SS Rajamouli: జక్కన్న మంట పుట్టించాడు.. ఈ పిక్‌కి అర్థం అదేనా?

ABN , First Publish Date - 2023-03-13T17:39:58+05:30 IST

95వ అకాడమీ అవార్డ్స్‌ (95th Academy Awards)లో జక్కన్న (Jakkanna) చెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రంలోని ‘నాటు నాటు’ (Naatu Naatu) పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో (best original song oscar 2023) ఆస్కార్ అవార్డును...

SS Rajamouli: జక్కన్న మంట పుట్టించాడు.. ఈ పిక్‌కి అర్థం అదేనా?
Director SS Rajamouli

95వ అకాడమీ అవార్డ్స్‌ (95th Academy Awards)లో జక్కన్న (Jakkanna) చెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రంలోని ‘నాటు నాటు’ (Naatu Naatu) పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో (best original song oscar 2023) ఆస్కార్ అవార్డును (Oscar Award) కైవసం చేసుకుంది. ఇండియన్ సినిమా గర్వపడేలా చరిత్ర సృష్టించిన రాజమౌళి (SS Rajamouli), ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అవార్డ్ అనౌన్స్‌మెంట్ తర్వాత ఈవెంట్‌లో భాగమైన ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ఆనందానికి అవధులు లేవంటే అతిశయోక్తి కానే కాదు. ముఖ్యంగా రాజమౌళి.. పక్కనే ఉన్న తన భార్య రమా రాజమౌళిని హత్తుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ఆ మూమెంట్ చూసిన ప్రతి ఒక్కరికీ కళ్లలో నీళ్లు చెమ్మగిల్లాయి. ఎందుకంటే, ఈ క్షణం కోసం వారు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు.. ఎంతగానో కష్టపడ్డారు. దాదాపు ఫ్యామిలీ అంతా కొన్నాళ్లుగా అమెరికాలోనే ఉంటూ.. తెలుగువారి ‘ఆస్కార్’ డ్రీమ్‌ని తీర్చే ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలన్నీ సక్సెస్ అయ్యాయి. తెలుగు వారి కల నెరవేరింది. ప్రపంచ వేదికపై తెలుగు సినిమా సత్తా చాటుతూ కీరవాణి (Keeravani), చంద్రబోస్ (Chandrabose) ‘ఆస్కార్’ అవార్డును అందుకున్నారు. దీంతో దేశం సత్తా చాటేలా మీసం మెలేసిన రాజమౌళి అండ్ టీమ్‌పై అభినందనల వర్షం కురుస్తోంది.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ‘ఆర్ఆర్ఆర్’ అఫీషియల్ ట్విట్టర్ పేజీలో ఓ పిక్‌ని పోస్ట్ చేశారు. ఈ పిక్‌లో మంటలు ఎగిసిపడుతుంటే.. ఎదురుగా తెల్ల పంచె, బ్లూ షర్ట్‌లో ఉన్న దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) తీక్షణంగా చూస్తున్నారు. ఈ పిక్ చూస్తుంటే.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో బ్రిడ్జ్ సీన్ లేదంటే.. జంతువులన్నింటితో ఎన్టీఆర్ దాడి చేసే సీన్ కానీ.. అదీ కాదంటే క్లైమాక్స్ సీన్ కానీ చిత్రీకరణ జరిపే టైమ్‌లోదని తెలుస్తుంది (RRR Movie). ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. అయితే, ఈ పిక్‌ని.. ఈ టైమ్‌లో పోస్ట్ చేయడం వెనుక అర్థం ఏమై ఉంటుందనేలా కొందరు చర్చిస్తుంటే.. కొందరు నెటిజన్లు మాత్రం దీనికి ‘ఏముంది.. ఆస్కార్‌ అవార్డులో రాజమౌళి మంట పుట్టించాడు’ అనేలా కామెంట్స్ చేస్తున్నారు. నెటిజన్లు చెప్పినట్లుగా నిజంగానే రాజమౌళి ఈ ఆస్కార్‌తో ఇండస్ట్రీలో మంట పుట్టించాడు. ఈ మంటని ఆర్పడం ఎవరితరం కాదు. ఇకపై ఆస్కార్ స్టాండర్డ్స్‌లోనే తెలుగు సినిమా వైభవం ఉండబోతుందనేదానికి ఇదొక ఉదాహరణ మాత్రమే అని చెప్పుకోవచ్చు. మొత్తంగా అయితే.. ఈ పిక్‌తోనే ప్రజంట్ సిచ్యుయేషన్‌ని తెలియజేశారు ‘ఆర్ఆర్ఆర్’ టీమ్.

ఇక బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘నాటు నాటు’ ఆస్కార్ కైవసం చేసుకున్న అనంతరం రాజమౌళి మాట్లాడుతూ ‘‘నిజంగా ఇది కలగానే (Dream) ఉంది. అవార్డు వస్తుందనే నమ్మకంతో ఉన్నాం. కానీ వేదికపై ఆ పాటని ప్రదర్శించడం, పాట ప్రదర్శితమైనంత సేపూ ప్రేక్షకులు క్లాప్స్‌తో పాటు స్టాండింగ్ ఓవియేషన్ ఇవ్వడం, అలాగే అవార్డ్ వరించడం.. ఇవన్నీ నన్ను శిఖరాగ్రంపై కూర్చోబెట్టినట్లుగా అనిపించింది. నిజంగా ఇవి మధురమైన క్షణాలుగా భావిస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు (SS Rajamouli on Oscar Award).


ఇవి కూడా చదవండి:

*********************************

* Harish Shankar: పెరుగన్నం, బిర్యానీ.. దర్శకుడు మహాకు కౌంటర్

*Pavitra Naresh: బ్యాచ్‌లర్స్ ఫీల్ కాకండి.. ఈ మీమ్స్ ఏంటి సామి?

*Ram Charan: మా నాన్న పెంపకం అలాంటిది.. ఆసక్తికర విషయాలు చెప్పిన చరణ్

*Radha Nair: తెల్ల చీర కట్టుకున్నదెవరి కోసమో.. మల్లెపూలు పెట్టుకున్నదెవరి కోసమో?

*Jr NTR: ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ సైడ్ యాక్టరా? ఇలా అవమానించారేంటి?

*Lakshmi Manchu: రక్తం మరిగిపోతోంది.. మంచు లక్ష్మికి కోపం తెప్పించిన వైరల్ వీడియో..

Updated Date - 2023-03-13T21:10:36+05:30 IST