Shruti Haasan: సిల్లీ క్వశ్చన్ అడగమంటే.. శృతిని అలాంటి ప్రశ్నేనా అడిగేది?

ABN , First Publish Date - 2023-03-17T17:05:23+05:30 IST

కెరీర్ పిక్ స్టేజ్‌లో ఉండగా.. ప్రేమ అంటూ గ్యాప్ తీసుకున్న స్టార్ హీరోయిన్ శృతిహాసన్ (Shruti Haasan).. ఇటీవలే మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రీ ఎంట్రీలో ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veeraiah), ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) చిత్రాలతో

Shruti Haasan: సిల్లీ క్వశ్చన్ అడగమంటే.. శృతిని అలాంటి ప్రశ్నేనా అడిగేది?
Heroine Shruti Haasan

కెరీర్ పిక్ స్టేజ్‌లో ఉండగా.. ప్రేమ అంటూ గ్యాప్ తీసుకున్న స్టార్ హీరోయిన్ శృతిహాసన్ (Shruti Haasan).. ఇటీవలే మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రీ ఎంట్రీలో ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veeraiah), ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) చిత్రాలతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ రెండు సినిమాలు సంక్రాంతికి విడుదల కావడం విశేషం. సంక్రాంతికి విడుదలైన భారీ సినిమాలలో.. రెండు సినిమాలలో నటించి విజయం అందుకున్న హీరోయిన్‌గా శృతిహాసన్ రికార్డ్‌ను క్రియేట్ చేసింది. ఇప్పుడు ప్రభాస్ పాన్ ఇండియా చిత్రం ‘సలార్’ (Salaar)లో హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఒక వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు తన బాయ్ ఫ్రెండ్ శాంతను హజారికా (Santanu Hazarika)తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఫొటోలను సోషల్ మీడియాలో శృతి హాసన్ షేర్ చేస్తుంటుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆమె.. ఏదో రకంగా హాట్ టాపిక్‌ అవుతూనే ఉంటుంది. తాజాగా ఆమె ఇన్‌స్టా వేదికగా కాసేపు నెటిజన్లతో చిట్‌చాట్ (Chit Chat) చేసింది. అందులో ఆమె అడగమన్న క్వశ్చన్స్.. అందుకు నెటిజన్లు అడిగిన క్వశ్చన్స్.. దానికి ఆమె ఇచ్చిన ఆన్సర్స్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ద సోషల్ మీడియా (Talk of the Social Media) అవుతున్నాయి.

మరీ ముఖ్యంగా ఓ నెటిజన్ (Netizen) అడిగిన ప్రశ్న అయితే.. ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతూ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. తన బాయ్ ఫ్రెండ్ శాంతను హజారికాతో సరదాగా ఉన్న టైమ్‌లో శృతి హాసన్.. ‘ఏదైనా సిల్లీగా నన్ను అడగండి.. ఓన్లీ సిల్లీ’ అంటూ చాట్ సెషన్ నిర్వహించింది. ఆమె సిల్లీగా అడగమంది కదా.. అని నెటిజన్లు ఇష్టం వచ్చినట్లుగా ప్రశ్నలు అడిగేశారు. అందులో ‘నేను మీతో సహజీవనం చేయాలనుకుంటున్నాను’ అని ఓ నెటిజన్ అడుగగా.. అందుకు శృతి ‘నో’ అని చెప్పింది. మరో నెటిజన్ యూరిన్‌కి సంబంధించి ఓ జుగుప్సాకరమైన ప్రశ్న (Vulgar Question) అడిగితే.. ఎటువంటి సిగ్గు పడకుండా.. అంతే జుగుప్సాకరంగా శృతిహాసన్ సమాధానమిచ్చింది. ఇలా నడుస్తున్న చాట్‌లో.. ఓ నెటిజన్ శృతిని అడగకూడని ప్రశ్న అడిగేశాడు. అదేంటంటే..

shruti-Haasan.jpg

‘వకీల్ సాబ్’ (Vakeel Saab) సినిమాలో హీరోయిన్‌ని ప్రకాశ్ రాజ్ (Prakash Raj), విలన్‌ని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అడిగినట్లుగా ‘నువ్వు వర్జిన్ (Virgin) వా’ అంటూ ఓ నెటిజన్ శృతిని అడిగాడు. దానికి శృతి సమాధానం చెప్పలేదు సరికదా.. అసలు నీకు వర్జిన్ స్పెల్లింగ్ రాయడం వచ్చా.. ముందు అది నేర్చుకో అంటూ కౌంటర్ వేసింది. అయితే.. ‘‘సిల్లీగా కావాలని అడిగింది నీవే కదా.. నువ్వు కావాలనుకున్న ఆ సిల్లీ క్వశ్చనే కదా నెటిజన్ అడిగింది. స్పెల్లింగ్ మిస్టేక్ కావచ్చు.. కానీ దానర్థం నీకు అర్థమైందిగా.. సమాధానం చెప్పొచ్చుగా’’ అంటూ కొందరు నెటిజన్లు శృతిహాసన్‌ను ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం శృతిని నెటిజన్ అడిగిన ప్రశ్నకు సంబంధించిన స్ర్కీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి:

*********************************

*Pavitra Lokesh: పెద్ద బాంబ్ పేల్చిన పవిత్రా లోకేష్ మొదటి భర్త.. పాపం నరేష్..?

*Kantara: ఆస్కార్‌తో ‘ఆర్ఆర్ఆర్’‌ చరిత్ర సృష్టించింది.. ఇక ‘కాంతార’ వంతు!

*Ram Gopal Varma: డిగ్రీ పట్టాని అలా వదిలేశాడేంటి? 37 ఏళ్ళ తర్వాత..

*Roshan Kanakala: హీరోగా యాంకర్ సుమక్క కొడుకు.. లుక్ అదిరింది

*VBVK: ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

*RGV: స్వర్గంలో వాళ్లుంటారనే అపోహ వద్దు.. ఆ పని ఇప్పుడే చేయండి

*Chiranjeevi: సినీ నటుడు చిరంజీవికి హైకోర్టులో ఎదురుదెబ్బ..

*Richa Panai: అవకాశాలు లేక ఈ భామ ఇప్పుడేం చేస్తుందో తెలుసా?

*The Elephant Whisperers: ఆస్కార్ అందుకున్న ఆనందం ఆవిరైంది

*SS Rajamouli: జక్కన్న మంట పుట్టించాడు.. ఈ పిక్‌కి అర్థం అదేనా?

Updated Date - 2023-03-17T17:05:23+05:30 IST