమజ (Bigg Boss Himaja).. ఈ పేరు అందరికీ పరిచయమే. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో (Bigg Boss Season 3) కంటెస్టెంట్‌గా పాల్గొని నటి హిమజ మంచి పేరును

Bigg Boss Himaja: ఘోరంగా ఏడ్చాను.. కానీ?
Bigg Boss Fame and Actress Himaja

బిగ్ బాస్ హిమజ (Bigg Boss Himaja).. ఈ పేరు అందరికీ పరిచయమే. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో (Bigg Boss Season 3) కంటెస్టెంట్‌గా పాల్గొని నటి హిమజ మంచి పేరును తెచ్చుకున్నారు. ‘నేను శైలజ, ధృవ, జనతా గ్యారేజ్, వినయ విధేయ రామ, వరుడు కావలెను’ వంటి చిత్రాలలో మంచి పాత్రలను పోషించిన హిమజ (Himaja).. తాజాగా తన లైఫ్‌లో ఎదుర్కొన్న విషయాలను ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో షేర్ చేసుకున్నారు. ఆమె మాట్లాడుతూ..

‘‘నేను కూడా అందరిలానే లైఫ్‌లో చాలా ఇబ్బందులను ఫేస్ చేశాను. అప్ అండ్ డౌన్స్ చూశాను. ఘోరంగా ఏడ్చాను కూడా. సొసైటీ మనల్ని ఎలా చూస్తుంది? మనం కరెక్ట్‌గా ఉన్నామా? లేదా? అనేది మనకు తెలిసినట్లయితే.. మనం చేసే పని కరెక్ట్ పని అయినట్లయితే.. ఎవడు చెప్పినా ఆగేది లేదు. కాన్ఫిడెన్స్‌తో వెళ్లిపోవడమే. పనికిరాని మాటలని చెవుల దగ్గరకు కూడా రానివ్వకూడదు.

సోషల్ వర్క్ (Social Work) విషయానికి వస్తే.. నేను బయటికి వెళ్లి ఏదో చేయాల్సిన దాని కంటే.. మా ఇంట్లోనే, మా డ్రైవర్ పిల్లలను చదవించాల్సిన బాధ్యత నాపై ఉంది. అతనికి ముగ్గురు ఆడపిల్లలు. ఇంట్లో ముందు చూసుకుని.. తర్వాత బయట చూడాలని అంటారు కదా. అలా, ముందు నా సర్కిల్‌లో ఉన్న వారికి వీలైనంత హెల్ప్ (Help) చేసి.. ఆ తర్వాత నాకు తెలియని వారి గురించి ఆలోచించాలని అనుకుంటున్నాను. (Actress Himaja)

సోషల్ మీడియాకు (Social Media) మ్యాగ్జిమమ్ టైమ్ కేటాయిస్తాను. నేను ఏదైనా బ్రాండ్‌కి అంబాసిడర్‌గా చేసినప్పుడు.. ఆ బ్రాండ్‌కి సంబంధించిన వాళ్లు ఫోన్ చేసి అభినందిస్తుంటారు. కారణం.. ఆ బ్రాండ్‌ విషయంలో నాపై నెటిజన్ల నుంచి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్. అయితే సోషల్ మీడియాలో అంతా పాజిటివ్‌నే ఊహించకూడదు. నెగిటివ్‌ని కూడా భరించాలి. మనకు తెలుసో, తెలియకో ఏదో ఒక బ్యాడ్ జరుగుతూ ఉంటుంది. తర్వాత వచ్చే నెగిటివ్‌ని కూడా భరించే ఓపిక ఉండాలి. లుక్స్ వైజ్ నేను చాలా బ్యాడ్ కామెంట్స్‌ని ఫేస్ చేశాను. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నీ కళ్లు చాలా చిన్నగా ఉంటాయి. పాత్రకి సెట్ అవుతుందో లేదో అనే వారు. డైరెక్టర్స్ కూడా ఈ మాట అన్నారు. కానీ.. మేకప్ మొత్తం పూర్తయిన తర్వాత నా కళ్లు చాలా బాగున్నాయనే కాంప్లిమెంట్‌ని అందుకున్నాను. అలాగే వాకింగ్. నాకు కూడా తెలుసు నేను మగరాయుడిలా నడుస్తానని. కానీ నేను అమ్మాయిలా కూడా నడవగలను. ఆ విషయం నాకు తెలుసు. కానీ వారికి తెలియదు కదా..’’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఇంకా ఆమె.. మదర్‌వుడ్ గురించి, మహిళల హక్కుల గురించి, సరొగసి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవేంటో తెలియాలంటే కింది వీడియో చూడాల్సిందే. (Bigg Boss Himaja Interview)


ఇవి కూడా చదవండి:

*********************************

*Shruti Haasan: సిల్లీ క్వశ్చన్ అడగమంటే.. శృతిని అలాంటి ప్రశ్నేనా అడిగేది?

*Pavitra Lokesh: పెద్ద బాంబ్ పేల్చిన పవిత్రా లోకేష్ మొదటి భర్త.. పాపం నరేష్..?

*Kantara: ఆస్కార్‌తో ‘ఆర్ఆర్ఆర్’‌ చరిత్ర సృష్టించింది.. ఇక ‘కాంతార’ వంతు!

*The Elephant Whisperers: ఆస్కార్ అందుకున్న ఆనందం ఆవిరైంది

*Ram Gopal Varma: డిగ్రీ పట్టాని అలా వదిలేశాడేంటి? 37 ఏళ్ళ తర్వాత..

*VBVK: ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

*RGV: స్వర్గంలో వాళ్లుంటారనే అపోహ వద్దు.. ఆ పని ఇప్పుడే చేయండి

*Richa Panai: అవకాశాలు లేక ఈ భామ ఇప్పుడేం చేస్తుందో తెలుసా?

*SS Rajamouli: జక్కన్న మంట పుట్టించాడు.. ఈ పిక్‌కి అర్థం అదేనా?

Updated Date - 2023-03-17T20:43:25+05:30 IST