Jr NTR: ఆస్కార్ క్రెడిట్ ఎవరిదంటే.. ఎన్టీఆర్ స్పీచ్ వైరల్

ABN , First Publish Date - 2023-03-17T22:38:08+05:30 IST

‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రం ఈ రోజున ప్రపంచ పటంలో నిలబడిందంటే, ఆస్కార్ అవార్డును (Oscar Award) చేజిక్కించుకుందంటే.. దానికి మా జక్కన్న రాజమౌళిగారు (SS Rajamouli) ఎంత కారణమో,

Jr NTR: ఆస్కార్ క్రెడిట్ ఎవరిదంటే.. ఎన్టీఆర్ స్పీచ్ వైరల్
Jr NTR About Oscar Award Win

‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రం ఈ రోజున ప్రపంచ పటంలో నిలబడిందంటే, ఆస్కార్ అవార్డును (Oscar Award) చేజిక్కించుకుందంటే.. దానికి మా జక్కన్న రాజమౌళిగారు (SS Rajamouli) ఎంత కారణమో, కీరవాణిగారు (Keeravani) ఎంత కారకులో, చంద్రబోస్‌గారు (Chandrabose) ఎంత కారకులో, పాట పాడినటువంటి కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఎంత కారకులో, ఆ పాటకి కొరియోగ్రఫీ చేసిన ప్రేమ్ రక్షిత్ ఎంత కారణమో.. వీరందరితో పాటు యావత్ తెలుగు చలన చిత్రసీమ (Tollywood), అలాగే భారతదేశపు చిత్రసీమ (Indian Cinema), అందులోని ప్రేక్షకులు కూడా అంతే కారణం అని అన్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR). ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ‘ఆస్కార్’ అవార్డు అందుకున్న అనంతరం ఆయన తొలిసారి ‘దాస్ కా ధమ్కీ’ (Das Ka Dhamki) ప్రీ రిలీజ్ వేడుకలో తన ఆనందాన్ని తెలియజేశారు.

ఇంకా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. వాళ్లందరితో పాటు మీ అభిమానం (అభిమానులు) అంతే కారణం. ఆ అవార్డు సాధించింది ఆ చిత్రానికి పని చేసిన మేము కాదు.. మా అందరితో పాటు మీరందరూ (ప్రేక్షకులు, అభిమానులు) సాధించారు ఈ అవార్డుని. (Jr NTR about Oscar to RRR) మీ అందరి బదులు మేము అక్కడ నిల్చున్నాం.. మా బదులు కీరవాణిగారు, బోస్‌గారు అక్కడ అవార్డు తీసుకున్నారు. వారిద్దరిని స్టేజ్‌పైన చూస్తుంటే.. నాకు ఇద్దరు భారతీయులు మాత్రమే కనిపించారు. ఇద్దరు తెలుగు వాళ్లు కనిపించారు. ఆస్కార్ స్టేజ్ మొత్తం తెలుగుదనం ఉట్టిపడింది. (Jr NTR Speech)

టీవీలలో చూసి మీరెంత ఉత్సాహం పొందారో తెలియదు కానీ.. ఈ రెండు కళ్లతో నేను చూడటం అనేది మాత్రం డిలైట్. ఆ డిలైట్‌ని మళ్లీ ఎప్పుడు పొందుతామో తెలియదు కానీ.. ఖచ్చితంగా పొందుతాం. ‘ఆర్ఆర్ఆర్’ ఇచ్చిన ఉత్సాహంతో తెలుగు సినిమాలు, భారతీయ చిత్రాలు మున్ముందుకు సాగాలని ఆ దేవుడిని మనసారా కోరుకుంటున్నాను. ఆస్కార్ అవార్డ్ రావడానికి మరో ముఖ్యమైన కారణం మీడియా ప్రతినిధులు, మీడియా మిత్రులు. కేవలం తెలుగు మీడియా వారే కాకుండా.. భారతదేశపు మీడియా వారందరూ కూడా.. ‘మన సినిమా’ అని అక్కరకు చేర్చుకుని ముందుకు తీసుకువెళ్లారు. జర్నలిస్ట్ సోదరులందరికీ ధన్యవాదాలు.. అని చెప్పుకొచ్చారు. (Jr NTR Says Thanks to Media)

ఇవి కూడా చదవండి:

*********************************

*Bigg Boss Himaja: ఘోరంగా ఏడ్చాను.. కానీ?

*Shruti Haasan: సిల్లీ క్వశ్చన్ అడగమంటే.. శృతిని అలాంటి ప్రశ్నేనా అడిగేది?

*Pavitra Lokesh: పెద్ద బాంబ్ పేల్చిన పవిత్రా లోకేష్ మొదటి భర్త.. పాపం నరేష్..?

*Kantara: ఆస్కార్‌తో ‘ఆర్ఆర్ఆర్’‌ చరిత్ర సృష్టించింది.. ఇక ‘కాంతార’ వంతు!

*The Elephant Whisperers: ఆస్కార్ అందుకున్న ఆనందం ఆవిరైంది

*Ram Gopal Varma: డిగ్రీ పట్టాని అలా వదిలేశాడేంటి? 37 ఏళ్ళ తర్వాత..

*VBVK: ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

*RGV: స్వర్గంలో వాళ్లుంటారనే అపోహ వద్దు.. ఆ పని ఇప్పుడే చేయండి

*Richa Panai: అవకాశాలు లేక ఈ భామ ఇప్పుడేం చేస్తుందో తెలుసా?

*SS Rajamouli: జక్కన్న మంట పుట్టించాడు.. ఈ పిక్‌కి అర్థం అదేనా?

Updated Date - 2023-03-17T23:05:48+05:30 IST